– తమిళనాడు తరహా ఆటోమొబైల్ పరిశ్రమ
– ఫ్యూచర్ సిటీ లో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు
– టూరిజం పాలసీ పై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష
హైదరాబాద్: గత 10 యేళ్లలో తెలంగాణ కు ప్రత్యేక టూరిజం పాలసీ తయారు చేయలేదు. దుబాయ్, సింగపూర్, చైనా దేశాలను అధ్యయనం చేయాలి. దుబాయ్, సింగపూర్ తరహా షాపింగ్ హైదరాబాద్ లో ఏర్పాటు చేయాలి. హైదరాబాద్ వాతావరణం 365 రోజులు బాగుంటుంది. దానికి అనుగుణంగా టూరిజాన్ని అభివృద్ధి చేయాలి.
తమిళనాడు తరహా ఆటోమొబైల్ పరిశ్రమ హైదరాబాద్ లో అభివృద్ధి అయ్యేలా చూడాలి. టైగర్ రిజర్వు ఫారెస్ట్ ప్రాంతాల్లో పర్యాటకులను పెరిగేలా చూడాలి. టైగర్ రిజర్వు ఫారెస్ట్ లను దేవాలయాలతో కనెక్ట్ చేయాలి. మధ్యప్రదేశ్, మహారాష్ట్ర నుంచి పులులు తెలంగాణ వైపు వచ్చే వాతావరణాన్ని ఏర్పాట్లు చేయాలి.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పల్ల టెంపుల్ టూరిజం పెరిగింది. కాన్సెప్ట్ టూరిజం పైన దృష్టి సారించాలి. ఫ్యూచర్ సిటీ లో మెగా కన్వెన్షన్ సెంటర్ ఏర్పాటు పైన అధ్యయనం చేయాలి. ఎయిర్ ఫోర్ట్ నుంచి 20 నిమిషాల్లో మెగా కన్వెన్షన్ సెంటర్ కు చేరుకునేలా ఉండాలి. డెస్టినేషన్ వెడ్డింగ్ లకు అనువైన ప్రదేశాలను గుర్తించి అభివృద్ధి చేయాలి. పర్యాటక శాఖ స్థలాల లీజు లపైన ఆరా తీసిన ముఖ్యమంత్రి.. టూరిజం స్థలాలు,లీజు లపైన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశాలు. లీజు ముగిసినా ఖాళీ చేయని వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలి.
కోర్టు కేసులను సీరియస్ తీసుకోని స్టే లు ఎత్తివేసే లా చూడాలి. అడ్వకేట్ జనరల్ తో చర్చించి మంచి న్యాయవాదులను ఏర్పాటు చేసుకోవాలని సూచన. మంచి గుర్తింపు ఉన్న కంపెనీ లకు పర్యటక స్థలాలు లీజ్ కు ఇవ్వాలి. తెలంగాణ లో టూరిజం అభివృద్ధి కి మంచి అవకాశాలు ఉన్నాయి. ఎయిర్ ఫోర్ట్ నుంచి మూడు గంటల్లో తెలంగాణ లో ఎక్కడికైనా చేరుకోవచ్చు.
తెలంగాణ లో శాంతిభద్రతలు బాగున్నాయి, గ్రామీణ రోడ్లు బాగున్నాయి..అన్ని రకాల ఆహారం దొరుకుతుంది. ఉస్మానియా ఆసుపత్రి ని ఖాళీ చేయించి మంచి పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతాం. చార్మినార్ కు పర్యాటకులు పెరిగేలా చర్యలు తీసుకోవాలి. అసెంబ్లీ లో నూతన టూరిజం పాలసీ ని ప్రవేశ పెట్టి సమగ్రంగా చర్చ జరిగేలా చూద్దాం. bసొంత కాళ్ల పైన నిలబడేలా టూరిజం శాఖ కసరత్తు చేయాలి.
సమావేశంలో మంత్రి జూపల్లి కృష్ణారావు,ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డి, టూరిజం కార్పొరేషన్ ఛైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి, టూరిజం శాఖ కార్యదర్శి స్మితా సబర్వాల్, టూరిజం శాఖ ఎండీ ప్రకాష్ రెడ్డి, సీఎంవో ఓస్డీ వేముల శ్రీనివాసులు,సీఎం స్పెషల్ సెక్రటరీ అజిత్ రెడ్డి పాల్గొన్నారు.