– పోలీస్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు జగన్‌పై కేసుపెట్టాలి
– ప్రజల సానుభూతి కోసం నానా పాట్లు పడుతున్నారు.
– నెల్లూరులో జగన్ అనుచిత వ్యాఖ్యలపై వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆగ్రహం
అమరావతి: పోలీస్ వ్యతిరేక వ్యాఖ్యలు చేసినందుకు జగన్‌పై కేసుపెట్టాలి. అధికారం కోసం ఆరాటపడే జగన్ రెడ్డి ప్రణాళికా బద్ధంగా అనుచిత వ్యాఖ్యలకు దిగజారుతున్నారు: మద్యం కుంభకోణంలో వేలాది కోట్ల రూపాయల మేర ప్రభుత్వ ఖజానాకు నష్టం కలిగించిన పాత్రధారులందరూ తెరపైకొచ్చారు.
అసలు సూత్రధారి ఎవరో వెల్లడయ్యే తరుణంలో జగన్ రెడ్డి అనుచిత వ్యాఖ్యల్ని అర్ధం చేసుకోవాలి. సిట్ విచారణలో ఇటీవల ఒక డెన్ లో రూ.11 కోట్ల భారీ నిధులు దొరకడంతో జగన్‌రెడ్డిలో వణుకు మొదలయ్యింది. మహిళా ఎమ్మెల్యేపై అనుచిత వ్యాఖ్యలు చేసిన మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డికి మద్దతుగా జగన్ మాట్లాడొచ్చా?
6 సార్లు ఎమ్మెల్యేగా చేసిన ప్రసన్నకుమార్ రెడ్డిపై కేసులు పెట్టడం తప్పా?చంద్రబాబును హడావుడిగా అరెస్టు చేసి జైలుకు పంపినప్పుడు ఆయన 9 సార్లు ఎమ్మెల్యేగా, 14 ఏళ్లు సిఎంగా చేసిన విషయం గుర్తుకురాలేదా? సొంత పార్టీకి చెందిన రఘురామ కృష్ణంరాజును పోలీసులు కుళ్లబొడిచినపుడు ఆయన లోక్ సభ సభ్యులన్న సంగతి జగన్ మరిచారా?
అప్పటి ప్రతిపక్ష నాయకులు అచ్చన్నాయుడు, కొల్లు రవీంద్రలను అక్రమ కేసులతో వేధించినపుడు వారి గతాలు స్ఫురణకు రాలేదా? పవన్ కళ్యాణ్ పర్యటనలను అక్రమంగా అడ్డుకొని జగన్‌రెడ్డి సిఎంగా ప్రజాస్వామ్యాన్ని పాతరేయలేదా? కాకాణి గోవర్ధన్‌రెడ్డి, కొడాలి నాని, వల్లభనేని వంశీలను జగన్‌రెడ్డి పరమ పవిత్రులుగా వర్ణించడం ఎంతవరకు సబబు?
దిగజారుడు వ్యాఖ్యలతో జగన్‌రెడ్డి తన రాజకీయ ప్రమాణాలను , ప్రజాస్వామ్య వ్యతిరేక ధోరణులను, ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టే విధానాలను మరోసారి వెల్లడించుకున్నారు. రాజకీయాల్లో ఇటువంటి వ్యక్తి మనుగడతో వాటిల్లే తీవ్ర నష్టాన్ని ప్రజలు నిత్యం గమనించాలి. జగన్‌రెడ్డి ప్రణాళికాబద్ధమైన వ్యాఖ్యలు ఆయన అంతరంగాన్ని వెల్లడిస్తున్నాయి.
మద్యం కుంభకోణంలో వాస్తవాలు వెల్లడయ్యే కొద్దీ జగన్‌లో నెలకొన్న భయం బయటపడుతోంది. ఈ భయంతోనే ఆయన ప్రజల సానుభూతి కోసం నానా పాట్లు పడుతున్నారు. రాజ్యాంగ విలువలు, చట్టబద్ధ పాలనపై కూటమి ప్రభుత్వానికి అపారమైన విశ్వాసముంది. ప్రభుత్వాన్ని , ప్రజల్ని రెచ్చగొట్టే ధోరణిలో జగన్‌రెడ్డి మాట్లాడడం మానుకోవాలి.