– టీడీపీ అంటేనే ‘తెలుగు దండుపాళ్యం పార్టీ’గా మారింది
– ఆర్కె రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన భానుప్రకాశ్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి
– జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు దీనిపై చర్యలు తీసుకోవాలి
– సభ్య సమాజం సిగ్గుపడేలా భానుప్రకాశ్ వ్యాఖ్యలు
– సీఎం, డిప్యూటీ సీఎం, హోమంత్రిలు దీనిపై స్పందించాలి
– విశాఖపట్నం వైయస్ఆర్సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి
విశాఖపట్నం: మాజీ మంత్రి ఆర్కే రోజాపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్‌ను తక్షణం అరెస్ట్ చేయాలని వైయస్ఆర్సీపీ మహిళా విభాగం అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి డిమాండ్ చేశారు.
విశాఖపట్నంలోని వైయస్ఆర్సీపీ నగర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్లు దీనిపై తక్షణం చర్యలు తీసుకోవాలని కోరారు. మొత్తం మహిళా లోకాన్ని కించపరిచేలా మాట్లాడిన భానుప్రకాశ్ వ్యాఖ్యలపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్,
హోంమంత్రి అనితలు స్పందించాలని, అతడిని టీడీపీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు. రాష్ట్రంలో రెడ్‌బుక్ రాజ్యాంగం అమలుతో సామాన్య మహిళల నుంచి మాజీ మంత్రుల వరకు రక్షణ లేని పరిస్థితి దాపురించిందని మండిపడ్డారు.
రాష్ట్రంలో టీడీపీ ఎమ్మెల్యేలు దిగజారిపోయి నీచమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మాజీ మంత్రి ఆర్కె రోజాపై నగరి టీడీపీ ఎమ్మెల్యే గాలి భానుప్రకాశ్ దారుణంగా వ్యాఖ్యలు చేశారు. మహిళలు అంటే టీడీపీ నేతలకు ఉన్న చులకనభావం ఎంతగా ఉందో దీనిని బట్టి అర్థమవుతోంది. ఇటువంటి వ్యాఖ్యలు చేసిన గాలి భానుప్రకాశ్‌పై పోలీసులు చట్టప్రకారం చర్యలు తీసుకోవాలి.
తక్షణం ఆయనను అరెస్ట్ చేయాలి. మొత్తం మహిళా లోకాన్ని కించపరిచేలా తన ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను సీరియస్‌గా తీసుకుని అతడిని పార్టీ నుంచి చంద్రబాబు సస్పెండ్ చేయాలి. టీడీపీలో ఇలాంటి వారు ఎమ్మెల్యేలుగా ఉండటం ఆ పార్టీకే సిగ్గుచేటు. వెంటనే గాలి భానుప్రకాశ్ ఆర్కె రోజాకు క్షమాపణలు చెప్పాలి. ఆయన మాట్లాడిన మాటలపై జాతీయ, రాష్ట్ర మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేస్తున్నాం. వారు వెంటనే భానుప్రకాశ్‌పై చర్యలు తీసుకోవాలి.
మాజీ మంత్రిగా ఆర్కే రోజా ప్రజల కోసం పనిచేశారు. కూటమి ప్రభుత్వంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రశ్నిస్తున్నందుకే ఆమెపై వ్యక్తిత్వ
హననం చేసేలా టీడీపీ ఎమ్మెల్యే మాట్లాడారు. ‘హీరోయిన్‌కు తక్కువ,వ్యాంప్‌కు ఎక్కువ, రూ.2000 ఇస్తే ఏమైనా చేస్తారంటూ’ చాలా దారుణంగా
మాట్లాడారు. ఇదే వ్యాఖ్యలను గాలి భానుప్రకాశ్ కుటుంబంలోని మహిళలపై చేస్తే ఆయన సమర్థిస్తారా? ఎమ్మెల్యేగా భానుప్రకాశ్ చేస్తున్న అవినీతిని, ఇసుక దందాను ప్రశ్నించినందుకు ఆమెపై వ్యక్తిగత దుర్భాషలకు దిగారు. ఆయన చేసిన వ్యాఖ్యలను చూసి సభ్య సమాజం సిగ్గుపడుతోంది.
సామాన్య మహిళల నుంచి మాజీ మంత్రుల వరకు ప్రతి ఒక్కరినీ టీడీపీ నాయకులు ట్రోల్ చేయడం, అసభ్యంగా కామెంట్లు పెట్టడం, వారిపైన వ్యాఖ్యలు చేయడం పరిపాటిగా మారింది. టీడీపీ అంటే తెలుగు దండుపాళ్యం పార్టీగా మారిపోయింది. తెలుగు దాడుల పార్టీ, తెలుగు దుండగుల పార్టీగా మారిపోయింది.
ఆర్కె రోజాపై ఇటువంటి వ్యాఖ్యలు చేసిన ఘటనపై సీఎం, డిప్యూటీ సీఎం, హోమంత్రి కనీసం స్పందించలేదు. ఇది తప్పు అని కనీసం తన పార్టీ ఎమ్మెల్యేను మందలించలేదు. అంటే మహిళలు అంటే వారికి ఉన్న గౌరవం ఇదేనా?
గతంలో కూడా టీడీపీ నాయకుడు బండారు సత్యనారాయణ మూర్తి, ఆనం వెంకట రమణారెడ్డి, అయ్యన్నపాత్రుడు కూడా రోజాపై నోరుపారేసుకున్నారు.తెలుగుదేశంకు అనుబంధంగా పనిచేసే ఐటీడీపీ, చేబ్రోలు కిరణ్, సీమరాజా, కిరాక్ఆర్పీ వంటి వారు సోషల్ మీడియాలో వైయస్ఆర్సీపీకి చెందిన మహిళా నేతలపై ఎటువంటి దారుణమైన పదజాలాన్ని వాడుతున్నారో ప్రజలు గమనిస్తున్నారు.
చివరికి మహిళా హోమంత్రిగా ఉన్న అనిత కూడా వైయస్ భారతమ్మ, విజయమ్మలను ఉద్దేశించి చాలా దారుణంగా మాట్లాడారు. అంటే మహిళలను గౌరవించే సంస్కృతి టీడీపీలో లేదా?
మహిళా కమిషనర్ చైర్పర్సన్ ఉండి కూడా కనీసం స్పందించడం లేదు. ఇలాంటి ఘటనలు టీడీపీ వారిపై జరిగితే సుమోటో కింద కేసులు పెడుతున్నారు. కానీ వైయస్ఆర్సీపీ వారి విషయంలో మహిళా కమిషన్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది.
మహిళా హోమంత్రి అనిత పేరుకే మంత్రి. ఈ రాష్ట్రంలో మహిళలపై అన్యాయాలు,అరాచకాలు జరుగుతున్నా ఆమె నోరు మెదపరు. కేవలం వైయస్ జగన్ పై రాజకీయ విమర్శలు, ఆరోపణలు చేయడానికే ఆమెకు మంత్రి పదవి ఇచ్చారు. సీనీ రంగంలోని మహిళలపై టీడీపీ నేతలకు చిన్నచూపు కనిపిస్తోంది. అందుకే ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. తెలుగుదేశం పార్టీని స్థాపించిందే ఎన్టీఆర్.
టీడీపీలో సినీ నటడు బాలకృష్ణ, కూటమిలోని జనసేన నేత పవన్ కళ్యాణ్ కూడా సినీ రంగం నుంచే వచ్చారు. అలాగే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి వచ్చి ఆర్కే రోజాపై టీడీపీ ఎమ్మెల్యే దుర్భాషలాడుతుంటే వీరికి పట్టదా? మహిళలపై ఎవరైనా చేయి వేస్తే తాట తీస్తానన్న పవన్ కళ్యాణ్ దీనిపై ఎందుకు స్పందించడం లేదు? కూటమి ఎమ్మెల్యేలకు ఏదైనా మినహాయింపులు ఇచ్చారా? గతంలో ఐటీడీపీ వారే నేటి ప్రధాని మోదీ తల్లిని, కుటుంబసభ్యులను, పవన్ కళ్యాణ్ కుటుంబసభ్యులను కూడా ట్రోల్ చేశారు.