– రేవంత్ రెడ్డికి ముందుంది ముసళ్ళ పండగ
– మమ్మల్ని జైల్లో పెట్టడానికి భయపడుతున్నారా?
– ఒవైసీ గురించి ముస్లింలకు తెలుసు
– విద్యుత్ కమీషన్ చైర్మన్ విచారణ చేయకుండా నివేదిక ఎట్లా ఇస్తారు?
– సీసీఐ నుండి కిలో పత్తి కొనలేదు
– కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు లేవు
– పత్తి రైతులకు కాంగ్రెస్,బీజేపీ పార్టీల ద్రోహం
– సీఎం,డిప్యూటీ సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో ఎంజాయ్ చేస్తున్నారు
– మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణలో రైతాంగం పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. దొంగ లెక్కలతో రుణమాఫీ చేశామని ప్రభుత్వం అంటోంది. రుణమాఫీని దేశం మొత్తం చెప్పుకునే ప్రయత్నం కాంగ్రెస్ చేస్తోంది. రైతు భరోసా ఇవ్వమని రైతులు మొత్తుకుంటున్నారు. రైతులు పండించిన పత్తిని ప్రభుత్వం కొనడం లేదు.
వరి ధాన్యం కేంద్రాలు లేకపోవడంతో రైతులు ధాన్యం కల్లాల్లో ఆరబోసుకుంటున్నారు. ప్రభుత్వం ఇప్పటి వరకు మిల్లర్లతో చర్చలు చేయలేదు. వరి ధాన్యం,పత్తి కొనుగోళ్లపై సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు సమీక్ష చేయలేదు.
కొనుగోలు కేంద్రాల్లో గోనె సంచులు లేవు. సన్న వరి ధాన్యానికి 500 రూపాయలు బోనస్ ఇస్తామని ప్రభుత్వం చెప్పింది. దొడ్డు వడ్లకు బోనస్ ఇవ్వాలని రైతులు కోరుతున్నారు. రైతులు రోడ్లపై వరి ధాన్యం ఆరబెడుతున్నారు.
పత్తి రైతులకు కాంగ్రెస్,బీజేపీ పార్టీలు ద్రోహం చేశాయి. ప్రభుత్వం సీసీఐ నుండి కిలో పత్తి కొనలేదు. సీఎం,డిప్యూటీ సీఎం, మంత్రులు ఇతర రాష్ట్రాల్లో ఎంజాయ్ చేస్తున్నారు. పక్క రాష్ట్రాల్లో ఎన్నికల ప్రచారం చేస్తున్నారు తెలంగాణ పత్తి పంటకు కేంద్రం 7,000 మద్దతు ధర ప్రకటించింది. గుజరాత్ లో పత్తి పంటకు 8,000 మద్దతు ధర ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీకి అధికారం ఇచ్చింది గ్రామీణ ప్రాంతాలు. ఫోర్త్ సిటీ,ఫిఫ్త్ సిటీ అంటూ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారు.
గ్రామీణ ప్రాంతాల్లో అడ్డగోలుగా విద్యుత్‌కోతలు ఉన్నాయి. 2014 కు ముందు ఉన్న పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి నల్గొండ జిల్లా ఫ్లోరైడ్
బారిన పడే పరిస్థితి వచ్చింది. రైతుల ట్రాన్స్ఫార్మర్స్ కాలిపోతే పట్టించుకోవడం లేదు.
రేవంత్ రెడ్డి మోదీని తిట్టినా బీజేపీ నేతలు సైలెంట్ గా ఉన్నారు. రేవంత్ రెడ్డిని విమర్శించే మొగోడు బీజేపీలో లేడు.రైతు రుణమాఫీ అందరికీ కాలేదని వ్యవసాయ శాఖామంత్రి అంటున్నారు. రెండు లక్షల మందికి రుణమాఫీ అయిందని సీఎం రేవంత్ రెడ్డి దబాయిస్తున్నారు. అరెస్టులతో ఉద్యమాన్ని రేవంత్ రెడ్డి ఆపలేరు రేవంత్ రెడ్డి తప్పులను సోషల్ మీడియా ఎత్తిచూపుతోంది.
ప్రజల గొంతు మీడియా మారుతోంది. రేవంత్ రెడ్డికి ముందుంది ముసళ్ళ పండగ ధాన్యం ప్రభుత్వానికి ఇస్తే డబ్బులు వస్తాయో రావో అని రైతులు భయపడుతున్నారు పాలనలో రేవంత్ రెడ్డి నైజం బయటపడింది. ఢిల్లీకి మూటలు పంపడంలో రేవంత్ రెడ్డి మంత్రులు పోటీ పడుతున్నారు.
విద్యుత్ కమీషన్ చైర్మన్ మదన్ బీ లోకూర్ ఎప్పుడు పని చేశారో మాకు తెలియదు. విచారణ చేయకుండా నివేదిక ఎట్లా ఇస్తారు?
విద్యుత్ కమీషన్ విచారణ పూర్తి చేసినట్లు ప్రభుత్వం అధికారికంగా చెప్పింది. మా వివరణ చైర్మన్ తీసుకోలేదు. కొన్ని మీడియా సంస్థలు మాపైన విషం కక్కుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆరోపణలను
మీడియా సంస్థలు ప్రచారం చేస్తున్నాయి. కమీషన్ వేస్తున్నట్లు సీఎం అసెంబ్లీలో ప్రకటించారు. కమిషన్ విచారణ పూర్తి అయితే అసెంబ్లీలో వివరాలు బయట పెట్టాలి.
కేసీఆర్ ముందు చిల్లర వేషాలు వేయలేరు. దొంగతనంగా ఎందుకు లీకులు ఇస్తున్నారు? మమ్మల్ని జైల్లో వేసే ఆలోచన వస్తే ఆలస్యం ఎందుకు? మమ్మల్ని జైల్లో పెట్టడానికి భయపడుతున్నారా? కాంగ్రెస్ ఏడాది పాలన చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. విద్యుత్ కమిషన్ రిపోర్ట్ ఇస్తే ప్రజల ముందు పెట్టు.
కేసీఆర్ 24 గంటల కరెంటు ఇచ్చినందుకు జైల్లో పెడతారా? నివేదికలో
ఏముండదని ముందే లీకులు ఇస్తున్నారు. కాంగ్రెస్ ఏడాది సంబరాల్లో
రాహుల్ గాంధీ పోలీసులు లేకుండా అశోక్ నగర్ రైతుల వద్దకు రావాలి. ప్రభుత్వానికి ప్రజలు తిథి పెట్టడానికి రెడీగా ఉన్నారు. రాష్ట్రంలో ఒక్క వర్గం సంతోషంగా ఉందని రేవంత్ రెడ్డికి చెప్పే ధైర్యం ఉందా? రాష్ట్రంలో రియల్ ఎస్టేట్,నిర్మాణ రంగం కుదేలు అయింది.
రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం 4వేల కోట్లు ఎందుకు తగ్గింది? కాంగ్రెస్ నేతలు అవినీతితో జేబులు నింపుకుంటున్నారు. పోలీసులను చూసి ప్రభుత్వం భయపడే స్థితికి వచ్చింది. ఏం చేశారని రేవంత్ రెడ్డి ఏడాది సంబురాలు చేసుకుంటారు? రేవంత్ రెడ్డికి సర్టిఫికేట్ ఇవ్వాల్సింది ప్రజలు. మూసీ శుద్దిని ప్రారంభం చేసింది బిఆర్ఎస్ పార్టీ. అసదుద్దీన్ ఒవైసీ గురించి ముస్లింలకు తెలుసు.