– కిరాయి రాతగాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ నిన్న సీఎం చదివారు
– సాంస్కృతిక కార్యక్రమాల పేరిట సినిమా పాటలు
– మాజీ మంత్రి జి .జగదీష్ రెడ్డి ,ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్ రెడ్డి ,మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ , మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్ ,మన్నె గోవర్ధ న్ రెడ్డి
హైదరాబాద్: ఏడాది కాంగ్రెస్ పాలన విజయోత్సవ సంబరాల్లో తెలంగాణ సంస్కృతి మంట గలిసింది. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట సినిమా పాటలు పాడించారు. ఈ మత్తులో పడే ఉన్న తెలంగాణ ను ఊడగొట్టి ఆనాడు ఆంధ్రా లో కలిపారు. ఆరవై సంవత్సరాలు కాంగ్రెస్ నాయకులు ఈ మత్తులో పడి తెలంగాణ సంస్కృతి ని ద్వంసం చేశారు. తెలంగాణ బాష ,యాసను ఉమ్మడి రాష్ట్రం లో తొక్కేశారు.
అన్ని రకాల సాంస్కృతిక దాడులను తిప్పికొట్టిన నేత కేసీఆర్. బతుకమ్మ ను వ్యాప్తి చేసినా ,గోదావరి కృష్ణ పుష్కరాలను ఘనంగా జరిపినా అది కేసీఆర్ ఉద్యమ చలవే. తెలంగాణ ఉద్యమం నుంచే తెలంగాణ తల్లి పుట్టింది. తెలంగాణ తల్లికి నాటి ఉద్యమమే భౌతిక రూపం ఇచ్చింది.
నిన్న తెలంగాణ తల్లి పేరుతో ఏ రూపాలతో ప్రతిస్టించారో అందరికీ తెలుసు. తెలంగాణ తల్లిని చంపుతా అని తుపాకీ పట్టుకుని బయలు దేరిన వాడు కొత్త తల్లి ని తీసుకొచ్చాడు. కిరాయి రాతగాళ్ళు రాసిచ్చిన స్క్రిప్ట్ నిన్న సీఎం చదివారు.
ఇది తెలంగాణ సంస్కృతి పైన జరుగుతున్న భయంకర దాడి. దారి తప్పి ఆ దొంగల వెంట ఉన్న తెలంగాణ వాదుల వెంట ఉన్న వారు పునరాలోచించుకోవాలి. తల్లి పాలు తాగి రొమ్ము గుద్దే రకం వాళ్ళు తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణ పేరిట అడ్డమైన పాటలు పాడారు.
తెలంగాణ తల్లి పేరిట నిన్న జరిగిన ఆవిష్కరణ కార్యక్రమం లో పాల్గొన్న ఏ ఒక్కరికి తెలంగాణ భావేద్వేగం లేదు. సమైక్య బాస్ లను సంతృప్తి పరిచేందుకు నిన్న కొత్త తల్లిని సృష్టించారు. ఉద్యమం సృష్టించిన తల్లే మన తల్లి.
కాంగ్రెస్ పార్టీ గుర్తును ప్రచారం చేసుకునేందుకే కొత్త తల్లిని తెచ్చారు. ఎవర్ని భయపెట్టి కొత్త తల్లికి దండం పెట్టించలేవు. మేము కూడా ఎవర్ని దండాలు పెట్టాలని ఆనాడు కోరుకోలేదు. కోట్లాది ప్రజలు సృష్టించిన తెలంగాణ తల్లికి అధికారిక గెజిట్ లో స్థానం ఎందుకు ? ప్రజల మెడ మీద కత్తి పెట్టి కొత్త తల్లి ని ఆరాధించాలని అడిగే హక్కు ఎవరికీ లేదు.
అధికారం ఉందని ఆహారపు అలవాట్ల పై, కట్టుబాట్ల పై ఆంక్షలు పెడితే కుదురుతుందా ? ఆ జీవో ను అధికారులు ఎలా తెచ్చారో అర్థం కావడం లేదు. ఈ ముఖ్యమంత్రి చదువు కోలేదు కాబట్టే పిచ్చి జీవో లు తెస్తున్నారు. కోయిలలు ఉన్న చోట కాకిలా ప్రవర్తించి దృష్టిని ఆకర్షించాలనేది ఈ మూర్ఖపు సీఎం ఆలోచన.