– నరేందర్ రెడ్డిని కుట్రతోనే జైల్లో వేశారు
– ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి
హైదరాబాద్: లగచర్ల గ్రామ చుట్టుపక్కల పచ్చని పంటపొలాలు, అధిక దిగుబడినిచ్చే పంట పొలాలు ఉన్నాయి. ప్రభుత్వం మొండితనంతో ముందుకు వెళ్తుంది. పోలీసులు అధికారులకు భద్రత ఎందుకు కల్పించలేదు ? రైతులు బాధతో జరిగిన తోపులాటలో భాగమే కానీ కుట్ర కాదు అనుకోకుండా జరిగిన సంఘటన అది.
రైతులపై ప్రభుత్వం కక్ష్య పూరితంగా వ్యవహరించడం సరికాదు. మాజీ ఎమ్మెల్యే నరేందర్ రెడ్డి ఆ సంఘటన జరిగిన రోజు అక్కడ లేడు. నరేందర్ రెడ్డిని కుట్రతోనే జైల్లో వేశారు. బీఆర్ఎస్ సర్కార్ గతంలో 14 వేల ఎకరాల భూమిని ఫార్మా సిటీకి కేటాయించింది. మళ్ళీ ఎందుకు ఇప్పుడు కొత్తగా భూసేకరణ?
జిల్లాకు పెద్ద దిక్కు అని చెప్పుకుంటున్న పట్నం మహేందర్ రెడ్డి ఈ ఘటనపై ఎందుకు స్పందించడం లేదు? నరేందర్ రెడ్డి జైలుకి వెళ్ళడానికి మహేందర్ రెడ్డి హస్తం ఉంది. నరేందర్ రెడ్డిని వెంటనే విడుదల చేయాలి. పట్నం కుటుంబంపై నిజంగా మహేందర్ రెడ్డికి ప్రేమ ఉంటే ఎమ్మెల్సీ పదవికి, చీఫ్ విప్ పదవికి రాజీనామా చేయాలి.