– న్యాయం కోసం టీడీపీ గ్రీవెన్స్‌ను ఆశ్రయించిన బాధితురాలు
• వివిధ సమస్యలపై తరలి వచ్చిన అర్జీదారులు
• అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారానికి కృషి చేసిన శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్
మంగళగిరి: వివిధ సమస్యలతో శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయానికి తరలివచ్చిన అర్జీదారుల నుండి శాసన మండలి చీఫ్ విప్ పంచుమర్తి అనురాధ, బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్ నీలాయపాలెం విజయ్ కుమార్ లు అర్జీలు స్వీకరించారు. వారి సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. పలు సమస్యలపై అధికార్లతో వెంటనే ఫోన్లలో మాట్లాడి సమస్యలను పరిష్కరించారు.
• బాపట్ల జిల్లా, చుండూరు మండలానికి చెందిన అంబటి అంకమ్మ గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తి చేస్తూ.. తమ పొలం వద్ద తుంగభద్ర డ్రైనేజీ కట్టలను ధ్వంసం చేసి ఆక్రమించుకొని సాగుచేసుకుంటున్నారని.. ఈ ఆక్రమణలపై చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
• ఎన్టీఆర్ జిల్లా, విజయవాడకు చెందిన బాదర్ల రోజా గ్రీవన్స్ లో అర్జీ ఇచ్చి విజ్ఞప్తిచేస్తూ.. కోడూరు మండలంలోని విశ్వనాథపురం గ్రామంలోని తమ పొలం పక్కన ఉన్న డొంక బోదెను వైశెట్టి నాగణేశ్వరరావు పూడ్చి వేసి పొలం నుండి మురుగు నీరు, వర్షపు నీరు పోకుండా అడ్డుకుంటున్నాడని.. దయ చేసి అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
• కర్నూలు జిల్లా, కోడుమూరు మండలం అమడగుంట్ల గ్రామానికి చెందిన కృష్ణుడు గ్రీవెన్స్ లో అర్జీ ఇచ్చి అభ్యర్థిస్తూ.. తమ భూమిని సర్వే చేసి హద్దులు చూపాలని జేసి ఆదేశించినా ఎమ్మార్వో ఆఫీసు అధికారులు పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేశారు
• వీటితో పాటు పలువురు రేషన్ కార్డు సమస్యలు, పింఛన్ సమస్యలపై అర్జీలు ఇచ్చి సమస్యలు పరిష్కరించాలని అభ్యర్థించారు. మరికొందరు ఇళ్లకోసం ఇంటి స్థలాలకోసం అర్జీ అందించారు.