చాలామంది తారు రోడ్డు మీద వాకింగ్ చేయద్దు అంటారు.
కాంక్రీట్‌తో పోలిస్తే తారురోడ్డు కొంచెం మెత్తగా ఉంటుంది, ఎత్తు పల్లాలు లేకపోవడం వలన వేగంగా నడవవచ్చు.. కానీ ఇది గడ్డి లేదా మట్టి ‘కంటే చాలా గట్టిగా ఉంటుంది. ఇలాంటి గట్టి ఉపరితలంపై నడవడం వల్ల కీళ్లపై ఒత్తిడి పెరిగి ఈ సమస్యలు రావచ్చు.
– మోకాలి నొప్పులు
– షిన్ స్ప్లింట్స్ (కాలి ముందు భాగంలో నొప్పి)
– ప్లాంటర్ ఫాసియైటిస్ (మడమ కింద నొప్పి)
– హెయిర్‌లైన్ ఫ్రాక్చర్స్.
🔹🔹తప్పనిసరిగా తారురోడ్డుపై వాకింగ్ చేయవలసి వస్తలంటే :
🔹ఫుట్‌పాత్‌లు, మైదానాలు, ప్రత్యేక వాకింగ్ ట్రాక్ లు లేనప్పుడు మాత్రమే రోడ్డు వాడండి
🔹రాబోయే వాహనాలను చూడగలిగేలా ట్రాఫిక్‌కు ఎదురుగా నడవడం సురక్షితం.
🔹గట్టి ఉపరితలంపై నడిచేటప్పుడు షాక్ అబ్జార్బింగ్ షూలు ధరించడం వల్ల కీళ్లపై ఒత్తిడి తగ్గుతుంది .
🔹ప్రతిరోజూ ఒకే రకమైన ఉపరితలంపై నడవడం కంటే వివిధ రకాల ఉపరితలాలపై నడవడం వల్ల కండరాలు, కీళ్లు బలపడతాయి.
🔹ట్రాఫిక్ తక్కువగా ఉండే సమయాలలో వాకింగ్ చేయడం సురక్షితం.
తారురోడ్డు మీద వాకింగ్ చేయడం ఫుట్‌పాత్‌లు లేదా పార్కులలో నడవడం కంటే ఎక్కువ ప్రమాదకరం. ఫుట్‌పాత్‌లు లేదా నడవడానికి ప్రత్యేకించిన ప్రదేశాలు లేనప్పుడు మాత్రమే తారురోడ్డు మీద నడవవచ్చు,., అప్పుడు కూడా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.
– ఎస్‌ఎస్‌రెడ్డి
(తిరుపతి)