– రేవంత్ ద్రోహంలో పాలు పంచుకుంటున్న కాంగ్రెస్ మంత్రులు
– సమావేశానికి సంబంధించిన మినిట్స్ బయటపెట్టాలి
– మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి
హైదరాబాద్: కేంద్ర జలశక్తి శాఖ నిర్వహించిన ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో అసలు బనకచర్ల అంశమే లేదని సీఎం రేవంత్, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ చెబుతున్నారు.తెలంగాణకు అన్యాయం జరిగితే తెలంగాణ సమాజం ముందు శాశ్వత ద్రోహులుగా మిగిలిపోతారు.
పోలవరం, బనకచర్ల మీద కమిటీ వేయాలని ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు నిర్ణయం తీసుకున్నట్లు ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు చెబుతున్నాడు. అసలు ఈ సమావేశానికి సంబంధించిన మినిట్స్ బయటపెట్టాలి. అసలు సమావేశంలో ఏ చర్చించారో చెప్పకుండా చర్చల స్థాయికి రావడం తెలంగాణ విజయం అని సీఎం రేవంత్ చెప్పడం విడ్డూరంగా ఉంది.
సీఎం రేవంత్ స్వామిభక్తి కోసం తెలంగాణ హక్కులను తాకట్టు పెడితే ఊరుకోం. గోదావరి, కృష్ణా నదుల నుండి నీళ్ళను ఎత్తివేయకుండా కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల ఉసురు పోసుకుంటున్నది. కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేస్తే ప్రజాక్షేత్రంలో శిక్ష తప్పదు.