– ‘లిక్కర్ లిల్లీ’ ఊహించని వేగంతో సోదాలు!
(చాకిరేవు)
ఈ పరిణామం ‘లిక్కర్ లిల్లీ’ ఏ మాత్రం ఊహించనిది! కోర్టు సమయం దాటిపోయిన తర్వాత, అకస్మాత్తుగా రంగంలోకి దిగిన సిట్, నిందితుల గుండెల్లో రైళ్లు పరుగెత్తిస్తోంది. ముందే తెలిసుంటే న్యాయస్థానాన్ని ఆశ్రయించి అడ్డుకునే ప్రయత్నం చేసేవారేమో.. కానీ, ఇప్పుడు చేసేదేమీ లేదు!
ఏపీ లిక్కర్ కేసుపై దర్యాప్తు క్లైమాక్స్ దిశగా శరవేగంగా దూసుకుపోతోంది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) విచారణలో వేగం పెంచి, కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కీలక నిందితుల ఇళ్లు, కార్యాలయాలపై మెరుపుదాడులు నిర్వహిస్తోంది.
భారతీ సిమెంట్స్‌కు చేరిన దర్యాప్తు సెగ!
తాజా పరిణామాల్లో, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ గోవిందప్పకు సంబంధించిన ప్రాంతాలపై సిట్ దృష్టి సారించింది. రాజ్ కేసిరెడ్డి, గోవిందప్ప కార్యాలయాల్లో సిట్ బృందాలు విస్తృతంగా సోదాలు నిర్వహిస్తున్నాయి. అంతేకాదు, చాణక్యకు చెందిన టీ-గ్రీన్ రెస్టారెంట్లోనూ సిట్ తనిఖీలు మొదలెట్టింది.
గోవిందప్ప భారతీ సిమెంట్స్‌లో కీలక డైరెక్టర్ స్థానంలో ఉండటం వల్ల, ఆ సంస్థతో ముడిపడి ఉన్న పలు అంశాలపై సిట్ అధికారులు సోదాలు చేస్తోంది. ఇప్పటికే అరెస్టై రిమాండ్‌లో ఉన్న గోవిందప్పతో సహా, ఇతర నిందితులకు సంబంధించిన ప్రమేయంపై మరింత లోతైన దర్యాప్తు జరుగుతోంది.
ఎవరెవరు ఎక్కడెక్కడ, ఎన్నిసార్లు భేటీ అయ్యారు? లిక్కర్ కుంభకోణానికి సంబంధించిన వ్యవహారాల్లో ఎవరి పాత్ర ఎంత? అనే దానిపై సిట్ అధికారులు పూర్తి సాంకేతిక ఆధారాలతో కూలంకషంగా ఆరా తీస్తున్నారు. భారతీ సిమెంట్స్, రిసోర్స్ వన్, ట్రీ-గ్రిల్ వంటి సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులపై దృష్టి సారించి, కీలక డాక్యుమెంట్లు, డిజిటల్ డేటాను స్వాధీనం చేసుకుంటున్నారు.
ఈ మెరుపు దాడులు, దర్యాప్తు వేగం చూస్తుంటే.. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో మరిన్ని సంచలన అరెస్టులు, ఊహించని పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉందని స్పష్టమవుతోంది. ఇప్పుడు నిందితుల వంతు, విచారణకు సహకరించడం, లేదా న్యాయపరంగా పోరాటం చేయడం మాత్రమే.
కానీ, సిట్ వేగం ముందు వారికి సమయం కూడా దక్కడం లేదన్నది తాజా పరిణామాల బట్టి తెలుస్తోంది! ఈ వీకెండ్‌ను లిక్కర్ లిల్లీ కపుల్ ఎలా ఎంజాయ్ చేస్తారో బెంగుళూరు ప్యాలస్‌లో.