– మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ 200 కోట్ల ఉచిత ప్రయాణాలు చేసి 6680 కోట్ల రూపాయలు ప్రయాణ చార్జీలు ఆదా చేసుకున్న సందర్భంగా ఎంజీబీఎస్ లో మహాలక్ష్మి సంబరాలకు ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ హాజరయ్యారు.
ఈ సందర్భంగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడారు. మా ప్రభుత్వం వచ్చిన రెండు రోజుల్లోనే తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టిన రోజునా అసెంబ్లీ ఆవరణలో ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించాం.
ఇప్పటి వరకు 200 కోట్ల ఉచిత ప్రయాణాలు పూర్తి అయ్యాయి.. దాని విలువ 6680 కోట్ల రూపాయలు ఆదా చేసుకున్నారు. మహిళలు ఎక్కడికి వెళ్లాలన్న ఉచితంగా ప్రయాణం చేస్తున్నారని తెలిపారు.
కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయడమే లక్ష్యంగా మా ప్రభుత్వం ముందుకుపోతోంది. ఆర్టీసీలో మహిళలకు బస్సులు కొనుగోలు చేసి యజమానులను చేసింది. వారి చేత పెట్రోల్ బంకులు పెట్టించింది. ఆర్టీసీలో ఎవరు ఎక్కడికి వెళ్లాలన్న ఉచితంగా ప్రయాణం చేస్తున్నారు. గతంలో ఆర్టీసీ నిర్వీర్యం అయి ప్రైవేట్ పరం అవుతుందని అన్నారు..కానీ లాభాల్లోకి వచ్చేలా చేశామని తెలిపారు.
హ్యామ్ విధానంలో ప్రతి గ్రామం నుండి మండలానికి మండల నుండి జిల్లా కేంద్రానికి కొత్త డబుల్ రోడ్లు వచ్చే నెలలోనే ప్రారంభిస్తున్నాం. ఆర్థిక ఇబ్బందులు ఉన్న మా ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు ముందుకు తీసుకుపోతున్నామని మంత్రి వెంకట రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్, ఆర్టీసీ ఎండీ సజ్జనార్, హైదరాబాద్ కలెక్టర్ దాసరి హరిచందన, ఇతర అధికారులు పాల్గొన్నారు.