విజయవాడ: ఇక్కడి సత్యనారాయణ పురంలో బుధవారం ఉదయం జరిగిన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ శాఖలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పాల్గొన్నారు. తిరుగు ప్రయాణంలో జింఖానా గ్రౌండ్ వద్ద ఛాయ్ పే చర్చా కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో కార్యకర్తలతో మమేకం అవుతూ పార్టీ బలోపేతానికి సమిష్టి కృషి అవసరం మాధవ్ అన్నారు. జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరాం సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో అమరావతి రాజధాని నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేస్తున్న సహకారంతో రాజధాని నిర్మాణం వేగవంతంగా జరుగుతోందని ఈ సందర్భంగా మాధవ్ ప్రస్తావించారు. బీజేపీ నేతలతో పాటు ఆర్ఎస్ఎస్, వీహెచ్ పికి చెందిన ప్రముఖులు ఛాయ్ పే చర్చ లో పాల్గొన్నారు.