– మీనాక్షి నటరాజన్ ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారు
– రేవంత్ రెడ్డి అర్ధరాత్రి మై హోం భూజాకు ఎందుకు వెళ్లారు?
– ప్రైవేట్ హ్యాకర్లతో ఫోన్ ట్యాపింగ్ చేయిస్తున్నారు
– మంత్రులు, సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనా రేవంత్ ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నారు
– రాహుల్, సోనియాకు మంత్రులు ఫిర్యాదు చేశారు
– ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్లో ట్యాపింగ్ పంచాయతీ నడుస్తోంది
– అందుకే క్యాబినెట్ మీటింగ్ రద్దు చేశారు
– రేవంత్ రెడ్డి చరిత్ర అంతా నాకు తెలుసు
– బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ కల్వకుంట్ల సంజయ్ సంచలన ఆరోపణలు
హైదరాబాద్: రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్ అధికారులు చేస్తారని చిట్ ఛాట్ లో చెప్పారు. మేము ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామని స్వయంగా సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావుపై రేవంత్ రెడ్డి బురదచల్లారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై కేంద్రం సీబీఐ,ఈడీ విచారణ జరపాలి.
కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావు,బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ మంత్రులు,ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, బీజేపీ నేతల ఫోన్లను ట్యాప్ చేస్తున్నామని రేవంత్ రెడ్డి చెప్పారు. రాష్ట్రంలో ఉన్న 118 ఎమ్మెల్యేలు,17మంది ఎంపీలు,ఎమ్మెల్యేల ఫోన్లు ట్యాప్ చేస్తున్నారు. ప్రయివేటు ఫోన్ హ్యాకర్లను పెట్టుకుని హీరోయిన్ల ఫోన్లను రేవంత్ రెడ్డి ట్యాప్ చేయిస్తున్నారు. హీరోయిన్లను రేవంత్ రెడ్డి బ్లాక్ మెయిల్ చేస్తున్నారు.
మిస్ వరల్డ్ పోటీలకు వచ్చినవారి ఫోన్లను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్యాప్ చేసింది. రేవంత్ రెడ్డి అర్ధరాత్రి మై హోం భూజాకు ఎందుకు వెళ్లారు? రేవంత్ రెడ్డి చరిత్ర అంతా నాకు తెలుసు. రేవంత్ రెడ్డి మంచిగా రాజకీయం చేస్తే మేము మంచిగా మాట్లాడుతాము.
నేను నా ఫోన్ ట్యాపింగ్అవుతుందని డిసెంబర్ 5వ తేదీన ఫిర్యాదు చేస్తే ఎందుకు కేసు నమోదు చేయలేదు? నా సతీమణి ఫోన్ ను రేవంత్ రెడ్డి ప్రభుత్వం ట్యాప్ చేస్తోంది. రేవంత్ రెడ్డి భార్య,భర్తలు మాట్లాడుకునే ఫోన్లు సైతం వింటున్నారు. ఇద్దరు మంత్రులు మాట్లాడుకునే మాటలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా రేవంత్ రెడ్డి విన్నారు. వేరే మంత్రి ద్వారా ఫోన్ మాట్లాడిన మంత్రిని పిలిపించుకుని రేవంత్ మాట్లాడారు. ఫోన్ ట్యాపింగ్ పై మేము ఇచ్చిన పిటీషన్ పై ఎందుకు కేసు నమోదు చేయడం లేదు?
ఆరు గ్యారెంటీలు అమలుచేసే వరకు మేము రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తాము. కేసీఆర్,కేటీఆర్,హరీష్ ఎప్పుడూ ఫోన్ ట్యాపింగ్ చేయలేదు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ఢిల్లీలో చిట్ ఛాట్ లో మాట్లాడుతూ ఫోన్ ట్యాపింగ్ కామన్ అని చెప్పారు. నేడు జరగాల్సిన క్యాబినెట్ మీటింగ్ రద్దు అయింది. ఫోన్ ట్యాపింగ్ అవుతుందని మంత్రులు ఢిల్లీలో కూర్చుంటే క్యాబినెట్ మీటింగ్ రద్దు చేసుకున్నారు.
ఢిల్లీలో తెలంగాణ కాంగ్రెస్ పంచాయతీ నడుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ పై తాడోపేడో తేల్చుకుంటామని మంత్రులు ఢిల్లీలో ఉన్నారు. రేవంత్ రెడ్డిపై మంత్రులు రాహుల్ గాంధీ,సోనియాగాంధీకి ఫిర్యాదు చేశారు. రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం అనే మాటలు బంద్ చేసుకోవాలి. క్యాబినెట్ మీటింగ్ ఎందుకు రద్దు అయిందో రేవంత్ రెడ్డి చెప్పాలి.
రేవంత్ రెడ్డి ఫోన్ ట్యాపింగ్,లీకులు ఇస్తూ కాలం గడుపుతున్నారు. రేవంత్ రెడ్డికి అబద్దాలు,మోసం వెన్నతో పెట్టిన విద్య. రేవంత్ రెడ్డికి దొంగతనం చేయడంవచ్చు. దొరకడం వచ్చు. రేవంత్ రెడ్డి స్వంత మంత్రి ఆయనపై తిరగబడ్డారు. బిఆర్ఎస్ హయాంలో నా ఫోన్ ట్యాప్ కాలేదు. అందుకే నన్ను సిట్ పిలవలేదని రేవంత్ రెడ్డి అన్నారు.
రేవంత్ రెడ్డికి మానసిక వ్యాధి ఉంది. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ ఫోన్ ను ట్యాప్ చేస్తున్నారు. ఫార్ములా ఈ రేస్ లో ఎలాంటి తప్పు లేదు. విధానపరంగా కొన్ని లోపాలు ఉన్నాయని కాంగ్రెస్ మంత్రులు చెప్పారు. రేవంత్ రెడ్డి అబద్దాలు నిజంగా మారుతున్నాయి. రేవంత్ రెడ్డి అబద్ధాలకు నిన్న ఆయన చూపిన సోనియా లేఖనే సాక్ష్యం. లేఖలో ఏమీ లేకున్నా తనకు ఆస్కార్ , నోబెల్ ప్రైజు లాంటిదని చెప్పుకొచ్చారు.
తెలంగాణ ఆత్మగౌరవాన్ని రేవంత్ రెడ్డి తాకట్టు పెడుతున్నారు. రేవంత్ రెడ్డి తన వంకరబుద్ది మార్చుకోవాలి.