రాష్ట్రం లో “ ఆస్తులు -అంతస్తులు “ సినిమా ఇపుడు విజయవంతంగా , రసవత్తరంగా నడుస్తున్న సంగతి తెలిసిందే . అయితే , ఈ సినిమాకు , “ఆస్థులు – అంతస్థులు” అనే టైటిల్ కంటే , “ సొమ్మొకళ్లది-సోకొకళ్లది “ టైటిల్ అయితే , సినిమా అదిరిపోయేది అంటున్నారు వీక్షకులు .
అయితే , ఏ సస్పెన్స్ , కామెడీ , ఫ్యామిలీ , అన్నా …చెల్లెలు , మదర్ సెంటిమెంట్, లీగల్ ట్విస్ట్ లతో మిళితమై పోయిన ఈ హారర్ చిత్రం వెనుక, నారా చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ ఉన్నదని కూడా అంటున్నారు . ఈ సినిమాకు కథ , స్క్రీన్ ప్లే , డైలాగ్స్ లో చంద్రబాబు హస్తం ఉన్నదని ఓ డోకు పత్రిక కథనం .
ఎందుకంటే ……!
” 1945 ఆగస్ట్ 6 వ తేదీన జపాన్ లోని హిరోషిమా , నాగసాకి పట్టణాలపై అమెరికా ఆటం బాంబులు వేయడం వెనుక చంద్రబాబు నాయుడు కుట్ర ఉంది .
అదే ఏడాది ఏప్రిల్ 30 వ తేదీన జర్మనీ నియంత అడాల్ఫ్ హిట్లర్.. ఒక నేల మాళిగ లో పిస్టల్ తో కాల్చుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన వెనుక కూడా చంద్రబాబు నాయుడు కుట్ర ఉంది .
ఇండియా నుంచి పాకిస్తాన్ 1947 లో విడిపోవడం కూడా చంద్రబాబు నాయుడు కుట్ర ఫలితమే. కార్గిల్ లోనూ చంద్రబాబు కుట్ర ఫలితం గానే , పాకిస్థాన్ జనరల్ ముషారఫ్ ఇండియా మీద యుద్ధానికి దిగాడు .
పాకిస్తాన్ లో భాగమైన తూర్పు పాకిస్తాన్ ను పాకిస్తాన్ నుంచి విడగొట్టడానికి చంద్రబాబు నాయుడు కుట్రలు కారణం కాదా !? చివరకు 1971 లో అది బంగ్లాదేశ్ గా మారిపోయింది .
అసలు లాల్ బహదూర్ శాస్త్రి తాష్కెంట్ వెళ్లి , గుండెపోటు తో 1966 జనవరి 11 న హఠాత్తు గా చనిపోవడానికి కారణం ఎవరు ? ముమ్మాటికీ చంద్రబాబు నాయుడే.
ఆ మాటకొస్తే ; మహాత్మా గాంధీని 1948 జనవరి 30 న చేసిన హత్య వెనుక చంద్రబాబు కుట్ర లేదా అని అడుగుతా ఉండా . ఆయన కుట్ర లేకపోతే , సీబీఐ ఎంక్వైరీ కి ఆయన ఎందుకు డిమాండ్ చేయలేదు ?
అసలు అంతదూరం దాకా ఎందుకు !? 52 ఏళ్ళ పాటు మహారాణి లాగా ప్రపంచాన్ని 98 ఏళ్ళ వయసు వచ్చేవరకు పాలించిన బ్రిటిష్ మహారాణి ఎలిజబెత్ హఠాత్తుగా చనిపోవడం వెనుక చంద్రబాబు కుట్ర లేదా ?
ఉక్రెయిన్ మీద రష్యా ప్రెసిడెంట్ యుద్ధం ప్రకటించడం వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు . తనకు సంబంధం లేదని చంద్రబాబు నాయుడు రుజువు చేసుకోవాలని సవాలు చేస్తున్నా .
అమెరికా ప్రెసిడెంటు జో బెయిడన్ రెండో సారి ప్రెసిడెంట్ గా పోటీ చేద్దామని రెడీ అయిపోయింది నిజం కాదా ? దానికి కుట్ర తో చంద్రబాబు నాయుడు అడ్డం కొట్టింది నిజం కాదా ?
జయలలిత ఎంత గొప్ప నాయకురాలు ? చంద్రబాబు కుట్రలకు బలి కాకుండా ఉంటే….ఆవిడ మరో అరవై ,డెబ్భై ఏళ్ళ పాటు ముఖ్యమంత్రి గా ఉండేవారు కదా !
గుర్తు పెట్టుకోండి. మరో పాతికేళ్ళు మించి ఆయన కుట్రలు చెయ్యలేడు!
ప్రజలు అమాయకులు అనుకుంటున్నాడు . కాదు. 2047 తరువాతైనా వాళ్లు చంద్రబాబు నిజస్వరూపం తెలుసుకుంటారు . రాష్ట్రాన్ని ఎంత నాశనం చేస్తున్నాడో చూస్తుంటే గుండె తరుక్కు పోతున్నది !! ఈ ఐటీ లు , డ్రోన్ లు మనకు ఇంటా …వంటా ఉన్నాయా ? ఎప్పుడైనా విన్నామా?
మన అక్కమ్మలకు , చెల్లెమ్మలకు , అత్తమ్మలకు , కావలసింది ఏమిటి ? పొద్దుటిపూట చేపలు పులుసు వండుకుని కడుపునిండా తినడానికి అమ్మ ఒడి ,సాయంకాలాలు సంతోషం గా పడుకోడానికి ఓ క్వార్టరు బుడ్డి. అవి జాలవా ? అవి జాలవా సంతోషం గా జీవితం ఎల్లమారిపోవడానికి !?ఐటీ లు , డ్రోన్ లు కూడెడతాయా…. గుడ్డెడతాయా?
ఇదంతా చంద్రబాబు కుట్రే ! ఇంకో ముప్ఫై ఏళ్ళకయినా చంద్రబాబు కుట్రను మన ఓటరన్నలు , ఓటరక్కలు , ఓటరు తాతలు , ఓటరవ్వలు తెలుసుకోలేక పోరు .అప్పుడు చెబుతాం చంద్రబాబు పని . మేం ఎక్కడికీ పోం ! భూమి ఉన్నంత కాలం , సూర్య చంద్రులున్నంత కాలం , క్వార్టరు బాటిళ్లు దొరికినంత కాలం, ఇసుక- గనులు ఉన్నంత కాలం , బ్రాందీ -బీరు ఉన్నంత కాలం మేం ఉంటాం ! అప్పుడు చెబుతాం చంద్రబాబు పని . సత్యమేవ జయతే !!