– సత్య ప్రమాణానికి నేటితో నాలుగేళ్ళు పూర్తి
– నిజం వైపు నిలిచిన బిక్కవోలు లక్ష్మీగణపతి
– సత్యప్రమాణం చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిజాయితీకి దైవం అండగా నిలిచింది
అనపర్తి నియోజకవర్గం నాలుగేళ్ళ క్రితం సత్యప్రమాణం టాపిక్ తో రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. నాడు మీడియా మొత్తం ఇదే అంశాన్ని హైలైట్ చేసింది. నాడు సత్యప్రమాణం చేసిన నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నిజాయితీకి దైవం అండగా నిలిచింది. ప్రజలు ఎన్నికలలో బ్రహ్మరధం పట్టారు. నిజం నిప్పులాంటిదని నిరూపించి గెలిచిన నల్లమిల్లి తాను సత్యప్రమాణం చేసి నాలుగేళ్ళు పూర్తైన సందర్బంగా అదే బిక్కవోలు లక్ష్మీగణపతి స్వామి వారిని నేడు దర్శించుకుని అనంతరం మీడియాతో మాట్లాడారు… వారి మాటలలో…
సత్యమేవ జయతే… గాంధీ మహాత్ముడు చెప్పిన విషయం.. సత్యమే జయిస్తుంది ఎప్పటికైనా అని.
2020 వ సంవత్సరం, డిసెంబరు 23 వ తేదీ.. ఇదే లక్ష్మీగణపతి ఆలయం ఒక అత్యద్భుతమైన రాజకీయ ఆవిష్కరణకి వేదికైంది.
ఆనాడు శాసనసభ్యునిగా ఉన్న డా సత్తి సూర్యనారాయణరెడ్డి , వారి శ్రీమతి ఆదిలక్ష్మి, వారి సామంతరాజుల అవినీతి ఆ యేడాదిన్నర కాలంలో పెచ్చుమీరిపోయిన నేపధ్యంలో తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తున్న నేపధ్యాన్ని తట్టుకోలేక అసహనంతో వారు నన్ను సతీసమేతంగా సత్యప్రమాణానికి ఆహ్వానించడం, నేను దానికి అంగీకరించి సత్యప్రమాణానికి రావడం ఈ సంఘటన నియోజకవర్గ ప్రజలకే కాకుండా ప్రపంచ వ్యాప్త తెలుగు వారందరికీ తెలిసేలా చేసింది
ఆరోజున నేను సత్యప్రమాణానికి ఇష్టపడను అనుకొని నాటి శాసనసభ్యులు నాకు సవాల్ విసరడం, నేను రావడానికి అంగీకరించడంతో వారు పోలీసులను పురమాయించి నాపై, మా నాయకులపై దాష్టీకం జరిపించి మమ్మల్ని హౌస్ అరెస్టులు చేయించడం జరింది. మరలా మాట మార్చి వారు మధ్యాహ్నం 2.30 కి ప్రమాణం చేస్తారు మీరు 4.30 కి చేయండి అంటూ పోలీసులతో రాయబారం చేయించడం దానికి నేను అంగీకరించకపోవడం జరిగింది. చివరకు మీడియా జోక్యంతో ఇద్దరినీ 2.30 గంటలకే చేయించే ఏర్పాట్లు జరిగాయి
ఆంక్షల నడుమ, విపరీతమైన పోలీసు బందోబస్తు మధ్య, రోప్ పార్టీల సహకారంతో ఇక్కడకి తీసుకువస్తే ఇక్కడ సూర్యనారాయణరెడ్డి, ఆదిలక్ష్మి ప్రవర్తించిన తీరు ఎంత దుర్మార్గంగా ఉందో ప్రపంచం అంతా చూశారు.
ఏ ఆలయంలోనూ లేని విధంగా ఇక్కడ సాక్షాత్తు మూలవిరాట్ ని స్పృశించే అవకాశం ఉంది. ఆ మూలవిరాట్ సన్నిధిలో ఉన్నామనే స్పృహ లేకుండా నాడు ఆదిలక్ష్మి ప్రవర్తించిన తీరు దారుణం. స్వామి వారి సన్నిధిలో ఉండి కూడా నన్ను పరుష పదజాలంతో దూషించగా సూర్యనారాయణరెడ్డి అసహనంతో సాక్షాత్తూ ఆ స్వామి వారి పైనే చెయ్యి చేసుకోవడం మనం చూసాం. ఈ చర్యతో ఆ లక్ష్మీగణపతి స్వామి వారి నుదిటిపై నున్న వెండి బొట్టు రాలి క్రింద పడిపోవడం మనం చూసాం.
ఇంతటి అసహనానికి గురై వారు మమ్మల్ని పరుషపదజాలంతో దూషించినా, అనేక రకాల ఇబ్బందులు పెడుతున్నా మేము సంయమనంతో వ్యవహరించి వారు అడిగిన విధంగా ఆ స్వామి వారి తొండంపై నేను నా భార్య చేతులు ఉంచి ప్రమాణం చేస్తే ఆదెమ్మ దంపతులు మాత్రం పూలదండలపై చేతులు వేసి ప్రమాణం చేశారు
పటిష్ట పోలీసు బందోబస్తు మధ్య ఈ కార్యక్రమం జరిగితే సూర్యనారాయణరెడ్డి బయటకు వచ్చి మహాలక్ష్మి ప్రమాణం చేయలేదు అని చెప్పడం జరిగింది. అయితే ఆయన మాటలు అబద్దం అని నిరూపించేలా మా సుబ్బారెడ్డి సత్యప్రమాణం సంఘటన వీడియో తీయడం, ఆ వీడియోని మీడియాకి అందించడం ఆరోజు 5 కంటల పాటు టీవి ఛానెల్స్ లో డిబేట్ జరగడం ఆ డిబేట్ లో సూర్యనారాయణరెడ్డి సభ్యత, సంస్కారం లేకుండా ప్రవర్తించడం ప్రపంచంలో ఉన్న తెలుగువారందరూ చూశారు.
అయినప్పటికీ కూడా వారి వాదననే బలపరుచుకుంటూ అసత్యాన్ని సత్యంగా వమ్మించే ప్రయత్నాన్ని చేసారు కానీ చివరకు సత్యమే గెలిచింది అనేది వాస్తవం. భగవంతుడు ఎవరినీ శిక్షించడు, ఎవరికీ వరాలనివ్వడు. ఎవరి అర్హతను బట్టి, ప్రవర్తనను బట్టి అవకాశాలు ఇస్తాడు. ఆ అవకాశాలను ఉపయోగించుకునే సామర్ధ్యాన్ని కల్పిస్తాడు
గణపతి అంటే ప్రకృతి ఆరాధనకు చిహ్నం. జగన్మోహనరెడ్డికి ఉన్నట్లు క్విడ్ ప్రోకో లు ఆయనకు ఉండవు. సూర్యనారాయణరెడ్డి దంపతులకు భగవంతుని దగ్గర కూడా క్విడ్ ప్రోకోనే. ప్రతీచోటా భగవంతునికి మనం ఏం ఇస్తున్నాం.. భగవంతుడు మనకేం ఇవ్వాలి అనే ఆలోచనే వారికి. అదే డిసెంబరు 23, 2020 న జరిగిన సంఘటన.
నాకు శాసనసభ్యుల టికెట్ డోలాయమానంలో ఉన్న తరుణంలో సూర్యనారాయణరెడ్డి ఇక్కడకు వచ్చి భగవంతుని మీద అసత్య ప్రమాణం చేసినందునే టికెట్ రాలేదంటూ మాట్లాడటం జరిగింది. కానీ నాకు టికెట్ దక్కనీయకూడదంటూ వారు చేసిన ప్రయత్నం కారణంగా వారికి రాజకీయంగాను నష్టం జరిగింది, ఆర్దికంగాను నష్టం జరిగింది. నాకు టికెట్ రాకుండా చేసేందుకు వారు అనేక కోట్ల రూపాయిలు ఖర్చు చేయడం జరిగింది. అదంతా బూడిదలో పోసిన పన్నీరు అయింది
ఈరోజు సత్యం గెలిచింది అనే విషయం మాత్రమే నేను చెపుతున్నా తప్పించి.. నేను వక్రభాష్యాలు చెప్పడం లేదు. లక్ష్మీగణపతి ఆశీస్సులతో, కార్యకర్తల శ్రమతో, ప్రజల అండదండలతో నేను శాసనసభలో అడుగుపెట్టడం జరిగింది. కార్యకర్తల ఆకాంక్షలకు అనుగుణంగా నడుస్తూ ప్రజల సంక్షేమం కోసం నియోజకవర్గ అభివృద్ది కోసం కృషి చేస్తానని ఈ సందర్బంగా అనపర్తి శాసనసభ్యులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి వ్యాఖ్యానించారు.