Suryaa.co.in

Telangana

ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దోళ్లు అయిపోరు

– ప్రకాష్ గౌడ్, గాంధీలకు సిగ్గుందా?
– దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి
– కేసీఆర్ అంటే ఒక శక్తి
– మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు
– సోనియా గాంధీని మాత్రమే కాదు. మొత్తం ప్రజలందరినీ మోసం చేశాడు
– గాడ్సే వారసుడు రేవంత్ రెడ్డి
– రాజేంద్రనగర్ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మల్లాద్రి నాయుడు, షేక్ అరిఫ్ లు తమ అనుచరులతో కలిసి కేటీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణలో భవన్ లో బీఆర్ఎస్ లో చేరిన సందర్భం లో మాట్లాడిన బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్

హైదరాబాద్: రాష్ట్రంలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలను మీరంతా గమనిస్తూనే ఉన్నారు. తెలంగాణ ఏర్పడిన మొదట్లో హైదరాబాద్ కు పెట్టుబడులు రావని, హిందూ-ముస్లింలు గొడవలు జరుగుతాయని ప్రచారం చేశారు. కానీ కేసీఆర్ అభివృద్ధే కులం, సంక్షేమమే మతం అన్నట్లుగా అభివృద్ధి చేసి అవన్నీ ప్రచారాలే అనే విధంగా చేశారు. దేశంలో తెలంగాణను ఎన్నో రంగాల్లో రోల్ మోడల్ గా నిలిపారు.

వ్యవసాయం, విద్యుత్, పేదవాళ్లను ఆదుకోవటం, సంక్షేమం, ఇంటింటికి నీళ్లు ఇచ్చే కార్యక్రమాలు ఇలా అన్ని రంగాల్లో తెలంగాణను నంబర్ వన్ చేశారు. కరోనా లాంటి సమయంలోకు సంక్షేమం ఆపకుండా పేదలను కడుపులో పెట్టుకొని చూశారు. ఆయన చేసిన అభివృద్ధి కారణంగానే రాజేంద్రనగర్ లో ప్రకాష్ గౌడ్ ను ప్రజలు గెలిపించారు. పైరవీల కోసం అక్కడి ఎమ్మెల్యే పార్టీ మారినప్పటికీ,మేము ఉన్నామని కార్యకర్తలు బలంగా నిలవటం చూస్తుంటే గర్వంగా ఉంది.

కష్టాలు ప్రతి మనిషికి వస్తాయి. మనకు కూడా వచ్చాయి. కానీ వాటిని మనం గట్టిగా ఎదుర్కోవాలి. 2000 సంవత్సరంలో కేసీఆర్ పార్టీ పెట్టినప్పుడు ఒక్కరే ఉన్నారు. 24 ఏళ్లలో ఇంతింతై వటుండింతే అన్నట్లుగా రాష్ట్రం నలుమూలలా బీఆర్ఎస్ బలంగా మారింది. కేసీఆర్ అంటే ఒక శక్తి. కేసీఆర్ ను ఫినిష్ చేస్తా అని రేవంత్ రెడ్డి పిచ్చి ప్రేలాపనలు చేస్తున్నాడు.

గతంలోనూ ఎంతో మంది కేసీఆర్ ఫినిష్ చేస్తా అన్నారు. కానీ చరిత్ర తొంగి చూసుకో రేవంత్ రెడ్డి. కేసీఆర్ ను ఫినిష్ చేస్తా అన్న వాళ్లు ఎక్కడ ఉన్నారో…వాళ్లతోనే కాలేదు. నువ్వు ఎంత?కేసీఆర్ తెలంగాణ తీసుకురాకపోయి ఉంటే… రేవంత్ రెడ్డికి సీటు సీటు ఉంటుండేనా పదవులు ఉండటం కాదు. ప్రజల గుండెల్లో కేసీఆర్కి ప్రత్యేక స్థానం ఉంది. రేవంత్ రెడ్డి టెక్నికల్ ప్రాబ్లమ్స్ తో ఎత్తైన కుర్చీలో కూర్చుంటున్నాడు. ఎత్తైన కుర్చీలో కూర్చుంటే పెద్దోళ్లు అయిపోరు.

కేసీఆర్ రైతుబంధు రూ. 10 వేలు బిచ్చం వేసినట్లు వేస్తున్నాడు. మేము రూ. 15 వేలు ఇస్తాం అని నువ్వే కదా అన్నావ్. వానాకాలం రైతు బంధు ఇప్పటికీ పడలేదు. దాన్ని ఎగ్గొట్టారు. రైతన్నలు ఇప్పుడు మోసపోయామని బాధపడుతున్నారు. కేసీఆర్ లక్ష రుణమాఫీ చేస్తే నేను రెండు లక్షలు చేస్తా అంటివి.సోనియమ్మ బర్త్ డే నాడే చేస్తా అంటివి. ఒక ఏడాది అయిపోయింది. మళ్లీ సోనియమ్మా బర్త్ డే వస్తోంది.

ఇప్పటి వరకు రైతు రుణమాఫీ, రైతుభరోసా ఇవ్వలేదు. సోనియా గాంధీని మాత్రమే కాదు. మొత్తం ప్రజలందరినీ మోసం చేశాడు. దేవుళ్లను కూడా వదలకుండా ఏ దేవుని దగ్గరకు పోతే అక్కడ ఓట్లు వేశాడు. దేవుళ్లను మోసం చేసిన మొదటి వ్యక్తి ఈ రేవంత్ రెడ్డి.

పంద్రాగస్టు లోపు రుణమాఫీ అంటివి. ఎగిరెగిరిపడితివి. హరీష్ రావుతో సవాల్ చేస్తివి. ఇప్పుడు ఏమైంది? ఒక్క హిందూ దేవుళ్లను మాత్రమే కాదు అన్ని మతాల దేవుళ్లను మోసం చేశాడు. జిల్లాల్లో కాంగ్రెస్ హామీలు నమ్మి కొంతమంది మోసపోయారు. కానీ హైదరాబాద్ లో కాంగ్రెస్ నైజం తెలుసు కాబట్టి వాళ్లకు ఓటు వేయలేదు. హైదరాబాద్ ప్రజలకు శిరస్సు వంచి పాదాభివందనాలు.

మనం గెలిపించిన వాళ్లు మనల్ని వదలిపోయారు. కానీ ఆయన పశ్చాత్తాపం చెందటం ఖాయం. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే రాజకీయంగా ఆత్మహత్య చేసుకున్నాడు. ఆయన వెళ్లిపోయిన సరే కార్యకర్తలే పార్టీ నడుపుతుండటం సంతోషనిస్తోంది. ప్రతిపక్షంగా ఉండి కూడా ప్రజల కోసం పోరాడి వాళ్ల గుండెల్లో శాశ్వత స్థానం సంపాందిచుకోవచ్చు.

మూసీ పేరుతో ఢిల్లీకి మూటలు పంపేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నస్తున్నాడని మూసీ బాధిత ప్రాంతాల్లో పర్యటించాం. రాజేంద్రనగర్ నియోజకవర్గం మొత్తం మేము తిరిగితే…ప్రజలు చాలా ఆవేదన వ్యక్తం చేశారు.

మా కష్టంలో ఎవరు మాతో ఉన్నారో మాకు అర్థమైందని అన్నారు. 40, 50 ఏళ్ల నుంచి ఉన్న మీ భూములకు రిజిస్ట్రేషన్లు చేసి ట్యాక్స్ లు కట్టించుకొని కబ్జాదారులు అంటారా? కోట్ల విలువ చేసిన ఇళ్లను కూలగొట్టి.ప్రజలను దిక్కులేని వాళ్లను చేసే ప్రయత్నం చేస్తున్నారు. కేసీఆర్ కట్టించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లనే తాను కట్టించినట్లు ఇస్తామని చెబుతున్నాడు. బీజేపీ నాయకులు మొత్తానికి రేవంత్ రెడ్డి చేసిన సవాల్ కు స్పందించి ఇవ్వాళ మూసీ పక్కన పండుకుంటారంట. చాలా సంతోషం.

మూసీ లో జరుగుతున్న అక్రమాలపై ప్రజలకు కచ్చితంగా వివరంగా చెప్పాల్సి అవసరం మాపైన ఉంది. మూసీకి పునరుజ్జీవం అని రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నాడు. గత 60 ఏళ్ల నుంచే మూసీలోకి మురికి నీళ్లు వస్తున్నాయి. మూసీని మనమే మురికి కూపం చేసినట్లు మాట్లాడుతున్నాడు. మూసీ మురికి కూపం కావటానికి నిజానికి కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలే కారణం. అప్పుడు ఇదే రేవంత్ రెడ్డి ఆ పార్టీల్లోనే ఉన్నాడు.

మేము మాత్రమే మూసీ ని బాగు చేసేందుకు చిత్తశుద్దితో ప్రయత్నం చేశాం. పేదవాళ్ల గూడు కూలగొట్టకుండానే మూసీని బాగు చేసే ప్రయత్నం చేశాం. మూసీ భౌగోళిక స్వరూపం ప్రకారం 90 శాతం మురికి, వాన నీళ్లు గ్రావిటీ ద్వారానే నదిలోకి వస్తాయి. మంచి రేవుల నుంచి ప్రతాప సింగారం వరకు మూసీలోకి వేగంగా కిందకు నీళ్లు పోతాయి. 56 కిలోమీటర్ల పరిధిలోనే 84 మీటర్లు కిందికి ఆగకుండా నీళ్లు పోతాయి.

హైదరాబాద్ లో రోజుకు 2 వేల ఎంఎల్డీల మురికి నీరు ఉత్పత్తి అవుతోంది.మూసీని తిరిగి బతికించాలంటే ముందు మురికి నీటిని శుద్ధి చేయండని కేసీఆర్ మాకు చెప్పారు. కేసీఆర్ దాదాపు రూ. 4 వేల కోట్లతో 12 వందల ఎంఎల్డీ ల ఎస్టీపీలను నిర్మించారు. దేశంలోనే అతి ఎస్టీపీలను హైదరాబాద్ లో బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించింది. కరోనా సమయంలో కూడా రోడ్లు, ఫ్లై ఓవర్లు వేసుకున్నాం.

చిత్తశుద్దితో పనిచేయటంతో 100 శాతం మురికి నీటి శుద్ది నగరంగా హైదరాబాద్ నిలిచింది. 80 శాతం మూసీ శుద్ది ఎస్టీపీల నిర్మాణంతో పూర్తి అయినట్లే. ఇక మేడిగడ్డ నుంచి నీళ్లను తీసుకొచ్చి కొండ పోచమ్మ సాగర్ ద్వారా గండిపేటకు తేవాలని నిర్ణయించాం. ఒక వైపు వ్యవసాయానికి నీళ్లు, మరొక వైపు పట్టణాలు, హైదరాబాద్ కు నీళ్లు తెచ్చేలా కాళేశ్వరం క్టటాం. గోదావరి నుంచి గండిపేటకు నీళ్లు తెచ్చేందుకు గతేడాది మే లోనే తీర్మానం పాస్ చేశాం.

11 వంద కోట్ల రూపాయలతో గండిపేట గేట్ల నీళ్లు ఎత్తిత్తే కిందకు ఫ్రెష్ వాటర్ ఇచ్చేలా ప్లాన్ చేశాం. మూసీ మీద దాదాపు 15 బ్రిడ్జిలను కూడా మంజూరు చేశాం. ఆ బ్రిడ్జిల కిందనే చెక్ డ్యామ్ లు కట్టాం. మూసీ లో ఎప్పుడు నీళ్లు ఉండే విధంగా దాన్ని జీవనదిగా చేసేందుకు అన్ని సిద్దం చేశాం. కేవలం రూ. 11 వందల కోట్లు ఖర్చు చేస్తే చాలు మూసీ పునరుజ్జీవం జరిగినట్లే.

కానీ ముఖ్యమంత్రి రూ. లక్షా 50 వేల కోట్లు ఖర్చు చేస్తాడంట. ఎందుకు అంత ఖర్చు అంటే ఒక్కడు సమాధానం చెప్పారు. నేను ఇదే విషయాన్ని ప్రెస్ మీట్ లో అడిగితే అంత ఖర్చు చేస్తామని ఎవరు చెప్పారంటూ సీఎం, డిప్యూటీ సీఎం ఒంటికాలిపై లేచారు. ముందు 50 వేల కోట్లని ఇదే సీఎం మాట్లాడారు. ఆ తర్వాత 70 వేల కోట్లతో అని జూపల్లి, ఆ తర్వాత రు. లక్షా 50 వేల కోట్ల అని మళ్లీ ఇదే రేవంత్ రెడ్డి అన్నాడు. మళ్లీ నేను చెప్పలేదంటాడు. కానీ రిలీజ్ చేసిన తెలంగాణ గ్రోత్ స్టోరీ బుక్ లోనూ మూసీ పునరుజ్జీవం కోసం రూ. లక్షా 50 వేల కోట్లు అని లెక్క చెప్పారు. ఎందుకు ఇంత ఖర్చు అంటే నవ్వొచ్చే విధంగా కారణాలు చెబుతున్నారు.

బఫర్ జోన్ లో ఇళ్లను కూల్చేస్తారంట. అక్కడ పేద వాళ్ల ఇళ్లు కూల్చేసి బడా మాల్స్ కడుతారంట. పేదవాళ్ల ఇళ్లను మురికి నీళ్లు వస్తున్నాయని కూలగొట్టి…మాల్స్ కడితే వాటి నుంచి సుగంధం వస్తుందా? బఫర్ జోన్ లో పేద వాళ్ల ఇళ్లు కూల్చేసినప్పుడు… మళ్లీ అక్కడ మాల్స్ ఏ విధంగా కడుతారు? మూసీ మే లూటో…ఢిల్లీ మే బాటో అనే విధంగా ఉన్నది వీళ్ల తీరు.

రేవంత్ రెడ్డి పదవి తుమ్మితే ఊడిపోయే ముక్కు లాంటింది. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే పదవి ఎప్పుడు ఊడుతుందో తెలియదు. రాహుల్ గాంధీకి డబ్బులు కావాలి. ప్రియాంక గాంధీ కూడా ఉన్నారు. వాళ్లకు డబ్బులు పంచాల్సిందే. అందుకే మూటలు పంపే పనిలో ఉన్నారు. తెలంగాణలో పదేళ్లలో భారీగా భూముల ధరలు పెరిగాయి. అప్పుడు మేము పారదర్శకంగా భూముల వేలం వేస్తే ఒక ఎకరాకు వందకోట్లు పోయింది. అప్పుడు కూడా అందులో స్కాం ఉందని రేవంత్ రెడ్డి ఆరోపణలు చేశాడు.

ఓఆర్ఆర్ లీజును ఒక సంస్థకు రూ. 7 వేల కోట్లకు ఇస్తే లక్ష కోట్లు వచ్చేదాన్ని రూ. 7 వేల కోట్లే ఇచ్చారన్నాడు. మరి ఇప్పుడు మున్సిపల్ మినిస్టర్ నువ్వే కదా? ఆ టెండర్ రద్దు చేసి రూ. లక్ష కోట్లు తీసుకురా. నేను కోకాపేట లో భూముల్లో అవినీతి చేశానని అన్నావ్. విచారణ జరుపు. తప్పు చేస్తే శిక్ష వేయ్. మనం గట్టిగా మూసీ గురించి అడిగితే కొత్త పల్లవి ఎత్తుకున్నారు. బాపు ఘాట్ వద్ద అతి పెద్ద మహాత్మా గాంధీ విగ్రహాన్ని పెడతామని చెబుతున్నారు.

గాంధీ గారికి విగ్రహాలు ఇష్టం ఉండదని అవే డబ్బులతో పేదవాళ్లకు మంచి చేయాలని మహాత్మా గాంధీ గారి మనువడు చెప్పారు. గాడ్సే శిష్యుడు, గాడ్సే వారసుడు రేవంత్ రెడ్డి. గాంధీ విగ్రహాన్ని గాడ్సే పెడితే ఊరుకుందామా? మహత్మా గాంధీని విగ్రహాన్ని అడ్డుపెట్టుకొని శిఖండి రాజకీయాలు చేస్తామంటే మంచిది కాదు. ఇచ్చిన హామీలు, సంక్షేమ పథకాలకు పైసలు లేవంట. మూసీ పేరుతో రూ. లక్షా 50 వేల కోట్లు మాత్రం ఉన్నాయంట.

11 వంద కోట్లతో అయిపోయే మూసీ పునరుజ్జీవం విషయంలో మూసీలో రూ. లక్షా 50 వేల కోట్లు పోసే కుట్ర చేస్తున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ కడితే ఎంత ప్రయోజనం అంటూ ప్రశ్నించారు కదా? మరి మూసీ తో మురిసే రైతులెందరూ, మూసీ తో కొత్తగా సాగులోకి వచ్చే ఆయకట్టు ఎంత? మూసీ మూటల్లో మీ వాటా ఎంత? బీజేపీ కూడా మొత్తానికి ఈ విషయంలో స్పందించింది. సంతోషం.రూ. లక్షా 50 వేల కోట్లు ఎవడి అబ్బ సొత్తని ఖర్చు చేస్తారో అడగండి. అడగటంతో ఆపకుండా విచారణ కూడా చేపట్టాలని నేను కోరుతున్నా.

కాంగ్రెస్ కు తెలంగాణ ఏటీఎం అయిపోయిందని ప్రధాని మోడీయే అంటారు. మరి ఎందుకు విచారణ జరపకుండా మౌనంగా ఉన్నారు. మేము అమృత్ టెండర్ల గురించి ఫిర్యాదు చేస్తే ఇప్పటి వరకు సమాధానం లేదు. మూసీ పేరుతో రూ. లక్షా 50 వేల కోట్లు లూటీ చేస్తుంటే బీజేపీ వాళ్లు ప్రశ్నించటం లేదు. త్రిపుల్ ఆర్ సినిమా కన్నా ఆర్ఆర్ ట్యాక్స్ లు ఎక్కువ అయ్యాయంటూ ప్రధాని మోడీయే అన్నాడు. కానీ రేవంత్ రెడ్డి పై ఎందుకు చర్యలు లేవు.

మణికొండలో కాంగ్రెస్, బీజేపీ ఒక్కటై ఛైర్మన్, వైస్ ఛైర్మన్ పదవులను పంచుకున్నారు. మళ్లీ మణికొండ, మక్తాల్, భువనగరి లో కలిసి కాపురం చేస్తున్నది ఎవరూ? మళ్లీ వాళ్లే సిగ్గు లేకుండా మాట్లాడతారు. బీజేపీ, బీఆర్ఎస్ లు, పదవులు పంచుకున్నట్లు ఒక్క సంఘటనైనా చూపించగలరా? కాంగ్రెస్ కు బీజేపీ రక్షణ కవచంగా మారింది. రేవంత్ రెడ్డికి బండి సంజయ్ సహాయక మంత్రిగా మారాడు.

మేము రేవంత్ రెడ్డి ని తిడితే బీజేపీ ఎంపీలకు రేషం వస్తోంది. బండి సంజయ్, రఘనందన్ రావు, విశ్వేశ్వర్ రెడ్డి, ఆర్వింద్ లు తట్టుకోలేకపోతున్నారు. అసలు వాళ్లు బీజేపీ లో ఉన్నారా కాంగ్రెస్ లో ఉన్నారా? రేవంత్ కూడా బీజేపీలో ఉన్నాడా? కాంగ్రెస్ లో ఉన్నాడా? రాహుల్ గాంధీ అమాయకుడు. పాపం రాసిచ్చింది చదువుతాడు. ఆయన లీడర్ కాదు…రీడర్. ఆదానీని వ్యతిరేకిస్తూ అక్కడ రాహుల్ గాంధీ మాట్లాడుతాడు.

కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి అదానీకి రెడ్ కార్పేట్ వేస్తాడు. బాంబుల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అమావాస్య కు బాంబులు కొంటే కార్తీక పౌర్ణమి నాటికి కూడా పేలుతలేవు. ఆయన తుస్సు బాంబుల శాఖ మంత్రి. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇంటి మీద ఈడీ దాడులు జరిగి 45 రోజులు అయ్యింది.ఈడీ కానీ బీజేపీ వాళ్లు కానీ ఇప్పటి వరకు ఒక్క ప్రకటన చేయటం లేదు.

ప్రజలు ఆగం కావద్దు. ఎవరు ఎవరితో ఉన్నారో అర్థం చేసుకోవాలి. మాకు పదవులు, కొట్లాట, కేసులు కొత్తకాదు. ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. రేవంత్ రెడ్డి తో మాకు గట్టు పంచాయితీ ఏమీ లేదు. కొడంగల్ లో గిరిజనుల భూమి గుంజుకోవటం పై ప్రశ్నిస్తే ఆయనకు కోపం వస్తోంది. మూసీ కుంభకోణం గురించి ప్రశ్నిస్తే కోపం వస్తోంది. అర్హత లేని బావమరిది కంపెనీకి అమృత్ టెండర్లు కట్టబెట్టటంపై కోపం వస్తోంది. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీద ఈడీ గురించి అడిగితే కోపం వస్తోంది.

ఏదో కేసులు పెట్టి జైల్లో పెడితే ప్రశ్నించటం మానేస్తామని వాళ్లు అనుకుంటున్నారు. నేను జైలుకు పోతే వందలాది మంది కేసీఆర్, కేటీఆర్ లు పుట్టుకొస్తారు. ఇప్పడే పోరాటం మొదలైంది. మరో నాలుగేళ్లు ఈ కాంగ్రెస్ తో పోరాటం చేయాల్సి ఉంది. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ఎందుకు పార్టీ మారాడో ప్రజలు అడగాలి. అభివృద్ధి కోసం పోయిన అంటే కేసీఆర్ కన్నా రేవంత్ రెడ్డి ఏం అభివృద్ధి చేసిండో చెప్పామనాలి.

శేరిలింగంపల్లి ఎమ్మెల్యే కేసీఆర్ రూ. 9500 కోట్లతో అభివృద్ధి చేశాడు అన్నాడు. మరీ అభివృద్ధి కోసం పోతే మరో వెయ్యి కోట్లు ఎక్కువ తెచ్చి అభివృద్ది చేయాలి కదా ఎమ్మెల్యేలను బీజేపీ వాళ్లు మేకలను కొన్నట్లు కొంటున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు ఖర్గే చెబుతున్నారు. ఖర్గే ని తెలంగాణ రమ్మని చెబుతున్నా. ఇక్కడ మా మేకలు మీ మందలో తప్పిపోయాయి చూడాలని కోరుతున్నా.

ప్రకాష్ గౌడ్, గాంధీలకు సిగ్గుందా? ఏ పార్టీ లో ఉన్నారో చెప్పే దమ్ముందా? కేసీఆర్ ఆధ్వర్యంలో నిరంతరం ప్రజల కోసం పోరాటం చేస్తూనే ఉంటాం. రాజేంద్రనగర్ లో ఉప ఎన్నిక రావటం ఖాయం. ఉప ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరటం ఖాయం. రాజేంద్రనగర్ ను భవిష్యత్ లో అద్భుతంగా ముందుకు తీసుకెళ్లే నాయకుడు కార్తీక్ రెడ్డి .

LEAVE A RESPONSE