– టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డిమాండ్
సర్వేపల్లి: ఏపీలో జరిగిన లిక్కర్ స్కాం అంతర్జాతీయ స్థాయికి వెళ్ళింది. మోడీ పెహల్గాం టెర్రరిస్ట్ లపై తీసుకున్న చర్యలు చూశాం… అలాగే ఆర్థిక ఉగ్రవాదులపై కూడా చర్యలు తీసుకోవాలి అని ప్రజలు కోరుతున్నారని సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. ఈడీ అధికారులు చిన్న చిన్న వాటిపై చర్యలు తీసుకుంటారు. కానీ, లిక్కర్ స్కాం లో చాలా మంది పేదల ప్రాణాలు పోయాయి. ఢిల్లీ లిక్కర్ కేసు, కాళేశ్వరం పై ఈడీ విచారణ చేపడుతోంది. అలాగే ఈడీ ఏపీ లో జరిగిన భారీ లిక్కర్ స్కాంపై చర్యలు తీసుకోవాలి. 3, 200 కోట్లే మద్యం స్కాం కాదు ఇది…. 30 వేల మంది ప్రాణాలు బలిగొన్న ఏపీ మద్యం స్కాం పై విచారణ జరగాలి.
ఈ కేసులో వైసీపీ నేతల కర్రెప్షన్ దేశ సరిహద్దులు దాటింది… ఈ స్కాం దేశ సరిహద్దులు దాటించిన వైసీపీ నేతలకు గోల్డ్ మెడలు ఇవ్వాలి. 50 కోట్లు పెట్టి కుక్క పిల్లను కొన్నాను అని ఒక వ్యక్తి సోషల్ మీడియాలో పెడితే అది ఫేక్ అని తెలియక ఈడీ వెంటనే స్పందించింది. అలాగే ఏపీ మద్యం స్కాం పై కూడా విచారణ చేయాలని సోమిరెడ్డి డిమాండ్ చేశారు.