Suryaa.co.in

Telangana

కేంద్ర లెక్కలు చూసైనా బుద్ధి తెచ్చుకోండి

– నేడు గొర్ల పంపిణీ లే… చేప పిల్లల పంపిణి నిలిపేసి కుల వృత్తులను రూపుమాపే కుట్ర
– ‘ఎక్స్’ వేదికగా రేవంత్ సర్కార్‌పై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫైర్

హైదరాబాద్: పంటల దిగుబడిలోనే కాదు..పశు సంపదలోనూ గత పదేళ్లూ పండగే. కులవృత్తులకూ కేసిఆర్ కొండంత అండగా నిలవడం వల్లే పశుసంపదలోనూ గణనీయ వృద్ధి. గ్రామీణ తెలంగాణలో ఉపాధి పెంచాలనే తపన, సంపద సృష్టిలో అందరినీ భాగస్వామ్యం చేయాలనే తాపత్రయం.

తెలంగాణలో ఉన్న డిమాండ్ తగ్గట్టుగా..ఇక్కడే మాంసం, పౌల్ట్రీ ఉత్పత్తులు పెంచే ప్రయత్నం. ఇతర రాష్ట్రాలనుంచి ప్రతినిత్యం వచ్చే వందలాది లారీల దిగుబడికి పదేళ్లలో కళ్లెం.

ప్రతి ఆలోచన వెనక.. ఒక సుదీర్ఘ అధ్యయనం. కేసిఆర్ లక్ష్యం.. ఆరోగ్య తెలంగాణ నిర్మాణం.పదేళ్లలో (2000)వేల కోట్ల వృద్ధి జరిగిందని కేంద్రం ప్రకటించడం సంతోషం.

ఈ అద్భుత స్కీములను.. స్కాములు అని.. దుష్ప్రచారం చేసిన దుర్మార్గులు..ఇకనైనా తీరు మార్చుకోవాలి. కళ్లముందు ఆవిష్కృతమైన ఈ అద్భుతాలను చూసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోవాలి.

కానీ నేడు గొర్ల పంపిణీ లేక – చేప పిల్లల పంపిణి నిలిపేసి కుల వృత్తులను రూపుమాపే కుట్రలు చేస్తున్న పాలకులారా.. కేంద్ర లెక్కలు చూసైనా బుద్ధి తెచ్చుకోండి. జై తెలంగాణ.

LEAVE A RESPONSE