– జీబియస్ అంటు వ్యాధి కాదు
– లక్షలో ఒకశాతం మందికి మాత్రమే జిబియస్ ఉంది
– జీబియస్ పై నిరంతరం సమీక్షిస్తున్నా
– అన్ని జిజిహెచ్ లలో అందుబాటులో ఇమ్మునోగ్లోబిన్ ఇంజక్షన్లు
– మనుషులకు బర్డ్ ఫ్లూ సంక్రమించదు
– ప్రభుత్వాసుపత్రుల్లో సూపర్ స్పెషలిస్టులు, స్పెషలిస్టుల కొరత
– హెల్త్ టూరిజంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి
– వైద్య, ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ యాదవ్ కామెంట్స్….
అనంతపురం: ఆరోగ్య రంగంమీద కూడా కేంద్రం దృష్టి సారించింది
గతేడాదితో పోలిస్తే … వైద్య శాఖ మీదా..ఆయుష్ మీదా 12 శాతం మేర బడ్జెట్ పెంచి లక్ష కోట్లకు తీసుకెళ్లింది. ప్రధానంగా అసాంక్రమిక(నాన్ కమ్యునకబుల్ డిసీజెస్)లో ఏటా క్యాన్సర్ రోగుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో…36 రకాల క్యాన్సర్ సంబంధిత చికత్సకు సంబంధించిన మందులకు బేసిక్ కష్టమ్ డ్యూటీని తగ్గించింది.
నేషనల్ హెల్త్ మిషన్ ను ఐదేళ్లపాటు పొడిగించడంతో పాటు నిధుల్ని కేంద్రం పెంచింది. జీబియస్ అంటు వ్యాధి కాదు… ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. జీబియస్ బాధితుల్లో ఏఒక్కరికీ ఇమ్మునోగ్లోబిన్ ఇంజక్షన్ అందుబాటులో లేదనేది రాకూడదు.లక్షలో ఒకశాతం మందికి మాత్రమే జిబియస్ ఉంది. మరణాలు సంభవిస్తున్నాయి కాబట్టే అప్రమత్తంగా ఉన్నాం.
జీబియస్ పై నిరంతరం సమీక్షిస్తున్నాను. గుంటూరు జిజిహెచ్ లో ఒక్కసారిగా 5 కేసులు రాగానే స్పెషల్ సియస్ కృష్ణబాబు, డిఎంఇ, గుంటూరు జిజిహెచ్ సూపరింటెండెంట్ తో ఫోన్లో సమీక్షించాను. గుంటూరు జిజిహెచ్కు స్పెషల్ సియస్ ను పంపించాను. జిబియస్ అంటు వ్యాధి కాదు…ఒకరి నుండి ఒకరికి సంక్రమించదు.
గతంలో 15 శాతం జిబియస్ బాధితులకు మాత్రమే ఇమ్మునోగ్లోబిన్ ఇంజక్షన్లు ఇచ్చేవారు. ఇప్పుడడా సంఖ్య పెరిగింది కాబట్టి కారణాల్ని విశ్లేషిస్తున్నాం. అన్ని జిజిహెచ్ లలో ఇమ్మునోగ్లోబిన్ ఇంజక్షన్లు అందుబాటులో ఉంచేలా ఆదేశిచ్చాను.
జిబియస్ బాధితుల్ని న్యూరో ఫిజీషియన్ చూస్తారు.ఇమ్మునోగ్లోబిన్ ఇంజక్షన్ల నిల్వలు సరిపడా ఉండేలా ఇండెంట్ పెట్టాలని నిన్ననే చెప్పాను. మనుషులకు బర్డ్ ఫ్లూ సంక్రమించదు…అటువంటిదేమీ లేదు.అది ఫేక్ న్యూస్. బర్డ్ ఫ్లూపై మంత్రి అచ్చన్నాయుడు స్పష్టత ఇచ్చారు.
ప్రభుత్వాసుపత్రుల్లో సూపర్ స్పెషలిస్టులు, స్పెషలిస్టుల కొరత ఉంది. భర్తీ కోసం వరుసగా నోటిఫికేషన్లు ఇస్తూ నియామకాలు చేపడుతున్నాం. ఎఫ్ ఎన్ ఓలు, ఎంఎన్ ఓలు, స్వీపర్లు మొదలుకొని పేరామెడిక్స్ , నర్సింగ్ స్ఠాఫ్, మెడికల్ ఆఫీసర్ల నియామకానికి చర్యలు తీసుకుంటున్నాం.ఇన్ సర్వీస్ కోటా కింద మరో 300 మంది డాక్టర్లు వస్తున్నారు.
వైద్య, ఆరోగ్య శాఖలో అవినీతిని ఉపేక్షించేది లేదు. ఇందులోఎటువంటి మొహమాటం లేదు. అవినీతి జరుగుతున్నట్టు ఆధారాలుంటే ఇవ్వండి…విచారణ జరిపిస్తాం. ఏరోజైనా అవినీతి ఆరోపణలొస్తే నేను రాజకీయాల నుండి తప్పుకుంటాను.
దేశవ్యాప్తంగా క్యాన్సర్ రోగులు పెరుగుతున్నందున 36 రకాల క్యాన్సర్ లకు కేంద్రం బడ్జెట్లో నిధుల కేటాయించింది. జనాభాకు సరిపడా డాక్టర్లు లేరనే దానిపై కేంద్ర ప్రభుత్వం తగు నిర్ణయం తీసుకుంది. మన దేశంలో ఉన్న పరిస్థితుల దృష్ట్యా జనాభాకు సంబంధించి డాక్టర్ల సంఖ్య తక్కువగా ఉన్నందున రాబోయే ఐదేళ్లలో 75 వేల మెడికల్ సీట్లు పెంచాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది.
గత పదేళ్లలో 55 వేల మెడికల్ సీట్లు, 45 వేల పీజీ సీట్లు పెంచాం. ఈ ఆర్థిక సంవత్సరంలోనే 10 వేల మెడికల్ సీట్లను దేశవ్యాప్తంగా పెంచాలన్న కేంద్రం నిర్ణయం తీసుకుంది…తద్వారా మన రాష్ట్రానికి కూడా లబ్ధి చేకూరుతుంది. కొత్త మెడికల్ కాలేజీలు ఎలాగూ రాబోతున్నాయి కాబట్టి…వాటిలో మెడికల్ సీట్లు పెరిగే అవకాశం కూడా ఉంది.
జీజీహెచ్ లలో 30 నిమిషాల్లో ఓపీ చూడాలని ఆదేశించాం.
ఓపీ చూసిన డాక్టరే మధ్యాహ్నం రక్త పరీక్షలు చూసేలా చర్యలు తీసుకున్నాం. హెల్త్ టూరిజంపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెడుతోంది. రాబోయే రోజుల్లో కేంద్ర ప్రభుత్వం 50 టూరిస్టు కేంద్రాల్ని ఏర్పాటు చేస్తుంది.
టూరిజం, హెల్త్ ను ఇంటిగ్రేట్ చేసి ఒక టూరిజం హబ్ లాగా హీల్ ఇండియా పేరుతో తీసుకొస్తుంది. *గల్ఫ్, యూరోపియన్, ఆఫ్రికన్ దేశాలకు వెళ్తే ఖర్చుతో కూడుకున్నది కాబట్టి…భారతదేశంలోనే కాస్త చౌకగా వైద్య చికిత్స లభించేలా హీల్ ఇండియా పేరుతో హెల్త్ టూరిజంను తీసుకొచ్చే దిశగా కేంద్రం చర్యలు తీసుకుంది.