– మేధావులు కొడంగల్ కు వెళ్లి రావాలి
– ప్రభుత్వం కేసులు ఎందుకు పెడుతోంది?
– కేసీఆర్ ను చూసి రేవంత్ రెడ్డికి ఎందుకు భయం?
– వాల్మీకి స్కామ్ లో ఎందుకు బీజేపీ విచారణ చేయడం లేదు?
– అవినీతిపై బండి సంజయ్,కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు?
– మంత్రిపై జరిగిన ఈడీ రైడ్స్ ను ఎందుకు బయటపెట్టలేదు?
– రైతులను దళారీలకు,మిల్లర్లకు వదిలేశారు.. దీని వెనుక వందల కోట్ల అవినీతి
– నల్గొండ జిల్లా మంత్రి వందల కోట్లు వసూలు చేశారు
– మాజీమంత్రి ,ఎమ్మెల్యే జి .జగదీష్ రెడ్డి
హైదరాబాద్: కొడంగల్ లో అధికారులపై జరిగిన దాడి రేవంత్ రెడ్డిపై జరిగిన దాడి. రేవంత్ రెడ్డి స్వంత నియోజకవర్గంలో ప్రజల తిరుగుబాటు మొదలయింది. కలెక్టర్ మాపైన దాడి జరగలేదని చెప్పారు. ప్రభుత్వం కేసులు ఎందుకు పెడుతోంది? రాష్ట్రంలో మేధావులు కొడంగల్ కు వెళ్లి రావాలి. కొడంగల్ నియోజకవర్గంలో అధికారులను అడ్డుకోవాలని బిఆర్ఎస్ పిలుపు ఇవ్వలేదు. కొడంగల్ ఘటన వెనుక బిఆర్ఎస్ కుట్ర ఉందని కాంగ్రెస్ అనడంలో ఆశ్చర్యం లేదు. కొడంగల్ లో ఏం జరిగిందో మేధావులు, ఆచార్యులు, పౌర హక్కుల నేతలను పంపాలి.
పత్తి,వరి ధాన్యం కొనుగోలు విషయంలో రైతులతో ప్రభుత్వం ఆడుకుంటోంది. సీఎం రేవంత్ రెడ్డి రివ్యూ చేస్తున్నట్లు డ్రామాలు ఆడుతున్నారు. పధకం ప్రకారం రైతులను దళారీలకు,మిల్లర్లకు వదిలేశారు. దీని వెనుక వందల కోట్ల అవినీతి జరిగింది.
ప్రభుత్వంలో మంత్రులు దళారులతో,మిల్లర్లతో కుమ్మక్కు అయ్యారు. పదేళ్ల కాలంలో కేసీఆర్ పండిన ప్రతి గింజను కొన్నారు. కొనుగోలు కేంద్రాల్లో ఎలాంటి ఏర్పాట్లు చేయలేదు. నల్గొండ జిల్లా మంత్రి రైతుల వద్ద ధాన్యం కొనకుండా అధికారులను బెదిరించారు.నల్గొండ జిల్లా మంత్రి దళారులతో కుమ్మక్కు అయ్యి వందల కోట్లు వసూలు చేశారు.
2014 కు ముందు రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మళ్లీ వచ్చాయి. రైతులు ఎందుకు దోపిడీకి గురి అవుతున్నారో సీఎం,వ్యవసాయ శాఖా మంత్రి సమాధానం చెప్పాలి. ఇప్పటి వరకు ఒక్క గింజ సన్న వడ్లు ప్రభుత్వం కొనలేదు. సమాధానం చెప్పడానికి అధికారులు భయపడుతున్నారు.
రేవంత్ రెడ్డి దిగజారి మాట్లాడుతున్నారు. సమస్యలు పక్కదారి పట్టడానికి రేవంత్ రెడ్డి బూతులు మాట్లాడుతున్నారు. మర్చిపోయారు అంటున్న కేసీఆర్ ను చూసి రేవంత్ రెడ్డికి ఎందుకు భయం? కేసీఆర్ రాహుల్ గాంధీని ఏమన్నాడు? కేసీఆర్ ను చూస్తే వణుకు ఎందుకు?
కేసీఆర్ ను నోటికి వచ్చినట్లు బూతులు తిట్టి రేవంత్ రెడ్డి టైం పాస్ చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీని వాడుకుని రేవంత్ రెడ్డి సీఎం అయ్యారు. నిజమైన కాంగ్రెస్కార్యకర్తలు రేవంత్ రెడ్డిని చూసి భయపడుతున్నారు. చెడ్డ పేరు తెచ్చుకుని చరిత్రలో నిలిచిపోవాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు.
ఎంత వరి,పత్తి కొన్నారో వ్యవసాయ శాఖామంత్రి సివిల్ సప్లైస్ శాఖా మంత్రి సమాధానం చెప్పాలి. ఢిల్లీకి 25 సార్లు సీఎం రేవంత్ రెడ్డి ఢీల్లి వెళ్లి ఎవరి కాళ్ళు మొక్కారో ప్రజలకు తెలుసు. ఉదయం రాహుల్ గాంధీ,కె.సి.వేణుగోపాల్.. రారాత్రి మోడీ,అమిత్ షా కాళ్ళు రేవంత్ రెడ్డి పట్టుకుంటున్నారు.
కేటీఆర్ చెప్పి ఢిల్లీకి వెళ్లారు. కేటీఆర్ ఎక్కడ వున్నారు. ఎవరిని కలిశారు నీ ఇంటిలిజెన్స్ ఉంది కదా? కేటీఆర్ ఢీల్లికి వెళ్ళింది కాంగ్రెస్ ,బీజేపీ పార్టీల బండారం బయటపెట్టడానికి. రేవంత్ రెడ్డి ఢీల్లి వెళ్ళడానికి 300 కోట్లు ఖర్చు పెట్టారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ప్రచారానికి తెలంగాణ నుండి 300 కోట్లు పంపారు.
ఎప్పుడు బయటకు రావాలో కేసీఆర్ కు తెలియదా? రేవంత్ రెడ్డికి సీనియర్లు చెప్పే పరిస్థితి లేదు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని ఖతం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు భాదపడుతున్నారు. ఎవిడెన్స్ కోసం బిఆర్ఎస్ పార్టీకి చెందిన మాజీ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. దానికి మాజీ ఎమ్మెల్యేలు సమాధానం ఇస్తారు.
మహారాష్ట్రలో ఎవరు గెలిస్తే మాకు ఏంటి? ఓడితే మాకు ఏంటి కాంగ్రెస్,బీజేపీ ఒక్కటే అని అంటున్నాం. రాష్ట్ర ప్రభుత్వం అవినీతిపై బండి సంజయ్,కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడటం లేదు? వాల్మీకి స్కామ్ లో ఎందుకు బీజేపీ విచారణ చేయడం లేదు? రాష్ట్ర మంత్రిపై జరిగిన ఈడీ రైడ్స్ ను ఎందుకు బయటపెట్టలేదు? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు రేవంత్ రెడ్డి వీపు పగలగొట్టడం ఖాయం.