నేటి ఇరాన్ లోని ఒక ప్రాంతమే పర్షియా,ఇంకా సోగ్దియా లాంటివి కలిపి ఇరాన్ గా మారింది. ఆఫ్ఘనిస్తాన్ లో కూడా ప్రాచీన పర్షియా ఛాయలు ఉన్నాయి.
గొప్ప నాగరికతను మానవాళికి అందించిన ఘనత పర్షియన్లది.12000 ఏళ్ల క్రితం నుండి మనదేశం, ఆఫ్ఘనిస్తాన్ అంటే బాక్ట్రియన్,పర్సియన్లు సాంస్కృతిక ,జన్యుమూలాలు పంచుకున్నారు.
కొత్త రాతి యుగంలో మానవులు గొర్రెలమందలతో మనదేశంలో ప్రవేశించి ఇక్కడి స్థానికులతో కలిసి ద్రవిడ ప్రజలుగా ఏర్పడ్డారు.
ద్రవిడ ప్రజలతో కలిసి steppe జాతి ఉత్తర భారతంలో జనాభాగా ఏర్పడ్డారు. అదే జాతి ప్రజలు,అనటోలియన్ రైతులు,steppe జాతి ప్రజలు కలిసి నేటి ఇరాన్ ప్రజలుగా ఏర్పడ్డారు.
సెంట్రల్ ఆసియా,ఆర్మేనియా,టర్కీ , ఇరాక్,సిరియా,ఇరాన్, కుర్ద్ ప్రజలు కొంత జన్యుమూలాలు పంచుకున్నారు. గ్రీకులతో,రోమన్లతో ఇరాన్ చక్రవర్తులు వేల ఏళ్ళు ఎడతెగని యుద్దాలు చేసారు. ఎన్నో సామ్రాజ్యాలు పుట్టి పెరిగి నశించాయి.
ఇరాన్ ఆటవిక మూకల కారణంగా మన దేశంలో సామ్రాజ్యాలు కుప్ప కూలి సమాజం ఒడిదుడుకులు పడింది. కుషాణులు, హూణులు అనబడే ఆటవిక మూకల కారణంగా గుప్త సామ్రాజ్యం కుప్ప కూలిపోయినది.
శక రాజులు పశ్చిమ ప్రాంతంలో పాలకులుగా వందల సంవత్సరాల పాటు పరిపాలన చేశారు.ఆ జాతులు ఓడి హిందూ మతంలో రాజపుత్ జాతిగా ఇప్పుడు మిగిలాయి.
గౌతమి పుత్ర శాతకర్ణి శక రాజులని ఓడించి చక్రవర్తి గా పట్టాభిషేకం చేసుకున్నాడు అదే నేటి ఉగాది పండుగ.
ప్రపంచంలో మొదటి బహుళ జాతుల సామ్రాజ్యం cyrus అనబడే కురుష చక్రవర్తి నిర్మించాడు.3000 ఏళ్ల పూర్వమే ఆయన తన సామ్రాజ్యంలో అందరూ తమకు నచ్చిన మతం,భాష , సంస్కృతి అనుసరించే స్వేచ్చ ఇచ్చాడు.
పెర్షియన్ ఖరోస్టి లిపి నుండి పాళి,బ్రహ్మి లిపులు పుట్టుకు వచ్చాయి.పెర్షియన్ సామ్రాజ్యం abbasid ఖలీఫా ధాటికి కూలింది.వారి సంస్కృతి కనుమరుగై అరబ్బు సంస్కృతికి లొంగి అది ఇస్లామిక్ దేశంగా మారింది.
నాటి పెర్షియన్ జొరాస్ట్రియన్ ప్రజలు పశ్చిమ ప్రాంతంలో సింధు, గుజరాత్, మహారాష్ట్రలో తలదాచుకుని ఈ దేశం గర్వించే శాస్త్రవేత్తలు, పారిశ్రామిక వేత్తలు,సైన్యాధికారులుగా ఎదిగారు.
ఒకనాడు వారక్రమించిన భూమి వారికి ఆశ్రయమై వారి జాతి,మతం,సంస్కృతిని అరబ్బుల దాడి నుండి రక్షించింది.
ఆఫ్ఘన్,ఇరాని,తజిక్ ఇతర ఇరానియన్ జాతులు దూరంగా మన దాయాదులు. వెళయేళ్ల క్రితం వారికి మనతో రక్త సంబంధం కలదు.
ఇస్లాం మతం రుద్దబడక పూర్వం పెర్షియన్ మతం జొరాస్ట్రియన్. అది వైదిక మతం లాగా మిత్ర,వరుణ,సూర్యుడి ఆరాధన.ఆ భాషను పాణిని వ్యాకరణం ఆధారంగా పునర్నిర్మించి అవెస్తాను అంటే జొరాస్ట్రియన్ ప్రజల వేదాన్ని క్రోడీకరించారు.
వేల ఏళ్ళ నుండి మన దేశం,ఇరాన్ ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తున్నాయి.షియా ముస్లీంలు ఇరాన్ మూలాలు కలవారు.అలీ మహమ్మద్ ప్రవక్త అల్లుడు, కర్బలా యుద్ధంలో ఖలీఫా సైన్యం ప్రవక్త కుటుంబాన్ని మట్టుపెట్టి ఇస్లామిక్ సామ్రాజ్యం స్థాపించింది.
– శ్రీనివాస