-పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లు
-85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు ఆమోదం
-ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌కు ప్రత్యామ్నాయ విభాగం ఏర్పాటు
– కొత్తగా టెండర్లు పిలిచి అమరావతి నిర్మాణ పనులు కొనసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలు
– స్పోర్ట్స్ పాలసీ, పర్యాటక పాలసీలకు ఆమోదం
– మంత్రివర్గ కీలక నిర్ణయాలు
అమరావతి : రాష్ట్రాభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశమైంది. ఈ సమావేశంలో అనేక కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలో రూ. 85 వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
మంత్రివర్గ సమావేశం నిర్ణయాలు ఇవే..
- 85వేల కోట్ల పెట్టుబడులకు సంబంధించి ఎస్ఐపీబీ నిర్ణయాలకు మంత్రివర్గం ఆమోదం
- నేరాలను నియంత్రించేందుకు పీడీ యాక్ట్ పటిష్టం చేస్తూ సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
- లోకాయుక్త చట్ట సవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
- లోకాయుక్త నియామకంలో ప్రతిపక్ష నేత లేనప్పుడు ఏం చేయాలనేదానిపై చర్చ
- పార్లమెంట్లో అనుసరించిన విధానం ఇక్కడ కూడా కొనసాగించాలని నిర్ణయం
- దేవాలయ కమిటీల్లో ఇద్దరు సభ్యులకు చోటు కల్పించేలా చట్టసవరణ బిల్లుకు మంత్రివర్గం ఆమోదం
- కర్నూల్లో హైకోర్టు బెంచ్ ఏర్పాటుకు కేబినెట్లో వచ్చిన ప్రతిపాదనలకు నిర్ణయం
- ఈగల్ పేరుతో యాంటీ నార్కోటిక్స్ టాస్క్ ఫోర్స్‌కు ప్రత్యామ్నాయ విభాగం ఏర్పాటుకు నిర్ణయం
- స్వయంగా ఈగల్ పేరును సూచించిన సీఎం చంద్రబాబు
- కాంట్రాక్టర్లకు మొబలైజేషన్ అడ్వాన్స్‌లు పునరుద్ధరించాలని నిర్ణయం
- ఏపీ టవర్ కార్పొరేషన్‌ను ఫైబర్ గ్రిడ్‌లో విలీనం చేయాలని నిర్ణయం
- అమరావతి సాంకేతిక కమిటీ ఇచ్చిన ప్రతిపాదనలకు ఆమోదం
- కొత్తగా టెండర్లు పిలిచి అమరావతి నిర్మాణ పనులు కొనసాగించేలా సాంకేతిక కమిటీ ప్రతిపాదనలు
- స్పోర్ట్స్ పాలసీ, పర్యాటక పాలసీలకు ఆమోదం
- మంత్రివర్గంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలు సూచనలు చేశారు. లోకల్‌గా వున్న సంప్రదాయ క్రీడలకు ప్రోత్సాహకాలను పవన్ ప్రస్తావించారు. కల్చరల్ హెరిటేజ్ టెక్స్టైల్ టూరిజంతో పాటు సేఫ్టీ పాలసీపైన కూడా కేబినేట్లో సూచనలు ఇచ్చారు.