– పెగాసస్ సాఫ్ట్ వేర్ ను రేవంత్ కుంటున్నారు
– మోడీ అమిత్ షా లు కూడా రేవంత్ ఫోన్ ట్యాపింగ్ లో భాగస్వాములే
– బీజేపీ సాయం తో రేవంత్ రెడ్డి రాష్ట్రం లో ఫోన్ ట్యాప్
బీజేపీ కూడా ఇక్కడ బీ ఆర్ ఎస్ ,కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తోంది
– నాకు నోటీసుల గురించి ఆంధ్రజ్యోతి పత్రిక కు ముందే ఎలా తెలుస్తున్నాయి?
– రేవంత్ ఎవరి ఫోన్లు ట్యాప్ చేస్తున్నారో హైకోర్టుకు సీల్డ్ జాబితా సమర్పించాలి
– ఫోన్ ట్యాపింగ్ విచారణను సిబిఐ కి అప్పగించాలి
– బీఆర్ఎస్ నేత డాక్టర్ ఆర్ .ఎస్.ప్రవీణ్ కుమార్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్: ఫోన్ ట్యాపింగ్ కేసులో ఉల్టా చోర్ కొత్వాల్ కో ఢాంటే అన్నట్టుగా రేవంత్ రెడ్డి వ్యవహారం ఉంది. రేవంత్ రెడ్డి బీ ఆర్ ఎస్ కీలక నేతల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. తన మంత్రివర్గ సభ్యుల ఫోన్లు కూడా రేవంత్ ట్యాప్ చేస్తున్నారు. మంత్రుల ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి సౌత్ ఫస్ట్ పత్రిక నిజాలు బయట పెట్టింది.
ఇద్దరు మంత్రులు సరదాగా చేసుకున్న సంభాషణను సీఎం రేవంత్ రెడ్డి ట్యాపింగ్ ద్వారా తెలుసుకున్నారు. ఓ మంత్రిని ఆ సంభాషణకు సంబంధించి రేవంత్ రెడ్డి పిలిపించుకుని క్లాస్ తీసుకున్నారు. రేవంత్ రెడ్డి సీఎం తో పాటు హోమ్ మంత్రి కూడా. ఫోన్ ట్యాపింగ్ అంతా ఆయన కనుసన్నల్లో జరుగుతోంది.
కేంద్రం లోని బీజేపీ కూడా ఇక్కడ బీ ఆర్ ఎస్ ,కాంగ్రెస్ నేతల ఫోన్లు ట్యాప్ చేస్తోంది. బీజేపీ సాయం తో రేవంత్ రెడ్డి రాష్ట్రం లో ఫోన్ ట్యాప్ చేస్తున్నారు. మా నేత హరీష్ రావు తో సంభాషణకు సంబంధించి ఢిల్లీ లో ఓ జర్నలిస్టును సీఎం నిలదీశారు. ఫోన్ ట్యాపింగ్ చేయకపోతే హరీష్ రావు జర్నలిస్టు సంభాషణ సీఎం కు ఎలా తెలిసింది?
పంజాగుట్ట పీ ఎస్ 243 కేసులో ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ జరుగుతుండగా రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు. నాకు ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ నెల 14 న నోటీసు వచ్చింది. ఏడవ తారీఖునే ఆంధ్రజ్యోతి పత్రిక నాకు నోటీసుల గురించి రాసింది. విచారణ వివరాలు ఆ పత్రిక కు ముందే ఎలా తెలుస్తున్నాయి?
ఆంధ్రజ్యోతి రన్నింగ్ కామెంటరీ ఏమిటి ?
మోడీ అమిత్ షా లు కూడా రేవంత్ ఫోన్ ట్యాపింగ్ లో భాగస్వాములేనన్న అనుమానం కలుగుతోంది రాహుల్ గాంధీ ఫోన్ కూడా రేవంత్ రెడ్డి ట్యాప్ చేస్తున్నారనే అనుమానం కలుగుతోంది. రేవంత్ ఎవరి ఫోన్ లు ట్యాప్ చేస్తున్నారో హైకోర్టుకు సీల్డ్ జాబితా సమర్పించాలి.
టెలిగ్రాఫ్ చట్టం ప్రకారం ఎవరి ఫోన్ ట్యాప్ చేస్తున్నారో మానిటర్ చేసేందుకు సీఎం , ప్రతిపక్ష నేత , హైకోర్టు న్యాయమూర్తి , సంబంధిత అధికారులతో కమిటీ వేయాలి. టెలిగ్రాఫ్ చట్టం ఐదో సెక్షన్ ప్రకారం దేశ భద్రతకు సంబంధించి అనివార్యమైతే ఫోన్ ట్యాప్ చేయొచ్చు. రేవంత్ బీ ఆర్ ఎస్ పై ప్రతీకారం తో రగిలిపోతున్నారు. ప్రతీకార పాలన నడుస్తోంది.
ఫోన్ ట్యాపింగ్ కేసును విచారిస్తున్న సిట్ పై బీ ఆర్ ఎస్ కు నమ్మకం లేదు.
ఫోన్ ట్యాపింగ్ విచారణను సిబిఐ కి అప్పగించాలి. ఫోన్ ట్యాపింగ్ కేసు పై హై కోర్టు సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి. రేవంత్ రెడ్డి పోలీసుల పై ఆధారపడకుండా ప్రైవేట్ స్పై ఏజెన్సీ లతో ట్యాపింగ్ చేస్తున్నట్టు అనుమానాలు ఉన్నాయి. పెగాసస్ సాఫ్ట్ వేర్ ను రేవంత్ వాడుకున్నట్టు కూడా అనుమానాలున్నాయి.
కేసీఆర్ ,కే టీ ఆర్ జైలు కు వెళ్తారని రేవంత్ రెడ్డి అంటున్నారు. రేవంత్ చేస్తున్న అక్రమాలకు ఆయనే త్వరలోనే జైలుకు వెళ్లడం ఖాయం. గవర్నర్ దృష్టికి కూడా ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని తీసుకెళతాం. ప్రెస్ మీట్ లో రాంచంద్ర నాయక్ , విజయ్ ఆర్యా పాల్గొన్నారు.