(చాకిరేవు)
సంవత్సరాల తరబడి వేచి చూస్తున్న లక్షలాదిమందికి ఊరట!
ఆంధ్రప్రదేశ్లో 3,52,788 పనులు చేసిన చిన్నా చితకా మనుషుల ఆశలపై జగన్ నీళ్లు చల్లారు. 2014-15 నుండి 2018-19 ఆర్థిక సంవత్సరాల మధ్య మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) కింద ఎన్నో పనులు చేశారు. అప్పులు చేసి, తమ కష్టార్జితాన్ని వెచ్చించి, గ్రామాల్లో గర్వంగా తలెత్తుకునేలా పని చేశారు.
కానీ, వారి శ్రమకు తగ్గ ప్రతిఫలం దక్కలేదు. NREGASoft సిస్టమ్లో వారి పనులను “పూర్తయినవి/ముగిసినవి” గా మారేలా పద్మవ్యూహం పన్ని కక్షపూరితంగా వారి చెల్లింపులను సయింధవుడిలా జగన్ అడ్డుకున్నారు.
దేశంలోనే అత్యధికంగా ఆ పనులు చేసి, సిమెంటు రోడ్లు గట్రా వేసి పల్లెల, వార్డుల, వీధి వీధి రూపురేఖలు మార్చేసి చంద్రబాబు హయాంలో రికార్డులు సృష్టించారు. అందుకని పగబట్టాడు జగన్.
అలాంటి వారికి జగన్ రూపంలో జరిగింది కేవలం ఆర్థిక నష్టం మాత్రమే కాదు. అప్పులు చేసి పెట్టిన పెట్టుబడులు ఇరుక్కుపోవడంతో, వారి కుటుంబాల మనుగడ ప్రశ్నార్థకమైంది. పూటగడవని పరిస్థితుల్లో, తమ చెల్లింపుల కోసం వారు చేసిన అభ్యర్థనలు గాలిలో కలిసిపోయాయి. కష్టంలో ఉన్న వారిపై మరింత కక్ష గట్టి, తనిఖీల పేరుతో మానసికంగా వేధించాడు. వారి ఆందోళన ఏళ్లు గడిచినా తీరలేదు. కోర్టులు ఆదేశాలు ఇచ్చినా జగన్ పట్టించుకోలేదు. ఆ చెల్లింపులు మురిగిపోయేలా చేసి, ఆ పనుల చేసిన చిరు జీవితాలను దారుణంగా ముంచేశారు.
కానీ, చీకట్లో వెలుగురేఖలా చంద్రబాబు నాయుడు నిలిచారు. ఈ కాంట్రాక్టర్ల దుస్థితిని ఆయన గుర్తించారు. నిలిపివేయబడిన చెల్లింపుల వెనుక ఉన్న అమానుషాన్ని ఆయన అర్థం చేసుకున్నారు. మానవత్వం వున్న ఆయన మార్గదర్శకత్వంలో, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖతో నిరంతరం పట్టుదలతో సంప్రదింపులు జరిపింది. అన్యాయంగా ముగిసిపోయిన ఈ పనుల స్థితిని మార్చాలని అంకితభావంతో అభ్యర్థించారు.
చిట్టచివరకు, NIC-DRD మరియు ఇంటిగ్రేటెడ్ ఫైనాన్స్ డివిజన్లతో సంప్రదించి, మంత్రిత్వ శాఖ కూలంకషంగా సమీక్షించిన తర్వాత, కీలక నిర్ణయం తీసుకుంది. 3,52,788 అర్హత కలిగిన పనుల స్థితిని ‘పూర్తయినవి’ నుండి ‘కొనసాగుతున్నవి’గా 30 రోజుల నిర్దిష్ట కాలానికి మార్చడానికి మంత్రిత్వ శాఖ అంగీకరించింది.
ఈ చర్య ప్రత్యేకంగా వారి పనులకు చెల్లింపులను విడుదల చేయడానికి ఉద్దేశించబడింది. న్యాయం కోసం పోరాడుతూ సుదీర్ఘ నిరీక్షణలో ఉన్న లక్షలాది మంది చిరుజీవులు ఇప్పుడు ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇది వారికి కేవలం నిధుల విడుదల మాత్రమే కాదు, వారి శ్రమకు దక్కిన గుర్తింపు, వారి మనసుకు లభించిన ఊరట. జగన్ లాంటి కర్కోటకుడు.. మనతో గిల్లీ కజ్జాలు ఆడే ఇరుగుపొరుగు రాష్ట్రాలకు కూడా రాకూడదు, ఉండకూడదు అని కోరుకొందాం.
