(భూమా బాబు)
ఆలోచించి ఓ స్కెచ్ / ప్లాన్ వేసి, స్నూకర్ టేబుల్ మీద క్యూ స్టిక్ తో నేర్పుగా కొడితే ఎదురుగా ఒక బంతిని, తిరిగి వచ్చి మరో కార్నర్లో మరో బంతిని పాకెట్ చేస్తాడు.
మద్య నిషేధం అంటూ షాక్ కొట్టేలా ధరలు వుంటాయి, అది కూడా స్టార్ హోటళ్లలో మాత్రమే దొరుకుతుంది అని తన ఎన్నికల వాయిస్ ఓవర్ టీజర్ వదిలాడు. మహిళలు నమ్మారు. అధికారం వచ్చింది.
వచ్చాక చెప్పినట్లే ధరలు పెంచాడు. ప్రభుత్వ దుకాణాలు తెరిచి మరీ అక్కడే క్యాష్ అండ్ క్యారీకి అమ్మించాడు. పేటీఎం/గూగుల్ పేలు లేవు. పిచ్చి పిచ్చి సొంత బ్రాండ్లు. ఏకంగా డిస్టీలరీలనే స్వాధీనం చేసుకొని ఎన్ని కేసులు తయారవుతున్నాయో, ఎన్ని అమ్ముతారో, ఎన్ని బాటిళ్ల డబ్బులు ఖజానాకు వెళుతుందో ఒక లెక్క లేదు.
షాక్ కొట్టిన ధరల్లో అమ్మే కేసుల్లో బాటిల్ బాటిల్ కూ కమీషన్లు సరాసరి సొంత హోల్‌సేల్ వ్యాపారం చేశాడు. ఆ మద్యంతో అనారోగ్యం, ప్రాణాలు పోతున్నాయి అని అరిచి గీపెట్టినా ఎన్నికల ఫలితాలు వచ్చేవరకు కంటైనర్లు వాడి అంచెలంచెలుగా కొరియర్ వ్యవస్థ నిర్మించి మరీ క్యాష్ రవాణా చేశారు. దానిని హవాలా ద్వారా విదేశాలకు పంపారు. సినిమాలు తీయించారు.
రోజుకు రెండువేల కోట్ల రూపాయల కుంభకోణం. దేశంలోనే అతి పెద్ద మద్యం కుంభకోణం. తన క్రిమినల్ డబుల్ మాస్టర్ మైండ్‌తో ఓ వైపు అధికారం, మరోవైపు వేల కోట్ల డబ్బులు దోచాడు.
పావైన రాజ్ కసిరెడ్డిని బకరాను చేస్తూ తన ఏ2 విజయసాయిరెడ్డి చేత, “తనింట్లోనే 2 మద్యం స్కామ్ మీటింగులు జరిగాయి, తానే అరబిందో నుండి అప్పు తీసి ఇచ్చాడు… కానీ పార్టీని ప్రజలను మోసం చేయించాడు కసిరెడ్డి” అని నమ్మించడానికి మరో డ్రామాకు తెరతీశాడు.
నాడు పావులైన అధికారులు కసిరెడ్డి పేరు చెబితే, కసిరెడ్డి మిథున్ రెడ్డి గురించి ఉప్పందించాడు. ఆపైన మాస్టర్ మైండ్ వరకు ఎలా లింకులు వున్నదీ విచారణలో తేలాల్సివుంది.
లక్షలాది మందికి పల్లెపల్లెలో అత్యధిక ధరలకు నాసిరకం మద్యం అంటగట్టి, మనిషి బలహీనతల మీద హోల్ సేల్ & రీటైల్ వ్యాపారం చేసి, వేల కోట్లను బావుకొన్న అతి పెద్ద స్కాముగా భారత దేశ చరిత్రలో నిలిచిపోనుంది. క్రిమినల్ డబుల్ మాష్టర్ మైండ్ జగనా మాజాకానా!