Suryaa.co.in

Telangana

లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ ను మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దుతాం

– మేయర్, కలెక్టర్, కమిషనర్ లతో కలసి రైతులు, వ్యాపారులు, విక్రయదారులతో కలియతిరుగుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకొన్న మంత్రి కొండా సురేఖ

వరంగల్: లక్ష్మీపురం కూరగాయల మార్కెట్ను మోడల్ మార్కెట్ గా తీర్చిదిద్దుతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.

మంగళవారం నగర మేయర్ గుండు సుధారాణి, వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా, జిడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ, సంబంధిత శాఖల అధికారు లతో కలసి వరంగల్ లక్ష్మీపురం కూరగాయల మార్కెట్, పండ్ల మార్కెట్ లను పరిశీలించి, రైతులు, వ్యాపారులు, విక్రయదారులతో కలియతిరుగుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకొని సమస్యల పరిష్కారానికి మంత్రి హామీ ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో తాను శాసన సభ్యులుగా ఉన్నప్పుడు నిరుపేదలకు, అర్హులకు ఆదుకోవాలని ఉద్దేశంతో మాడల్ మార్కెట్ కు శంకుస్థాపన చేసి పనులు కూడా ప్రారంభించడం జరిగిందన్నారు.

గత రాజకీయ నాయకుల ప్రాబల్యంతో అనర్హులు బినామీ పేర్ల మీద దుకాణాలు కేటాయించుకొని విక్రయదారుల నుండి డబ్బులు వసూలు చేసుకుంటూ దందా నిర్వహిస్తున్నారని తెలిపారు. దుకాణాల కేటాయింపులో అవగాతవకలు జరిగాయని, అర్హులకు అన్యాయం జరిగిందని, ప్రత్యేకంగా ఒక కమిటీని ఏర్పాటు చేసి విచారణ నిర్వహించి అనర్హులకు ఖచ్చితంగా తొలగించి లైసెన్స్ లో ఉన్న వారిని, నిజమైన అర్హులకు మాత్రమే పారదర్శకంగా దుకాణాలు కేటాయించేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు.

LEAVE A RESPONSE