– జిల్లా పరిషత్ మాజీ చైర్పర్సన్ తుల ఉమ, బీఆర్ఎస్ మహిళా నేత లు సుమిత్ర, సుశీలా రెడ్డి ,అర్పిత ప్రకాష్ ,కీర్తిలతా గౌడ్
హైదరాబాద్: మహిళలంటే సీఎం రేవంత్ కు గౌరవం లేదని వరస ఘటనలు రుజువు చేస్తున్నాయి. లగచర్ల లో మహిళల పై మొదట పోలీసులు దాడి చేశారు. ఆశా వర్కర్ల పై పోలిసులు దమన కాండ కొనసాగించారు. చాలా మంది మహిళలను పోలీసులు వాడలేని భాషలో నిందించారు. ఇష్టమొచ్చినట్టు కొట్టారు.
తెలంగాణ తల్లిని మార్చి రేవంత్ రెడ్డి ఆవిష్కరించిన రోజే ఆశా వర్కర్ల పై దాడి జరిగింది. మహిళా కమిషన్ కు పోలీసుల దారుణాలు వివరించాం. తప్పనిసరిగా ఈ ఘటన పై విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని వుమెన్ కమిషన్ చైర్పర్సన్ హామీ ఇచ్చారు. మగ పోలీసులు మహిళల పై దాడి చేయడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నట్టు మహిళా కమిషన్ చైర్పర్సన్ చెప్పారు.
మేము ఈ ఘటనను ఇంతటితో వదిలిపెట్టం. ఆశా వర్కర్ల కు బీ ఆర్ ఎస్ అండగా ఉంటుంది.నియంత లా వ్యవహరిస్తున్న రేవంత్ రెడ్డికి మహిళలు తగిన బుద్ది చెబుతారు. తెలంగాణ తల్లిని మార్చిన రేవంత్ రెడ్డి ని మహిళలు వదిలి పెట్టే ప్రసక్తే లేదు. ఆశావర్కర్ల పై రేవంత్ ప్రభుత్వం మానవత్వం లేకుండా ప్రవర్తించింది.
పోలీసుల దాడుల్లో గాయపడ్డ మహిళలను సకాలం లో ఆస్పత్రులకు కూడా తరలించలేకపోయారు. బీ ఆర్ ఎస్ స్పందించాకే ప్రభుత్వం స్పందించింది. ఆశా వర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. మొన్న లగచర్లలో, నిన్న హైదరాబాద్ లో ఆశావర్కర్ల పై రేవంత్ ప్రభుత్వం ప్రవర్తించిన తీరును మహిళా లోకం గమనిస్తోంది.