విశ్వాసమెప్పుడూ
గెలుపుకి నాందీయే !
విజయం వరించాక
సంతోషం
వెలుగు శబ్దాలై ప్రతిధ్వనిస్తుంది.
ఒక్క గెలుపుకే సంబరపడిపోయి
ఆకాశమంతటినీ
దివిటీతో ఆవరించాలనుకోవడం
అహంకారమే అవుతుంది.
చీకటి వెలుగుల మర్మం
అర్థం చేసుకుంటేనే
నిత్య చలనశీలులమై
సూర్య తేజస్సుతో వెలుగొందుతాం !
శబ్ద నిశ్శబ్దాలను
అవగాహన చేసుకుంటేనే
సత్య శోధకులమై
శూన్యం నుండి కూడా
జీవితాన్ని వినగలుగుతాం !
– పి లక్ష్మణ్ రావ్
అసిస్టెంట్ రిజిస్ట్రార్
సహకార శాఖ విజయనగరం
9441215989