• బిసి కార్పొరేషన్ ద్వారా పలు స్వయం ఉపాధి పధకాలకు రూ.1977 కోట్లు
• ఆర్ధికంగా వెనుకబడిన కులాల సంక్షేమానికి రూ.10,274 కోట్లు కేటాయింపు
• కాపు కార్పొరేషన్ కు రూ.4,647 కోట్లు నిధులు కేటాయింపు
• రాష్ట్ర చరిత్రలోనే ఈఏడాది బడ్జెట్లో బిసిలకు అత్యధిక నిధులు
• ప్రతి ఇంటి నుండి ఒక వ్యాపార వేత్తను తయారు చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యం
• బిసి అభ్యర్ధుల కోసం 26 జిల్లాల్లో డిఎస్సి ఉచిత కోచింగ్ కేంద్రాలు ప్రారంభమయ్యాయి
– బిసి,ఇబిసి సంక్షేమం,చేనేత మరియు జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత
అమరావతి: రాష్ట్రంలోని బడుగు,బలహీన వర్గాల సామాజిక, ఆర్ధిక, రాజకీయ అభివృద్ధే లక్ష్యంగా ఎన్డిఏ ప్రభుత్వం బిసిలకు అత్యంత ప్రాధాన్యతను ఇచ్చి ఈఏడాది రాష్ట్ర బడ్జెట్లో రూ.39వేల 7 కోట్ల నిధులను కేటాయించడం జరిగిందని ఇది రాష్ట్ర చరిత్రలోనే అత్యధిక నిధులు కేటాయించిన ప్రభుత్వంగా నిలిచిందని రాష్ట్ర బిసి, ఇబిసి, చేనేత మరియు జౌళిశాఖ మంత్రి ఎస్.సవిత వెల్లడించారు.
బుధవారం రాష్ట్ర సచివాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ అన్న ఎన్టీఆర్ నుంచి నేటి సీఎం చంద్రబాబు వరకు బీసీల అభ్యున్నతికి అధిక ప్రాధాన్యం ఇస్తున్నదనేందుకు బిసిల అభ్యున్నతికి ఇంత పెద్దఎత్తున ఈఏడాది నిధుల కేటాయింపే ఇందుకు ప్రత్యక్ష నిదర్శనంగా మంత్రి పేర్కొన్నారు.అదే విధంగా బిసి-ఎ,బి,డి,ఇ వర్గాలకు ఏడు కార్పొరేషన్ల ద్వారా వివిధ పధకాలకు రూ.17వేల 319 కోట్లను కేటాయించడం కూడా మంచి శుభ పరిణామమని మంత్రి అన్నారు.
బీసీ కార్పొరేషన్ ద్వారా వివిధ స్వయం ఉపాధి పథకాల కింద రూ.1,977.53 కోట్ల సబ్సిడీ రుణాలను అందజేయనున్నట్టు మంత్రి సవిత పేర్కొన్నారు.వాటిలో రాష్ట్ర ప్రభుత్వ సబ్సిడీ (50%) రూ.1,046.76 కోట్లు,ఎన్బిసిఎఫ్డిసి టర్మ్ లోన్ల కింద రూ.129.29 కోట్లు, బ్యాంకు రుణంగా రూ.778.42 కోట్లు,లబ్ధిదారు వాటా(10%)గా రూ.22.96 కోట్లు మొత్తం కలిపి రూ.1,977.53 కోట్లు సబ్సిడీ రుణాలుగా అందించడం జరుగుతుందని మంత్రి పేర్కొన్నారు.దానివల్ల మొత్తం 1,33,849 మందకి ప్రయోజనం కలగనుందని తెలిపారు.
26 జిల్లాల్లో డిఎస్సి ఉచిత కోచింగ్ కేంద్రాలు ప్రారంభమం-త్వరలో సివిల్ సర్వీస్ కోచింగ్ కేంద్రాలు ప్రారంభం:
రాష్ట్రంలోని వివిధ బిసి వర్గాల అభ్యర్ధులకు 26 జిల్లాల్లో ఉచిత డిఎస్సి కోచింగ్ కేంద్రాలను ఇప్పటికే ప్రారంభించడం జరిగిందని మంత్రి సవిత్ పేర్కొన్నారు.అదే విధంగా త్వరలో సవిల్ సర్వీస్ ఉచిత కోచింగ్ కేంద్రాలను ప్రారంభించనున్నట్టు మంత్రి తెలిపారు.
ఆర్ధికంగా వెనుకబడిన(EWS) వర్గాలకు కూడా బడ్జెట్లో అధిక నిధులు కేటాయింపు
రాష్ట్రంలో ఆర్ధికంగా వెనుకబడిన(EWS) వర్గాల వారి అభ్యున్నతికి ఈప్రభుత్వం అన్ని విధాలా కట్టుబడి ఉందని మంత్రి ఎస్.సవిత స్పష్టం చేశారు.2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి బడ్జెట్లో ఈవర్గాలకు 7కార్పొరేషన్లకు రూ.10,273.80 కోట్లు కేటాయించడం జరిగిందని వివరించారు.ఆవివరాలు ఈకింది విధంగా ఉన్నాయి.
వివరాలు రూ.కోట్లలో…
క్ర.సం. కార్పొరేషన్ DBT స్కీమ్స్ ఆర్థిక పథకాలు బడ్జెట్ కేటాయింపు
1 కాపు కార్పొరేషన్ 4,429.20 217.80 4,646.99
2 రెడ్డి కార్పొరేషన్ 1,862.12 64.82 1,926.94
3 కమ్మ కార్పొరేషన్ 1,820.78 73.90 1,894.68
4 EBC వెల్ఫేర్ 645.42 56.32 701.73
5 ఆర్యవైశ్య కార్పొరేషన్ 492.87 29.09 521.96
6 క్షత్రియ కార్పొరేషన్ 298.95 11.94 310.88
7 బ్రాహ్మణ కార్పొరేషన్ 248.88 21.73 270.61
మొత్తం 9,798.20 475.60 10,273.80
అంతేగాక కాపు కార్పొరేషన్ మినహా 6 కార్పొరేషన్ల కింద 383.41 కోట్ల సబ్సిడీ రుణాలు అందజేయనున్నట్టు మంత్రి సవిత వివరించారు.దీనివల్ల 59,309 మందికి లబ్ది కలుగుతుందని చెప్పారు.ఈరుణాల్లో రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ(50%) రూ.257.80 కోట్లు, బ్యాంకు రుణం లబ్ధిదారునివాటా రూ.125.61 కోట్లుగా ఉందని తెలిపారు.మొత్తం రూ.383.41 కోట్లు రుణాలుగా అందించనున్నట్టు మంత్రి పేర్కొన్నారు.
క్ర.సం. పథకం లబ్ధిదారులు మొత్తం(కోట్లలో)
1. స్వయం ఉపాధి పథకాలు 5,879 101.86
2. వ్యవసాయం అనుబంధ కింద 1,384 69.19
మినీ డెయిరీ యూనిట్ల ఏర్పాటుకు
3. EWS నిరుద్యోగ యువతతో 1,001 80.16
జనరిక్ మెడికల్ షాపుల ఏర్పాటు
4. EWS మహిళా సాధికారితకు 45,772 114.43
ఫ్యాషన్ డిజైనింగ్/టైలరింగ్ లో శిక్షణ
5. మహిళా సాధికారితకు 1,831 9.14
ఈవెంట్ మేనేజ్ మెంట్ లో శిక్షణ
6. హాస్పటాలిటీ సెక్టార్ లో 3,442 8.63
షార్టు టెర్మకోచింగ్
మొత్తం 59,309 383.41
—————————————————–
కాపు కార్పొరేషన్ కు రూ.4,647 కోట్లు నిధులు కేటాయింపు:
ఈఐదేళ్ళ కాలంలో కాపుల సంక్షేమానికి రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని ఎన్నికల్లో చెప్పిన విధంగా మొదటి ఏడాది రూ.4,646.99 కోట్లు కేటాయించామని మంత్రి సవిత వివరించారు.కాపు యువత, మహిళల ఆర్థికాభివృద్ధికి రూ.496.79 కోట్ల సబ్సిడీ రుణాలు అందజేయనున్నట్టు తెలిపారు.ఆవివరాలు ఈకింది విధంగా ఉన్నాయి.రాష్ట ప్రభుత్వం సబ్సిడీ మొత్తం రూ.217.79 కోట్లు,బ్యాంకు రుణం రూ.229.25 కోట్లు,లబ్ధిదారుల వాటా రూ.49.75 కోట్లు కలిపి రూ.496.79 కోట్లని మంత్రి సవిత వివరించారు.వివిధ పధకాల కింద అందించే రుణాలు ఈకింది విధంగా ఉన్నాయి.
క్ర.సం. పథకాలు లబ్ధిదారులు మొత్తం(కోట్లలో)
1. స్వయం ఉపాధి పథకాలు 13,750 432.50
2. MSME GROUPS 130 32.50
3. కాపు మహిళల సాధికారితకు 10,000 25.00
స్కిల్ డవలప్ మెంట్ ట్రైనింగ్
4. చంద్రన్న విద్యోన్నతి 2700 3.04
డీఎస్సీ, సివిల్ సర్వీసెస్ కోచింగ్
5. మహిళలకు ఈవెంట్ మేనేజ్ మెంట్ 1500 3.75
శిక్షణ
—————————————
మొత్తం 28,080 496.79
————————————–
ప్రతి ఇంటి నుండి ఒక వ్యాపార వేత్తను తయారు చేయాలనే లక్ష్యంతో సియం చంద్రబాబు నేతృత్వంలోని ఎన్డిఏ ప్రభుత్వం ఎంఎస్ఎంఇలు,బిసి కార్పొరేషన్ ద్వారా యూనిట్లను ఏర్పాటు చేస్తోందన్నారు.రాజకీయాలకు అతీతంగా అర్హులైన ప్రతి ఒక్కరికీ సబ్సిడీ రుణాలను అందింస్తామని మంత్రి స్పష్టం చేశారు.రాష్ట్ర వ్యాప్తంగా వివిధ బిసి సంక్షేమ వసతి గృహాల్లో నాణ్యమైన ఆహారాన్ని అందిస్తున్నామని మంత్రి సవిత పేర్కొన్నారు. మీడియా సమావేశంలో రాష్ట్ర బిసి సంక్షేమశాఖ కార్యదర్శి పోలా బాస్కర్,ఆశాఖ సంచాలకులు డా.మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు.