Suryaa.co.in

Andhra Pradesh

విజయవాడ-శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’.. 9న ప్రయోగం

అమరావతి: విజయవాడ పున్నమిఘాట్ నుంచి శ్రీశైలం మధ్య ‘సీ ప్లేన్’ జర్నీకి ఈ నెల 9న సీఎం చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టనున్నారు. డీ హవిల్లాండ్ ఎయిర్ క్రాఫ్ట్ రూపొందించిన 14 సీట్ల సీ ప్లేన్ను ఆయన ప్రారంభిస్తారు. ఆ రెండు ప్రాంతాల మధ్య దీన్ని నడిపేందుకు ఉన్న అనుకూలతలపై అధికారులు తొలుత ప్రయోగం నిర్వహిస్తారు. ఇది విజయవంతమైతే రెగ్యులర్ సర్వీసును ప్రారంభిస్తారు. దీనివల్ల పర్యాటక రంగానికి మరింత ఊతం వస్తుందని భావిస్తున్నారు.

LEAVE A RESPONSE