కొడుకు ప్రహ్లాదుడు చూస్తుండగానే అతని తండ్రి హిరణ్యకశిపుడిని నారసింహుని రూపంలో నారాయణుడు పేగులు చీల్చి సంహరించాడు.
భక్తుని కోసం ఉగ్రరూపంలో కూడా నారాయణుడు వస్తాడు అనేదానికి ఉదాహరణ.
తన పాదాల చెంత పుట్టిపెరిగిన నారా చంద్రబాబు నాయుడుని దుర్మార్గులు రాజకీయంగా ఎదుర్కోలేక, నక్సల్స్‌తో కుట్రపన్ని చంపడానికి 22 బాంబుల క్లేమోర్ మైన్‌తో తన పాదాల అలిపిరిలోనే పేల్చితే.. గాలిలోకి ఎగిరి 3 పల్టీలు కొట్టి నుజ్జయిన కారు నుండి నారాను 3 నామాల స్వామి కాపాడారు.
మరింత భక్తితో.. స్వామి ప్రసాదంగా జనం కోసం పెట్టిన ప్రాణాన్ని మిత భోజనంతో కాపాడుకుంటూ.. పేదల సేవకు మరింత అంకితమవుతూ.. జనాన్ని రాజకీయ రాక్షసుల నుండి చంద్రబాబు కాపాడుతున్నారు.
తన స్వామికి కొండమీద చేస్తున్న తప్పుల గురించి తన్నుకొచ్చిన ఆవేశంతో.. భారతంలో కురుసభలో రాయబారిగా వచ్చిన నారాయణుడు హితోపదేశం చేసినట్లే.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో వై.ఎస్. రాజశేఖర రెడ్డికి హితోపదేశం చేసిన నారా మాటలు ఇవి.
నారా మాటలు పెడచెవిన పెట్టి, అక్కడే అదే సభలో ఈ మాటలకు ముందు ఎదురుదాడి చేయించి, ఎగతాళి చేయించి, చేసిన పరిహాసమే వై.ఎస్. రాజశేఖర రెడ్డిగారికి చివరిదైంది.
ప్రసాదాల నెయ్యిలో కూడా కల్తీ జరిగినప్పుడు మనసులో ఎంత కల్లోలం చెందాడో.. బయటకు చెప్పడానికి ఈ భక్తుడు.
దర్జాగా తిరుగుతున్న రాక్షసుల అధర్మాలకు అండగా ఎవరు నిలిచినా.. చివరకు భీష్ముడు అయినా.. కర్ణుడు అయినా.. మూల్యం చెల్లించక తప్పలేదు. వ్యవస్థలు తప్పినా అంతే. అదే ధర్మం.
రాజధర్మం పాటిస్తూ సంయమనం చూపిస్తుంటే.. సహనాన్ని పరీక్షిస్తూ.. “రఫ్ఫా రఫ్ఫా” అని రంకెలు వేస్తున్న అధర్మానికి పోగాళం దాపురించిందని అనిపిస్తోంది. లేదంటే ఇంత బహిరంగంగా, బరితెగించి ప్రజాస్వామ్య దేశంలో ఏ నాయకుడూ, ఏ రాజకీయ పార్టీ కూడా ప్రవర్తించలేదు, మొట్టమొదటి సారిగా ఈ పాపాత్ములు తప్పితే.
“సంభవామి యుగే యుగే” అని మరోసారి నిరూపితమవుతుంది. ఏ మేఘామో.. ఏ రూపమో తెలియదు. కలియుగ వైకుంఠం అడ్రస్ ఆంధ్రాను ఆ ఆపద రక్షకుడు చూసుకొంటాడు.