• పోలీసులను బెదిరించే రీతిలో జగన్ మాట్లాడటం చట్టరీత్యా నేరం
• పోలీసుల వ్యక్తిత్వ హననం కలిగించేలా జగన్ వ్యాఖ్యలు అభ్యంతరకరం
• చిత్తూరు ఎస్పీ రిటైర్ అయినా వదలనని వ్యాఖ్యానించడం పోలీస్ అధికారిని బెదిరించడమే
• పోలీసులను బెదిరిస్తున్న జగన్… సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్లు పోస్ట్ లు పెడుతున్న వైసీపీ బ్యాచ్ పై వెంటనే కేసు నమోదు చేసి అరెస్ట్ చేయాలి
• టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్
మంగళగిరి: పోలీసులను బెదిరిస్తున్న జగన్.. పోలీసులపై ఇష్టం వచ్చినట్లు పోస్ట్ లు పెడుతున్న వైసీపీ సోషల్ మీడియా మూకలపై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన శుక్రవారం ఇక్కడి టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో మాట్లాడారు. మద్యం కుంభకోణంలో సిట్ దర్యాప్తు ముమ్మరం చేయడంతో వైసీపీ నేతలకు కళ్లలో భయం.. కాళ్లలో వణుకు మొదలై ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారన్నారు. ఆయన ఇంకా, ఏమన్నారంటే…
కారు దిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని ఎస్పీ అభ్యంతరం తెలిపితే ఆయన మీద రౌడీ షీట్ పెడతావా జగన్? అవగాహన లేకుండా వంశీ మంచివాడు అంటారా? ఒక దళితున్ని కొట్టి హైదరాబాద్ లో బంధించిన వ్యక్తి మంచివాడా? దళితున్ని కొడితే నీకేం జాలి కలగలేదా? చెవిరెడ్డి నీతి పరుడా.. చెవిరెడ్డిని చూస్తే బాధేసిందా? కోట్లాది రూపాయాలు కొట్టేసిన చెవిరెడ్డిని అరెస్ట్ చేస్తే జగన్ కు బాధ కలిగిందటా? నిందితులను చూస్తే జగన్ కు ఎందుకు అంత ప్రేమ? అన్నీ మరచి సభ్య సమాజంలో మహిళలుంటారని కూడా లేకుండా.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి చరసాల పాలైన పోసానిని చూస్తే జగన్ రెడ్డికి గుండె చెరువై పోయిందట? మహిళా ఎమ్మెల్యేపై ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడిన మాటలకు మీకు ఎందుకు గుండె చెరువు అవ్వలేదు జగన్ రెడ్డి? తప్పులు చేసిన ఓఎస్డీ కృష్ణమోహన్ ను చూస్తే గుండె తరక్కు పోయిందట? ధనుంజయ్ రెడ్డి లాంటి మంచి వ్యక్తిని ఇంతవరకు చూడలేదంటారా? ధనుంజయ్ రెడ్డి సంగతి సమాజానికి తెలియాదా?
ఇలాంటి వారికోసం బాధపడుతున్న మీరు.. మరి మూడు మాస్క్ లు అడిగినందుకు దళిత డాక్టర్ సుధాకర్ ను దారుణంగా రోడ్డుపై ఈడ్చి చంపారు. అప్పుడు మీ గుండె ద్రవించలేదా జగన్ రెడ్డి? కన్నీరు కారలేదా జగన్ రెడ్డి? మీ ఎమ్మెల్సీ దళిత డ్రైవర్ సుబ్రహ్మణ్యంను దారుణంగా చంపి డోర్ డెలవరీ చేస్తే దానికి ఇప్పటికీ కారణం చెప్పలేదు… చంపినోడికి పూలదండలు వేశారు.. దళిత బిడ్డను చంపినా మీరు పట్టించుకోలేదు? మీ పాలనలో వేధింపులు తాళలేక అబ్దుల్ సలాం కుటుంబం రైలు కింద పడి చనిపోయారు.. ఆనాడు వేధించిన పోలీసులను మీ సంగతి చూస్తా అని అనలేదే జగన్ రెడ్డి? మైనార్టీలు అంటే మీకు అంత చులకనా? వరప్రసాద్ అనే దళిత బిడ్డ ఇసుక అక్రమ రవాణపై ప్రశ్నిస్తే పోలీస్ స్టేషన్ లో గుండు కొట్టించారు. ఆ పోలీసులకు సినిమా చూపించలేదే జగన్ రెడ్డి? ఆ పోలీసులను ప్రశ్నించలేదేమి జగన్ రెడ్డి..? ఆ పోలీసులు రిటైర్డ్ అయినా మీ సంగతి తేలుస్తామనలేదే? వరప్రసాద్ ఒక ఎస్సీవాడనా? ఒక దళితుడనా? అదే చెవిరెడ్డైతే కన్నీరు బొటబొటా కరేవి కదా? వద్దంటే కారేవి మీకు కన్నీరు?
చీరాల కిరణ్ మాస్క్ పెట్టుకోలేదని వెంటబడి కొట్టారు. మరి ఆ పోలీసులను ఏమనలేదే జగన్ రెడ్డి.. దళితులను పోలీసులు కొడితే అభినందిస్తారా జగన్ రెడ్డి? ఓం ప్రతాప్ కల్తీ మద్యంపై ప్రశ్నిస్తే చెట్టుకు వేలాడదీసి చంపారు? అతని సెల్ ఫోన్ ఆ పోలీస్ ఆఫీసర్ తీసుకున్నాడు.. ఇప్పటికీ ఇవ్వలేదు.. మరి ఆ పోలీసులను జగన్ రెడ్డి ప్రశ్నించలేదే? ఇప్పటి హోంమినిస్టర్ అనిత, ఎమ్ ఎస్ రాజులు కడపలోని మీ పులివెందుల నియోజకవర్గంలో అత్యాచారం చేయబడి హతమార్చి చనిపోయిన దళిత మహిళ నాగమ్మ కుటుంబాన్ని పరామర్శించడానికి నాడు వెళితే వారిపై ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు.. మీ పాలనలో దళితులపైనే ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టిన వండర్ ఫుల్ పోలీసులు ఉన్నారు? మీ ఐదేళ్ల పాలనలో డీజీపీని కలవడానికి కూడా అనుమతి ఇవ్వలేదు.
11 సీట్లతో అపోజిషన్ కూడా సాధించుకోలేక పోయిన వ్యక్తి మాటలు నేడు కోటలు దాటుతున్నాయి. పోలీస్ వ్యవస్థను కించపరిచేలా మాట్లాడుతున్నారు. గత ఐదేళ్ల పాలనలో జరిగిన విషయాలు మరచి మాట్లాడుతున్నారు. బంగారుపాళ్యంలో మీరు కారు దిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పిన ఎస్పీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతావా? ఆయన వ్యక్తిత్వం హననం చేస్తావా? ఎస్పీని భయపెట్టాలని చూస్తావా? మళ్లీ తప్పుడు సంప్రదాయం అంటూ మాట్లాడుతావా? ఏది తప్పుడు సాంప్రదాయం.. మీరు దిగితే శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందని చెప్పడం తప్పుడు సాంప్రదాయమా జగన్ రెడ్డి? మీ ప్రభుత్వం వచ్చాక చిత్తూరు ఎస్పీపై రౌడీ షీట్ ఓపెన్ చేస్తామని షోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టిస్తావా?
నువ్వు ఎవరు రౌడీ షీట్ ఓపెన్ చేయడానికి? రౌడీ షీట్ పెడతామని చెప్పడం అతన్ని బెదిరించడం కాదా? ఎస్పీ రిటైర్డ్ అయినా లాక్కొస్తానంటున్నాడు.. నువ్వెవరు లాక్కొని రావడానికి జగన్? ఎస్పీకి సినిమా చూపిస్తానంటున్నాడు. మద్యం కుంభకోణంలో మీరు కొట్టేసిన డబ్బులతో తీసిన సినిమాలు చూపిస్తావా? ఎస్పీనే నీకు సినిమా చూపించాడు కిందకు దిగకుండా? ఎస్పీకి ఇంకా 25ఏళ్ల సర్వీస్ ఉంది. అప్పటికి ఎస్పీ రాష్ట్రానికి డీజీ అవుతాడు.. అప్పటికి నువ్వు జైల్లో ఉంటావో.. లండన్ లో ఉంటావో ఎక్కడ ఉంటావో నీకే తెలియని పరిస్థితి.
వైసీపీ ఒక రాజకీయ పార్టీ అనుకోవాలా? ఫ్యాక్షనిస్టు గ్రూపు అనుకోవాలా? ఫ్యాక్షనిస్టుల మాటకు జగన్ మాటలకు ఏమైనా తేడా ఉందా పాత్రికేయులే చెప్పాలి? నాటి జగన్ పాలనలో పోలీసులు ఆర్టికల్ 19 ఎప్పుడూ అమలు చేయలేదు. నేడు జగన్ స్వేచ్ఛగా తిరుగుతున్నారు. తెనాలి వెళ్లారు. పొదిలి వెళ్లారు. బంగారుపాళ్యం వెళ్లారు, సత్తెన పల్లి వెళ్లారు ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళ్లారు.
ఆనాడు మా చంద్రబాబును వెళ్లనిచ్చారా? ఎక్కడికి అక్కడ అడ్డుకట్టలు వేసి చట్ట వ్యతిరేక పనులు చేశారు. నాడు చట్ట విరుద్ధంగా పనిచేసిన పోలీసులకు సినిమా చూపిస్తానని జగన్ ఎందుకు అనలేదు? నేడు మద్యం కుంభకోణంలో సిట్ విచారణతో వణుకిపోతూ.. డైవర్షన్ పాలిటక్స్ చేస్తూ.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. ఇష్టం వచ్చినట్లు పోస్ట్ లు పెడుతున్నారు.. ఎస్పీపై పోస్ట్ పెట్టిన గొట్టిపాటి వంశీ కృష్ణతోపాటు.. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసిన జగన్ పై కేసు పెట్టి వెంటనే అరెస్ట్ చేయాలి.