ఇంక ఊపిరి పీల్చుకోవడానికి మాత్రమే మిగిలింది… పన్ను వేయడానికి !?
క్యాపిటల్ గెయిన్స్ పేరుతో ఆస్తులు అమ్ముకుంటే… వచ్చే లాభాల పైన 12.5% నుంచి 20% పన్నులు మిoగుతున్నారు !!
ఇప్పుడు వాహనాలు నష్టానికి అమ్ముకుంటే 18% పన్ను కట్టాలంట !!
ఇకనుంచి డిప్రిషియేషన్ (తరుగుదల) అనే క్లాజ్ కి ఇన్కమ్ టాక్స్ లో అర్ధం ఏముంటుంది !?
కారు 12 లక్షలకు కొని, 9 లక్షలకు అమ్మితే… ఆ తేడా 3 లక్షల మీద 18% అంటే ₹54,000 పన్ను కట్టాలి !!
నువ్వు ఆదాయపన్ను పరిధిలో ఉంటే… TDS (టాక్స్ డిడక్షన్ ఎట్ సోర్స్) !
నువ్వు ఆదాయపన్ను పరిధిలో లేకపోతే… జిఎస్టీ & వ్యాట్ & ఎక్సైజ్ డ్యూటీ & సెస్సులు !!
రోడ్డెక్కితే… రోడ్ టాక్స్ !
హైవేలు ఎక్కితే… టోల్ టాక్స్ !!
బ్యాంక్ లో డబ్బులు జమ చేసుకుంటే… క్యాష్ డిపాజిట్ చార్జెస్ !
బ్యాంకులో డబ్బులు వాపస్ తీసుకుంటే… క్యాష్ విత్ డ్రా చార్జెస్ !!
తినాలనుకుంటే… సర్వీస్ ట్యాక్స్ !
విశ్రాంతి తీసుకోవాలనుకుంటే… లగ్జరీ ట్యాక్స్ !!
జీవిత భీమా కావాలనుకుంటే… జిఎస్టీ !
ఆరోగ్య భీమా కావాలనుకుంటే… జిఎస్టీ !!
బ్రతికుండడానికి ఎలాగూ ప్రభుత్వం వేస్తున్న అన్ని పన్నులూ… చచ్ నట్టు కడుతున్నాం !
కాబట్టి…
దేశంలో రోజుకి కొన్ని లక్షలమంది సూసైడ్ చేసుకునో, సహజంగానో చచ్ పోతున్నారు… వాళ్ళకు కూడా డెత్ టాక్స్ పేరుతో ముందే ముక్కుపిండి కట్టించేసుకోండి ఎలాగూ చచ్ పోతారు కాబట్టి.
అప్పుడైతే… బిలియన్ డాలర్ల ఆర్థికవ్యవస్థ అని డప్పులు కొట్టుకోవడానికి డబ్బులే డబ్బులు !!
– – రామకృష్ణ మేడికొండ