– బిజెపి తెలంగాణ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మీడియా ఇంచార్జ్ ఎన్వీ సుభాష్
హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలనలో అనేక సంక్షేమ పథకాలు, గ్యారంటీలు, హామీలు నెరవేరుస్తారనుకుంటే.. ఇచ్చిన హామీలు, వాగ్ధానాలను నెరవేర్చకుండా వైపల్యం చెందింది. రేవంత్ సర్కారు ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదు.
ఖాళీ పాత్రలే ఎక్కువ శబ్ధం చేస్తాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఇలాగే ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని అంశాల్లో విఫలమయ్యారు. ఉద్యోగాలడిగితే నిరుద్యోగులపై లాఠీచార్జ్, బోనస్ ను బోగస్ చేసి, రుణమాఫీ అరకొరతోనే సరిపెట్టి, భూములు గుంజుకొని రైతులను వేధించిన్రు.
మహిళలు, విద్యార్థులు, ఉద్యోగులు, ఉద్యోగార్థులు, దళిత, గిరిజనులపై దాడులు, మహిళలపై అఘాయిత్యాలు, గురుకులాల్లో ఫుడ్ పాయిజన్ తో విద్యార్థులు అనారోగ్యం పాలు…. ఇలా అన్ని వర్గాల ప్రజలు దగాకు గురయ్యారు.
నరేంద్ర మోదీ వికాస్ మంత్రతో దేశాన్ని అభివృద్ధి చేస్తుంటే.. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అభివృద్ధి విరోధకంగా మారాయి. తెలంగాణలో అన్ని వర్గాలకు అన్యాయం చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ రాష్ట్రంలో ఎన్నికలు ప్రచారానికి వెళ్లినా.. అక్కడ కాంగ్రెస్ కు ప్రతికూల ఫలితాలే ఎదురవున్నాయి. ఆ పార్టీ ఓడిపోతోంది. అందుకే, హర్యానాలో బిజెపిని ఆదరించారు. మహారాష్ట్ర ప్రజలు అఖండ విజయాన్ని అందించారు.
రేవంత్ రెడ్డి అభివృద్ధి జరగాలంటే రైతులు నష్టపోవాలని చెబుతున్నడు. పాలమూరు బిడ్డగా, పాలమూరు సభ సాక్షిగా అక్కడి రైతులను బెదిరించిన దౌర్భాగ్యపు సీఎంగా నిలిచావు.తెలంగాణలో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో మోసాల కాంగ్రెస్ ను తరిమికొట్టి, బిజెపిని గెలిపిస్తారు.