– రూ.3,138 కోట్ల బీమా క్లెయిమ్‌లు పెండింగ్‌గా ఉండటానికి కారణం రాష్ట్రం ప్రీమియం కట్టకపోవడమే
– కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే ఉచిత బీమా పథకం మళ్లీ మొదలుపెట్టడమే కాక, అన్నదాత సుఖీభవ పథకం కింద ఆగస్టు 2వ తేదిన రైతుల ఖాతాల్లో రూ.3,156 కోట్లు జమచేయనుంది
– పులివెందుల రిజర్వాయర్ నీటిని రైతులకు కాకుండా తన బంధువుల కంపెనీలకు మళ్లించాడు
– వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు
విజయవాడ: తానేదో రైతు ఉద్దారకుడిని అని చెప్పుకునే జగన్ రెడ్డి గత ఐదేళ్ల పాలనలో రైతులకు చెల్లించాల్సిన బీమాను మూడేళ్లపాటు నయా పైసా చెల్లించకుండా ఎగగొట్టాడు..ఈ విషయం పార్లమెంటు సాక్షిగా వెల్లడైంది. . ఏపీలో జగన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు మూడేళ్లపాటు రైతులకు కేంద్రం ఇచ్చే ఫసల్ బీమా యోజన సొమ్ము ఇవ్వకపోవడంతో రైతులు ఇబ్బందుల పాలైనారు.
రాష్ట్ర వాటా ఇచ్చినా ఇవ్వకపోయినా కేంద్ర ప్రభుత్వం తన వాటాను జమ చేస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు ఇవ్వడంలో ఆలస్యం చేస్తే, దానిపై 12 శాతం వడ్డీ వసూలు చేసి రైతుల ఖాతాలో జమ చేయాల్సి ఉంది.. కాని ఒక్క పైసా కూడా జగన్ రెడ్డి ప్రభుత్వం జమ చేయలేదు.
అసలు ఈ విషయాలన్నీ తుంగలో తొక్కి.. రైతులపై వల్లమాలిన ప్రేమ ఉన్నట్లు ముసలి కన్నీరు కారుస్తూ.. అబద్దాలు ప్రచారం చేస్తూ… రాష్ట్రంలో అలజడులు సృష్టిస్తూ.. శాంతిభ్రదలకు విఘూతం కల్పిస్తూ.. ఇంకా ప్రజలను, రైతులను మభ్య పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. జగన్ రెడ్డి 2019 ఖరీఫ్‌లో.. పంటల బీమా కింద రైతులతో ఒక్క రూపాయి ప్రీమియం కట్టించింది.
అయితే ఆ ఏడాది రబీ సీజన్లో ఈ పథకాన్ని జగన్ సర్కార్ గాలికొదిలేసింది. అలాగే 2020, 2021లో రెండు సీజన్లలోనూ అసలు బీమా యోజన పథకాన్నే పూర్తిగా వదిలేశారు. మళ్లీ 2022-2023 రబీ, 2023 ఖరీఫ్, 2023-24 రబీలో ఉచిత పంటల బీమా ఊసే ఎత్తలేదు. దీంతో మూడు పంటల బీమా సొమ్ము రైతులకు ఇవ్వకుండా రైతుల జీవితాలతో చెలగాటమాడాడు.
గతంలో ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టకుండానే కట్టినట్లుగా జగన్ రెడ్డి అసెంబ్లీలో అబద్ధమాడారు. అప్పడు నారా చంద్రబాబు నాయుడు గారు పోడియం వద్ద నేలపై కూర్చొని నిరసన తెలపడంతో అదే రోజు రాత్రి రూ.590 కోట్లు ప్రీమియం కోసం జీవో విడుదల చేశారు. తూతూ మంత్రంగా చేశాడు.
తన నియోజకవర్గంలో పులివెందులలో నిర్మించిన సర్వారాయ రిజర్వాయర్ నుంచి కనీసం ఒక్క రైతు పొలానికి కూడా నీరు అందించకుండా రైతును నిలువుగా ముంచి, తనకు సొంత ప్రయోజనాలకు.. భారతీ సిమెంట్‌కు, అంతేకాక జగన్ రెడ్డి మేనమామ చీనీ తోటలకు నీరు అందించి తన పబ్బం గడుపుకున్నారు. జగన్ రైతులకు చేసిన ద్రోహాన్ని, సాక్షాత్తూ కేంద్ర వ్యవసాయ మంత్రే పార్లమెంటు సాక్షిగా చెప్పారంటే ఏవిధంగా రాష్ట్రాన్ని, రైతులను దోచుకున్నాడో ప్రజలకు అర్థమవుతుంది.
ఏపీలో ప్రధానమంత్రి ఫసల్‌బీమా యోజన, ఆర్‌డబ్ల్యూబీసీఐఎస్ కింద 2020-21 నుంచి 2024-25 మధ్యకాలంలో రూ.3,138.80 కోట్ల క్లెయిమ్‌లు రాగా అందులో చెల్లించలేదు. ఇంకా రూ.2,592.07 కోట్ల విలువైన క్లెయిమ్‌లు పెండింగ్‌లో ఉన్నాయి. సబ్సిడీ, రైతుల ప్రీమియంలో జగన్ రెడ్డి ప్రభుత్వం తన వాటా చెల్లించకపోవడమే ఇందుకు కారణం.
జగన్ రెడ్డి పాలనలో వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేస్తూ, గంజాయి సాగుకు రాజకీయ ప్రోత్సాహం లభించింది.
పంటల బీమా, మద్దతు ధర, నీటి సమస్యలపై రైతులు కొట్టుమిట్టాడుతున్న సమయంలో గంజాయి సాకు మాత్రం అజేయంగా సాగింది. • గ్రామీణ ప్రాంతాల్లో గంజాయి సాగు పెరిగినా, ప్రభుత్వం చర్చించలేదు, వ్యవసాయాన్ని పట్టించుకోలేదు. ఇది రైతుల కోసం ఏర్పడిన ప్రభుత్వం కాదు, గంజాయి గ్యాంగులకు అండగా నిలిచిన పాలన అని ప్రజలు ఎప్పుడో తేల్చేశారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2024 ఖరీ్‌ఫలో.. గత టీడీపీలో అమలులో ఉన్న ఉచిత బీమానే వర్తింపజేస్తాం. పంటల బీమాపై కమిటీ వేసి 2024-25 రబీ సీజన్‌కు రైతులు తమ వాటా ప్రీమియం చెల్లిస్తే.. బీమా అమలు చేస్తాం.
సూపర్ సిక్స్ లో భాగమైన అన్నదాత సుఖీభవ పథకాన్ని ఆగస్టు 2వ తేదిన తొలివిడతగా కూటమి ప్రభుత్వం రూ.2,325 కోట్లు, పీఎం కిసాన్ కింద కేంద్రం ఇచ్చే రూ.831.60 కోట్లు.. మొత్తం కలిపి రూ.3,156 కోట్లు లను రాష్ట్ర వ్యాప్తంగా 46.50 లక్షల మంది రైతుల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది.