– బీజేపీ,ఎన్డీఏ పాలిత బీహార్,గుజరాత్ రాష్ట్రాల్లో వంతెనలు కూలడం సర్వసాధారణంగా మారింది
– వీటిపై విచారణలు ఉండవు.. చర్యలు ఉండవు
– ఇది బీజేపీ ద్వంద వైఖరికి నిదర్శనం
-మాజీ మంత్రి హరీశ్ రావు
హైదరాబాద్ : గుజరాత్ వడోదరలో మహిసాగర్ నదిపై ఉన్న గంభీర వంతెన కూలి పదిమంది దుర్మరణం చెందడం దురదృష్టకరం.మృతుల కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి,సంతాపం తెలియజేస్తున్నా. బీజేపీ,ఎన్డీఏ పాలిత బీహార్,గుజరాత్ రాష్ట్రాల్లో వంతెనలు కూలడం సర్వసాధారణంగా మారింది. వీటిపై విచారణలు ఉండవు. చర్యలు ఉండవు.
అదే మేడిగడ్డలో రెండు పిల్లర్లు కుంగితే రెండు రోజుల్లో ఎన్డీఎస్ఏ వచ్చి హడావిడిగా విచారణ పేరుతో పొలిటికల్ డైవర్షన్ చేస్తూ రాజకీయ ప్రేరేపిత రిపోర్టులను ఇస్తారు.
అదే ఎన్డీఏ ప్రభుత్వం ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో స్వయంగా కేంద్ర ప్రభుత్వం NDSA పర్యవేక్షణలో నిర్మిస్తున్న పోలవరంలో డయాఫ్రమ్ వాల్, కాపర్ డ్యాం, గైడ్ బండ్ కొట్టుకుపోయినా విచారణ ఉండదు నివేదిక ఉండదు.
రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో కుప్ప కూలిన ఎస్ఎల్బీసీ, సుంకిశాల, కొట్టుకుపోయిన వాటర్ పంప్ హౌస్, పెద్దవాగుపైన బీజేపీ కనీసం స్పందించదు ఎన్డీఎస్ఏ రాదు.
ఇది బీజేపీ ద్వంద వైఖరికి నిదర్శనం.బీజేపీ పాలిత రాష్ట్రాలలో,బీజేపీ మిత్ర పక్షాలు పాలన లో ఉన్న రాష్ట్రాల్లో ఒక నీతి.. బీజేపీని ప్రశ్నించే రాష్ట్రాలపై ఇంకో నీతి. ప్రమాదాలను రాజకీయ కక్ష సాధింపులకు ఆయుధంగా వాడుకునే బీజేపీ కుటిల బుద్ధికి ఇది అద్దం పడుతుంది.
ఈ రోజు గుజరాత్ లో కూలిన బ్రిడ్జిని విచారణల పేరిట మరమ్మత్తులు చేయరా అని కాళేశ్వరాన్ని కూలేశ్వరం గా దుష్ప్రచారం చేస్తున్న బీజేపీ నేతలను ప్రశ్నిస్తున్నా.
కూలిన బ్రిడ్జిలను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తులు చేసి వాడుకున్నట్టే ..తెలంగాణ కు జీవనాడి అయిన కాళేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ కు తక్షణమే మరమ్మత్తులు చేయాలని మరోసారి విజ్ఞప్తి చేస్తున్నా. మేడిగడ్డ కు మరమ్మత్తులు చేయకున్నా నీటిని తోడే వీలును సద్వినియోగం చేసుకోవాలని కోరుతున్నా .