– ఏపీ రాష్ట్ర తెలుగు నాడు భవన నిర్మాణ కార్మిక సంఘ సమావేశంలో వక్తలు
మంగళగిరి: తెలుగు నాడు ట్రేడ్ యూనియన్ కౌన్సిల్ (టి ఎన్ టి యు సి) అనుబంధ విభాగం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు నాడు భవన నిర్మాణ కార్మిక సంఘం రిజిస్ట్రేషన్ చేయించిన అనంతరం తొలి సమావేశం సోమవారం తెలుగుదేశం పార్టీ(టీడీపీ) కేంద్ర జాతీయ కార్యాలయంలో టి ఎన్ టి యు సి రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల రఘురామరాజు అధ్యక్షతన జరిగింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగు నాడు భవన నిర్మాణ కార్మిక సంఘం జిల్లా, అసెంబ్లీ నియోజకవర్గ కమిటీల నియామకం, బలోపేతం పై చర్చించారు. ఎం ఎల్ సి టిఎన్టియుసి ఇన్ఛార్జి దువ్వారపు రామారావు ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.
టి ఎన్ టి యు సి కమిటీ సభ్యులు కార్మిక లోకంలో చైతన్యం తీసుకువచ్చి గత ప్రభుత్వం కార్మిక వ్యతిరేక నిర్ణయాలపై పోరాటం చేశారన్నారు. గొట్టుముక్కల రఘురామరాజు మాట్లాడుతూ భవన నిర్మాణం రంగం కుదేలయ్యి కార్మికులు పక్క రాష్ట్రాలకు వలసలు పోయి రోడ్డుపాలు అవ్వడానికి, ఎంతోమంది ఆత్మహత్యలకు కారణం గత ప్రభుత్వం ఇసుక విధానమేనని ఆరోపించారు. ఎం.ఎల్.సి, టీడీపీ జాతీయ కార్యాలయ కార్యదర్శి పరుచూరి అశోక్ బాబు మాట్లాడుతూ కార్మికులను చైతన్య పరిచి భవన నిర్మాణ సంక్షేమ బోర్డును తిరిగి పునర్నిర్మించి, గత ప్రభుత్వం తరలించిన 1,800 కోట్ల రూపాయలను తిరిగి భవన నిర్మాణ సంక్షేమ బోర్డులు జమ చేయించే విధంగా కృషి చేద్దామని పిలుపునిచ్చారు.
కార్మికులకు లబ్ధి చేకూరే విధంగా సంక్షేమ పథకాలు అందే విధంగా మనం కృషి చేసిన నాడు మిగిలిన కార్మికులు కూడా మన యూనియన్ లో చేరేందుకు అవకాశం ఉంటుందని అభిప్రాయపడ్డారు. ఈ సమావేశంలో రాష్ట్ర తెలుగునాడు భవన నిర్మాణ కార్మిక సంఘానికి జిల్లా కమిటీలు ఏర్పాటు చేసేందుకు 15 మందితో అడ్ హక్ కమిటీని నియమించారు.
ఈ సమావేశంలో టి ఎన్ టి యు సి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జోన్ ఇన్ఛార్జీలు రెంటపల్లి శ్యామ్, కోగంటి లెనిన్ బాబు, అంబూరు సింధుజ, రాష్ట్ర ఉపాధ్యక్షులు అంబూరు మల్లికార్జునరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు నాగోతి శివాజీ, మొకర ఆదిబాబు, రాష్ట్ర కార్యదర్శులు బుస్సే నాగ ప్రసాద్, నిరీక్షణరావు, సోషల్ మీడియా కో ఆర్డినేటర్ లక్కిశెట్టి కనకారావు, జిల్లా అధ్యక్షులు నక్క లక్ష్మణరావు, సుంకర విష్ణు కుమార్, విక్రమ జగన్నాథం, కొండవీటి శివయ్య, పొన్నమళ్ళ కొండబాబు, నాగార్జున, జిల్లా కార్యదర్శి పళ్లెం సుబ్బారావు, నియోజవర్గ అధ్యక్షులు బురుసు శివయ్య, పుల్లారావు, మరియు వివిధ జిల్లాల నుంచి భవన నిర్మాణ రంగ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.