– ఏడాది పాలనలో 250 మంది అన్నదాతల బలవన్మరణం
– ఆత్మహత్య చేసుకున్న రైతులను తక్షణమే ఆదుకోవాలి
– మామిడి, ధాన్యం, పొగాకు ఏ పంటకూ మద్ధతు ధర లేదు
– వ్యాపారుల సిండికేట్ తో అన్నదాతలకు అందని గిట్టుబాటు ధర
– ప్రజలకు కందిపప్పు కూడా ఇవ్వలేని దుస్ధితిలో కూటమి పాలన.
– ఒంగోలు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైయస్సార్సీపీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు
ఒంగోలు: కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒంగోలు లోని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ… పెట్టుబడి సాయం లేకుండా రైతాంగాన్ని నిర్లక్ష్యం చేస్తూ.. కూటమి ప్రభుత్వం వ్యవసాయాన్ని అస్తవ్యస్తం చేసిందని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాల వల్ల ఏడాది కాలంలో 250 మంది రైతులు బలవన్మరణానికి గురయితే.. ప్రభుత్వం మాత్రం కేవలం 104 మంది అని మాత్రమే చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆత్మహత్య చేసుకున్న రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
ఎన్నికల ముందు రైతులకు అన్నదాత సుఖీభవ పేరుతో రూ.20 వేలు అని చెప్పారు.
ఏడాది గడిచి రెండో సంవత్సరం లోకి అడుగుపెట్టినా వారికి ఏ సాయం చేయలేదు.పొదిలిలో పొగాకు రైతుల పరిస్ధితి అత్యంత అధ్వాన్నంగా తయారైంది. పొగాకు బేళ్ల వేలంలో వ్యాపారులు గ్రూపుగా తయారవడంతో రైతులకు మంచి ధర లేకుండా పోయింది. అయినా ప్రభుత్వం రైతుల గోడు పట్టించుకోవడం లేదు.
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రైతులకు మద్ధతు ధర అందేలా ప్రభుత్వమే రూ.100 కోట్లు నిధులు విడుదల చేసి, మార్క్ ఫెడ్ ద్వారా
కొనుగోలు చేసి రైతులకు మెరుగైన ధర అందించారు. ఇవాళ మిర్చి, పత్తి, అపరాలు ఏ పంట చూసుకున్నా మద్ధతు ధర లేకుండా పోయింది. ప్రకృతి వైపరీత్యాల వల్ల నష్టం జరిగితే వారికి నష్టపరిహారం అందించడంతో పాటు ఇన్ పుట్ సబ్సిడీ వెంటనే ఇచ్చాం.
ఇవాళ ఉచిత ఇన్సూరెన్స్ చేయలేదు. రైతులను పూర్తిగా గాలికొదిలేశారు.ఒంగోలులో గతంలో అపరాలు పంట నష్టపోతే ఇ-క్రాప్ ద్వారా నష్టపోయిన రైతులకు లక్షల్లో పరిహారం అందింది. వ్యవసాయ శాఖ మంత్రి అచ్చన్నాయుడు ప్రగల్భాలు పలకడం తప్ప పనుల్లేవు.
రైతు సాగు ని నిర్లక్యం చేస్తే మనుగడ ఉండదు. అలాంటి రైతులను ఆదుకోల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదే. రైతులు నాగలి వదిలేసే విధంగా
చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి హయాంలో రైతు భరోసాతో అందిస్తే, రెండేళ్లు అయినా మీరు రైతులకు రూపాయి కూడా సాయం లేదు.
రైతులకు పెట్టుబడి సాయం ఎలాగూ లేదు కనీసం మద్ధతు ధర కూడా ఇవ్వడం లేదు.రైతులు యూరియా కోసం ఎదురు చూస్తుంటే కనీసం స్పందడం లేదు. ప్రజలకు కందిపప్పు కూడా ఇవ్వలేని పరిస్ధితికి ఈ ప్రభుత్వ పాలన దిగజారిపోయింది.సార్టెక్స్ బియ్యం అని ప్రకటించి అవి కూడా సక్రమంగా అమలుచేయడం లేదని ఆయన మండిపడ్డారు.