అమరావతి వేశ్యల రాజధాని అన్న విషయం మీద ఎక్కడికి పోయినా ….
వీళ్ళ మొదలార …
వీళ్ళ శ్రాద్ధం పెట్ట …
వీళ్ళ నోరు మూయించే వాళ్ళే కనపడటం లేదు అంటూ….
అమరావతి , విజయవాడ, గుంటూరు,మంగళగిరి ల లోనే కాకుండా ఎక్కడెక్కడో ఉన్న తెలుగు మహిళా మణుల ఆక్రందనలు!
ఇక సోషల్ మీడియాలో రెండు రోజులు గా ఆవేశం యధా రూపంలో ప్రదర్శించడం జరుగు తాంది!
ఇక మహిళలను అవమానించే వాళ్ళు పైకి రారు …లోకేష్
తప్పు చేసిన వాళ్లను ఉపేక్షించను … చంద్ర బాబు
సూక్తి ముక్తావళి యధా ప్రకారం!
ఆ తరువాత కథ కంచికి !
భూములు ఇచ్చి రోడ్డున పడ్డ రైతులకు , మహిళలకు యధా ప్రకారం అవమానాలు జరిగినాయి. జరుగుతున్నాయి. జరిగిపోతాయి ..
అసలు తెలుగు దేశం పార్టీ లో నే కాదు, ప్రజానీకం లో కూడా మిలిటెన్సీ చచ్చి పోయింది !
పై నుంచి క్రింది దాకా పచ్చి అవకాశ వాదం రాజ్య మేలుతాంది. పదవులు పొందిన వారికి ధనవంతులు లక్షలు ఖర్చు పెట్టి సన్మానాలు చేశారు. చేస్తున్నారు. నిన్నటి దాకా అమరావతి కి సంబంధించి అన్ని వేళలా వచ్చి, వాలి పడిన వాళ్ళు నేడు వినతి పత్రాలు స్వీకరిస్తున్నారు.
ఔరా … కాల మహిమ !
ఇక పదవులు పొందిన ఎం ఎల్ ఎ లు,ఎంపీలు తమ తమ మనుషులను చుట్టూ పెట్టుకొని కాలక్షేపం చేస్తున్నారు.
అదే సమయంలో ప్రత్యర్థి ఏ విషయంలోనూ వదల కుండా విషం జిమ్మిస్తూనే ఉన్నాడు!
కాబట్టి మళ్ళీ గెలవాలంటే పదవులు పొందిన వారు ఎవరూ తమ సొంత కలేజా తో గెలవ లేదు.
జగన్ కు వ్యతిరేకంగా ప్రజలు తమను ఎన్నుకున్నారని పై నుంచి క్రింది దాకా తెలుసుకొని.. అమరావతి నీ, ఆంధ్ర ప్రదేశ్ ను ప్రగతి బాట పట్టించాలని , ముఖ్యంగా దుష్టులను శిక్షించడం జరగాలని ప్రజలు ముక్త కంఠం తో కోరు కుంటున్నారు.
ఈ సందర్భంగా ఓ సూచన ఏమంటే…
మహిళా మణులందరూ విజయవాడ లో ఓ భారీ.. ఊరేగింపు తో వెళ్ళి గవర్నర్ కు, ఆ తరువాత ప్రధానికి , రాష్ట్రపతి కి వినతి పత్రాలు సమర్పించి ,
యావత్ లోకం దృష్టికి దుర్మార్గుల కుట్రలు తీసుకు రావాలని వినయ పూర్వక మనవి !
చెప్పడమే నా ధర్మం!
చెప్పటమే నా బాధ్యత! !
– జి వి రామ్ ప్రసాద్,
విజయవాడ