– ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాబినెట్ సమావేశంలో నిర్ణయం
అమరావతి: రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 27 వ ఇ-క్యాబినెట్ సమావేశం గురువారం జరిగింది. వివిధ అంశాలపై తీసుకున్న నిర్ణయాలను రాష్ట్ర సచివాలయం నాలుగో భవనం ప్రచార విభాగంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి మీడియాకు వివరించారు.
కూటమి ప్రభుత్వం లక్ష్యాలను ప్రతిబింబించే విధంగా ఈ క్యాబినెట్ సమావేశం జరిగింది. సంక్షేమం, అభివృద్ధి అనేవి రెండు కళ్లుగా ఈ కూటమి ప్రభుత్వం ముందుకు వెళుతోందన్నారు. నిర్థిష్టమైన ఆలోచన, విజన్ తో రాష్ట్ర భవిష్యత్తుకు పటిష్ఠమైన పునాదులు వేయాలనే లక్ష్యంతో ఈ క్యాబినెట్ సమావేశం జరిగిందని, ఈ ఒక్క క్యాబినెట్ సమావేశంలోనే దాదాపు రూ. 80 వేల కోట్లు పెట్టు బడులకు సంబంధించిన ప్రతిపాదనలకు ఆమోద ముద్ర లభించింది, తద్వారా 1.50 లక్షల మంది ఉద్యోగ అవకాశలు కలుగనున్నాయి. భవిష్యత్తులో పెట్టుబడిదారులు అందరికీ అంతిమ గమ్యస్థానం ఆంధ్రప్రదేశ్ అయ్యే విధంగా విదానాలు తీసుకురావడం, అందుకు అనుగుణంగా వచ్చిన పెట్టుబడులకు ప్రతిపాదనలకు ఆమోద ముద్రవేసినట్టు తెలిపారు.
ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ మాన్యుఫాక్చరింగ్ పాలసీ 4.0 (2025-30) ఐ.టి.ఇ, సి. శాఖ ఆమోదం కొరకు చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విశాఖపట్నం జిల్లా మధురవాడ, రుషికొండ సెజ్ జోన్లో ఐటీ పార్క్‌లో ఫీనమ్ పీపుల్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 0.45 ఎకరాలు భూమిని కేటాయించడానికి, రూ.207.5 కోట్ల పెట్టుబడితో 2500 ఉద్యోగాలు కల్పించే ప్రాజెక్ట్‌కు ప్రోత్సాహకాలు అందించడానికి రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సిపార్సు మేరకు విశాఖపట్నం జిల్లా మధురవాడ ఐటీ హిల్ నం.3 పై 3.6 ఎకరాల భూమిని ఎకరం రూ.1 కోటి చొప్పున, పరదేసీపాలెం వద్ద 50 ఎకరాలను రూ.50 లక్షల చొప్పున ఇన్ఫినిట్ స్పేసెస్ లిమిటెడ్‌కు ఏపీఐఐసీ ద్వారా కేటాయించి తద్వారా రూ.16,466 కోట్ల పెట్టుబడులను, 600 ఉద్యోగాలను కల్పించేందుకు ఐ.టి.ఇ. అండ్ సి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
విశాఖపట్నం గ్రామీణ మండలం మధురవాడ ఐటి హిల్ నెం. 4 పై 30 ఎకరాల భూమిని సబ్సిడీ రేటుతో మెస్సర్స్ సత్వ డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించడానికి, ప్రతిపాదిత పెట్టుబడికి ప్రోత్సాహకాలను అందించి తద్వారా 25,000 ఉద్యోగాల కల్పనకై ఐ.టి.ఇ. అండ్ సి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
అలాగే, మధురవాడ ఐటి హిల్ నెం. 3 పై ప్లాట్ నంబర్ 6 వద్ద 2.5 ఎకరాల భూమిని, హిల్ నంబర్ 4 పై ప్లాట్ 7.79 ఎకరాల భూమిని ఏన్ఎస్ఆర్ గ్లోబల్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించడానికి, ఏపీ AP ఐటీ అండ్ జీసీసీ పాలసీ 4.0 (2024 – 29)లో ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్ కేటగిరీ కింద ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకోవడానికి, 1,000 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడికి ప్రోత్సాహకాలను విస్తరించి తద్వారా 10,000 ఉద్యోగాల కల్పనకై ఐ.టి.ఇ. అండ్ సి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
ఎండాడ గ్రామంలో (పనోరమా హిల్స్ వెనుక) 30 ఎకరాల భూమిని ఏపీఐఐసీ ద్వారా ఎకరానికి 1.5 కోట్ల చొప్పున బీవీఎం ఎనర్జీ అండ్ రెసిడెన్సీ ప్రైవేట్ లిమిటెడ్‌కు కేటాయించడానికి, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలపర్ కేటగిరీ కింద ప్రాజెక్టును పరిగణనలోకి తీసుకుని 1250 కోట్ల ప్రతిపాదిత పెట్టుబడి ద్వారా 15,000 ఉద్యోగాల కల్పనకై ఐ.టి.ఇ. అండ్ సి శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
ఆంధ్రప్రదేశ్ అనధికృత లేఅవుట్లు, ప్లాట్లు నియంత్రణ నిబంధనలు, 2020 (ఎల్ఆర్ఎస్-2020)లోని సవరణలను చేసేందుకు పురపాలక, పట్టణాభివృద్ధి శాఖచేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషనర్‌కు అనకాపల్లి జిల్లా చెర్లోపల్లికందం గ్రామంలో 2007 సంవత్సరంలో ప్రారంభించిన ల్యాండ్ పూలింగ్ ప్రక్రియను కొనసాగించడానికి అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విశాఖపట్నం మెట్రోపాలిటన్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ మెట్రోపాలిటన్ కమిషనర్‌కు విశాఖపట్నం, విజయనగరం, అనకాపల్లి జిల్లాలలో, విశాఖపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ల్యాండ్ పూలింగ్ పథకం (ఫార్ములేషన్ అండ్ ఇంప్లిమెంటేషన్) భూ సేకరణ చేపట్టడానికి అనుమతి ఇచ్చే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఆసియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ నిధులతో ఆంధ్ర ప్రదేశ్ అర్బన్ వాటర్ సప్లై అండ్ సెప్టేజ్ మేనేజ్మెంట్ ఇంప్రూవ్మెంట్ ప్రాజెక్ట్ కింద ఇప్పటికే ఉన్న 20 ప్యాకేజీల నిర్మాణ పనులు పూర్తి చేయడానికై టెక్నికల్ కమిటీ తన చివరి నివేదికలో చేసిన సిఫార్సులను ఆమోదించడానికి, మిగిలిన పనుల కోసం టెండర్లను ఆహ్వానించడానికి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నెగోషియేటెడ్ సెటిల్మెంట్ పాలసీలోని సవరణను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఎన్టీఆర్ స్మార్ట్ టౌన్ షిప్స్ లోని ఎంఐజీ లేఅవుట్లకు సంబంధించి స్టేట్ లెవల్ కమిటీ చేసిన సిఫార్సులలో నిర్దిష్ట మార్పులను ఆమోదించేందుకు చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఏపీఎండీసీ 2025-26 రెండవ ట్రాంచ్ బాండ్ జారీ ప్రక్రియలో భాగంగా రూ.5,526.18 కోట్ల సబ్స్క్రిప్షన్ మొత్తాన్ని స్వీకరించడానికి, 9.3% కూపన్ రేట్‌తో బిడ్స్ చేయడం, సంబంధిత బాండ్ హోల్డర్లకు బాండ్లను కేటాయించడం, వివిధ లావాదేవీలకు సంబంధించిన పత్రాలను అమలు చేయడం వంటి కీలక కార్యకలాపాలను ధృవీకరించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. శ్రీజా మహిళ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి సమావేశ సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి స్టీల్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనకు సంబంధించి సమావేశ సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి గ్రీన్‌లామ్ లిమిటెడ్, ఆక్సెలెంట్ ఫార్మా సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్, అగస్త్య ఎనర్జీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, రీన్యూ ఫోటోవోల్టాయిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి సమావేశ సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలో ప్రాజెక్టుల ప్రారంభాన్ని వేగవంతం చేయడానికి లారస్ లాబ్స్ లిమిటెడ్, ఏస్ ఇంటర్నేషనల్ పెట్టుబడి ప్రతిపాదనలకు సంబంధించి సమావేశ సిఫార్సులను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లావంగార మండలం, అరసాడ గ్రామంలో పీవీఎస్ గ్రూప్ ద్వారా 20టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకై చేసిన అభ్యర్థనకు సంబంధించి ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనలకు ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
పీఎస్డీఎఫ్ కింద బీఈఎస్ఎస్ ప్రాజెక్ట్ అమలుకు అవసరమైన కార్యకలాపాలను చేపట్టడానికి ఏపీ ట్రాన్స్‌కో చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్, విజయవాడకు రాష్ట్ర యుటిలిటీల వినియోగానికి అధికారం ఇచ్చేందుకు ఇంధన శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదాలచే ప్రభావితమైన కురుకుట్టి పీఎస్పీ, కర్రివలస పీఎస్పీ కేటాయింపును రద్దు చేయడానికి గుజరాత్‌కు చెందిన అదానీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. నంద్యాల్ జిల్లాలోని అవుకులో ఆర్వీఆర్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా 800 ఎండబ్ల్యూ పంప్డ్ స్టోరేజ్ పవర్ ప్రాజెక్ట్ ను ఆ సంస్థకు కేటాయించేందుకై చేసిన అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
శ్రీకాకుళం జిల్లా సంతవురిటీ గ్రామం, జి.సిగడం మండలంలో పీవీఎస్ రామ్మోహన్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ 2ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకై చేసిన అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కర్నూల్, నంద్యాల్ జిల్లాలలోని డోన్ పశ్చిమ ప్రాంతంలో విండ్ పవర్ కెపాసిటీలను కేటాయించడం కోసం సవరించిన ప్రభుత్వ ఆదేశాలను సవరించి అనుమతినివ్వాలని రీన్యూ వ్యోమన్ పవర్ ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కర్నూల్, నంద్యాల్ జిల్లాలలోని డోన్ పశ్చిమ ప్రాంతంలో విండ్ పవర్ ప్రాజెక్ట్ కేటాయింపుకు రీన్యూ విక్రమ్ శక్తి ప్రైవేట్ లిమిటెడ్ అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
కర్నూల్ జిల్లా గుండు తండ వద్ద గతంలో అనుమతించబడిన శ్రీజా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్కుకేటాయించిన విండ్ పవర్ కెపాసిటీని ప్రాజెక్టు అమలులో ఆలస్యం కారణంగా అనుమతి రద్దు చేయడానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. ఆంధ్రప్రదేశ్ సెంట్రల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కార్పొరేషన్ లిమిటెడ్ ఏపీపీడీసీఎల్లో కొత్త షేర్‌హోల్డర్‌గా చేసి, 2044-2045 వరకు అప్పుల కాలపరిమితిలో రూ.1724 కోట్ల మొత్తానికి ఏపీపీడీసీఎల్ తరపున పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్ కు రివాల్వింగ్ ప్రభుత్వ గ్యారెంటీని అందించడానికి ఏపీపీడీసీఎల్ మేనేజ్మెంట్లో మార్పులు/పునర్నిర్మాణానికి చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
అనంతపురం జిల్లాలో ఆరో ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కు కేటాయించిన సింగనమల పీఎస్పీ కెపాసిటీ ప్రాజెక్ట్ రద్దుకై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వైఎస్ ఆర్ కడప కాదప జిల్లా జమ్మలమాడుగు మండలంలోని శ్రీ సత్య సాయి జిల్లా ముదిగుబ్బ మండలం బదులుగా సున్నపురల్లపల్లె, ఇతర గ్రామాలలో సోలార్ పవర్ ప్రాజెక్ట్ ఏర్పాటుకు జెఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
ప్రభుత్వంచే మంజూరు చేయబడిన సోలార్ పవర్ ప్రాజెక్ట్ లో నుండి సోలార్ పవర్ ప్రాజెక్ట్ఏర్పాటును వైఎస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు మండలంలోని శ్రీ సత్య సాయి జిల్లా ముదిగుబ్బ మండలం బదులుగా సున్నపురాళ్ళపల్లె, ఇతర గ్రామాలలో ఏర్పాటు చేసేందుకై జెఎస్డబ్ల్యూ నియో ఎనర్జీ లిమిటెడ్ అభ్యర్థనను ఆమోదించే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. అమరావతిలో గ్రీన్ హైడ్రోజెన్ వ్యాలీ డిక్లరేషన్ కై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
విశాఖపట్నం జిల్లా గొలుగొండ మండలంలో మాక్స్ ఇన్ఫ్రా లిమిటెడ్‌కు అప్పగించిన “తాండవ రిజర్వాయర్ ప్రాజెక్ట్‌లో కాలువ వ్యవస్థ మెరుగుదల, ఆధునీకరణ” పనుల కాంట్రాక్ట్ ముందస్తు ముగింపుకై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో 2023-24 సంవత్సరంలో రూ.291.00 లక్షలకు “గండికోట లిఫ్ట్ ఇర్రిగేషన్ స్కీమ్ స్టేజ్-I మరియు స్టేజ్-II పంప్ హౌసెస్” పని కోసం పరిపాలనా ఆమోదం, ఎస్ఎస్ ఆర్ 2022-23తో రూ.291.00 లక్షలకు నామినేషన్ ఆధారంగా మేఘా ఇంజనీరింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్, హైదరాబాద్‌కు పని అప్పగించేందుకై చేసిన ధృవీకరణ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
నంద్యాల్ జిల్లా, పాణ్యం మండలం, గోరకల్లు గ్రామంలోని గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్కింద “శ్రీ నరసింహరాయ సాగర్ ప్రాజెక్ట్ (గోరకల్లు బ్యాలెన్సింగ్ రిజర్వాయర్) రక్షణ పనులు” ఫేజ్-I కోసం రూ.53.00 కోట్లకు పరిపాలనా ఆమోదానికై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. హెచ్డీబీఆర్జీ పొగాకు సేకరణ, రైతు షెడ్యూలింగ్, పరిమాణ పరిమితులు, కేంద్ర విస్తరణ, లాజిస్టిక్స్ కు సంబంధించిన సవరించిన కార్యాచరణ మార్గదర్శకాలను ఆమోదించే ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
బానగనపల్లెలో మార్కెట్ యార్డుకు దక్షిణంగా కోయిలకుంట్ల రోడ్డుకు వద్ద ఉన్న బీసీ బాలికల రెసిడెన్షియల్ స్కూల్ కమ్ హాస్టల్ నిర్మాణం కొరకు యాజమాన్య హక్కులను బదిలీ చేయకుండా, అద్దె ఆధారం లేకుండా భూమి కేటాయింపుకువ్యవసాయ, సహకార శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
అనకాపల్లి మండలం అనకాపల్లి జిల్లాలోని కేంద్రీయ విద్యాలయ సంఘటన్ , సికందరాబాద్ వారికి పర్మనెంట్ స్కూల్ భవనం, స్టాఫ్ క్వార్టర్లు, ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం కోసం రూ.1,75,00,000/- చెల్లింపుపై ప్రభుత్వ భూమి అప్పగింపుకై రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
మైదుకూర్ బదులుగా ఎన్.మైదుకూర్ అని గ్రామ పేరును సవరించి పేర్కొనడంలో జరిగిన లోపానికి ఎర్రాటా జారీ చేయడానికి, నేషనల్ అగ్రికల్చరల్ కోఆపరేటివ్ మార్కెటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనుకూలంగా రూ.21,08,000 భూమి విలువ చెల్లింపుపై జనరల్ వేర్‌హౌస్ నిర్మాణం కోసం మైదుకూర్ మండలంలోని మైదుకూర్ గ్రామంలో మొత్తం కొలతలో ప్రభుత్వ భూమి అప్పగింపు ఆమోదానికై చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
2024-25 నాటికి వాటర్ ట్యాక్స్ బకాయిలపై రూ.85.81 కోట్ల అసాధారణ వడ్డీ మొత్తాన్ని రైతుల నుండి వాటర్ ట్యాక్స్ బకాయిలను వసూలు చేసేటప్పుడు ఒక్కసారిగా మాఫీ చేసే ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. తిరుపతిలోని బైరాగిపట్టేడలోగల పద్మావతి పార్క్ వద్ద జరిగిన తొక్కిసలాట సంఘటనపై విచారణ కొరకు నియమించబడిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ ఎం. సత్యనారాయణ మూర్తి నేతృత్వంలో ఏర్పడ్డ ఏకసభ్య కమీషన్ సమర్పించిన విచారణ నివేదకకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
న్యాయూర్తులకు, ఇతర ప్రముఖులు సెలవు సమయంలో ప్రోటోకాల్ బాధ్యతల నిర్వహణలో భాగంగా ఇప్పటివరకు అవుట్ సోర్స్సింగ్ విధానంలో ఉన్న 7 డ్రైవర్(1 సీనియర్ డ్రైవర్ + 6 డ్రైవర్లు) పోస్టులను శాశ్వత ప్రాతిపదికన నియమించేందుకు న్యాయ శాఖ చేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
విశాఖపట్నంలో 5 నక్షత్రాల లగ్జరీ హోటల్ అభివృద్ధి కోసం కోల్‌కతాలోని ఐటీసీ హోటల్స్ లిమిటెడ్‌కు ప్రోత్సాహకాలను అందించడానికి జరిగిన సమావేశంలో రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలను ఆమోదించడానికి యువజనాభివృద్ది, పర్యాటక, సాంస్కృతిక శాఖ చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
విశాఖపట్నంలోని ఏఎంటీజెడ్ వద్ద 5-స్టార్ హోటల్ అభివృద్ధి కోసం హైదరాబాద్‌లోని లాన్సమ్ లీజర్స్ , ఎంటర్టైన్మెంట్ ఎల్ఎల్పీ వారికి ప్రోత్సాహకాలను అందించడానికి జరిగిన సమావేశంలో రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి తీసుకున్న నిర్ణయాలను ఆమోదించడానికి యువజనాభివృద్ది, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
తిరుపతిలో 5 నక్షత్రాల హోటల్ అభివృద్ధి కోసం బెంగళూరులోని మెస్సర్స్ స్టార్టర్న్ హోటల్స్ ఎల్ఎల్పీ వారికి ప్రోత్సాహకాలను అందించడానికి జరిగిన రాష్ట్ర పెట్టుబడి ప్రోత్సాహక మండలి సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఆమోదించడానికి యువజనాభివృద్ది, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. 2025-26 విద్యా సంవత్సరం నుండి “తల్లికి వందనం” పథకాన్ని అమలు చేయడానికిపాఠశాల విద్యా శాఖ జారీ చేసిన మార్గదర్శకాలకు అలాగే పరిపాలనా అనుమతులకు సంబంధించి చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
ఇప్పటివరకు వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి ఎపి నూర్ బాషా/దూదేకుల సంక్షేమం, అభివృద్ధి సంస్థ స్థానంలో కొత్తగా “ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూర్ బాషా/దూదేకుల ఆర్థిక సంస్థ”ను నెలకొల్పుతూ వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖచేసిన ప్రతిపాదనకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెల్పింది. విశాఖపట్నం నగరంలోరూ.11,498 కోట్ల అంచనా వ్యయంతో 50-50 జాయింట్ వెంచర్ ప్రాతిపదికన చేపట్టనున్న మెట్రో రైలు ప్రాజెక్ట్ మొదటి దశ పనులకు సంబంధించి 40% వ్యయానికి సంబంధించిన పనులకు టెండర్లను ఆహ్వానించడానికి చేసిన ప్రతిపాదనలకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
విజయవాడ మెట్రో రైలు ప్రాజెక్ట్ ఫేస్-I క్రింద రెండు కారిడార్లతో అనుమతి మంజూరు ప్రతిపాదన, రూ.10,118 కోట్ల అంచనా వ్యయంతో, 50:50 ప్రభుత్వ జాయింట్ వెంచర్ ఈక్విటీ ఫండింగ్ మోడల్ ప్రకారం, ప్రాజెక్టు ఖర్చులో 40% వరకు టెండరింగ్ ప్రక్రియను ప్రారంభించేందుకు సూత్రప్రాయ అంగీకారం, అనుమతికి లోబడి జారీ చేయడంపై పురపాలక, పట్టణాభివృద్ది శాఖ చేసిన ప్రతిపాదనకు మంత్రి మండలి ఆమోదం తెల్పింది.
శ్రీ సత్య సాయి జిల్లా మడకసిర మండలం ఆర్. అనంతపురం గ్రామంలోని ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేయడానికి ఏపీఐఐసీ సంస్థకు ఎకరా 439.27సెంట్ల భూమిని ఉచితంగా కేటాయిస్తూ రెవెన్యూ శాఖ చేసిన ప్రతిపాదనలకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది.
రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలో వన్యప్రాణులు, సాహసం, వారసత్వం, పర్యావరణ, టెంపుల్ టూరిజం సర్క్యూట్లను స్థాపించడం, ఉపాధి కల్పనకు ప్రోత్సాహకాలు ఇవ్వబడతాయి.