– స్త్రీలను అవమానించిన వైకాపా..
ప్రోత్సహించడానికి వచ్చిన జగన్ పర్యటనను వెలేసిన నెల్లూరు ప్రజలకు అభినందనలు! నెల్లూరులో ఎవరిని అడిగినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మంచితనం, గొప్పతనం గురించి కళ్ళల్లో నీళ్లతో చెబుతారు. అలాంటి వ్యక్తి సతీమణి, ఒక ప్రజాప్రతినిధి, ప్రశాంతి రెడ్డి . జగన్ చెల్లి షర్మిళలా ఆమె కూడా రెండో వివాహం చేసుకొంది ప్రభాకర్ రెడ్డిని. తన అత్తింటి వారి అనుమతితో!
అలాంటి ఆమె జీవితాన్ని, ఆమె వ్యక్తిత్వాన్ని తనింటి ఆడపడుచు అని కూడా చూడకుండా, ప్రసన్న కుమార్ రెడ్డి అత్యంత అసభ్యకరంగా మాట్లాడాడు. “కన్యలను తెచ్చి పెళ్లిల్లు చేసే బ్రోకర్ అయ్యేవాడిని ప్రభాకర్ రెడ్డి గారు అడిగి ఉంటే సలహా ఇచ్చేవాడిని” అని మాట్లాడటానికి ఆయనకు మనసెలా వచ్చింది? ఒక నియోజకవర్గ సమస్యల మీద మాట్లాడండి! ఒక ప్రజాప్రతినిధిగా ఏదైనా అవినీతి చేశారనిపిస్తే మాట్లాడండి! అంతేగానీ, ఒక మహిళ వ్యక్తిత్వాన్ని హననం చేసే హక్కు మీకు ఎవరిచ్చారు?
అలాంటి నీచమైన మాటలు మాట్లాడిన వ్యక్తి ఇంటి వద్దకు, హెలికాప్టర్లో వచ్చి జగన్ పలకరించడానికి వస్తే… నెల్లూరు ప్రజల గుండెలు మండిపోయాయి. అసహ్యించుకుంటూ జగన్ కార్యక్రమానికి దూరంగా ఉన్నారు. రాయలసీమలో బడా బడా ఫ్యాక్షనిస్టులు కూడా సాటి రెడ్డి స్త్రీని అవమానించరు. కానీ ఇక్కడ?
జగన్ రెడ్డి తన సొంత సోదరి షర్మిళ చీర రంగును ప్రస్తావించి మరీ అవమానించాడు. సొంత పార్టీ నాయకులతో తిట్టించాడు. ఆఖరికి, కన్న తల్లి విజయలక్ష్మిని కూడా వ్యక్తిత్వ హననానికి గురిచేస్తూ సోషల్ మీడియా ద్వారా దాడి చేయించారు. ఇది ఒక నాయకుడికి ఎంత దౌర్భాగ్యమైన స్థితి?
మరోవైపు, చిన్నప్పటి నుండి తనను ఎత్తుకొని పెంచిన బాబాయి కూతురు, చెల్లి సునీతమ్మ. బాబాయిని దారుణంగా హత్య చేస్తే, “అన్నా, నాకు న్యాయం కావాలి, విచారణ జరిపించు” అని ఆమె అడిగితే… ఆమె వ్యక్తిత్వాన్ని హననం చేస్తూ, ఆమెను హంతకిగా చిత్రీకరిస్తూ కథనాలు ప్రచారం చేశారు. సొంత కుటుంబంలోని మహిళలకే ఈ దుస్థితి తెచ్చిన జగన్, బయటి మహిళలను ఎలా గౌరవిస్తారు?
ఇతర పార్టీలలో, చంద్రబాబు నుండి పవన్ కళ్యాణ్ వరకు, ఎవరి భార్యలనూ వదలకుండా వ్యక్తిగతంగా దాడులు చేశారు. స్త్రీలను ఇంతగా అవమానించిన పార్టీని, మహిళలు అసహ్యించుకుని, చీపుర్లతో తరిమినట్టు ఓటు వేసి బుద్ధి చెప్పారు. కనీసం ఆ 11 మంది ఎమ్మెల్యేలు కూడా తమకు ఇష్టం లేనట్లుగా వీళ్ళు ఇలాంటి పనులు చేస్తూ మారకపోయేసరికి, జనమే జగన్‌కు దూరంగా వస్తున్నాడని తెలిసి, ఇళ్ళల్లో నుండి బయటికి రాలేదు.
ఒకప్పుడు కడపకు దీటుగా వైకాపాకు బలమైన కంచుకోటగా నిలిచిన అదే నెల్లూరు… గత ఎన్నికల్లో వైకాపాకు బుద్ధి చెప్పింది. ఇప్పుడు జగన్ వస్తే ముఖం చాటేసింది. ఆఖరికి గ్రాఫిక్స్‌తో నెల్లూరులో బంగారుపాళ్యం జనాన్ని చూపించుకోవాల్సిన దుస్థితికి దిగజారింది. ఇది నెల్లూరు ప్రజల ఆగ్రహం! మహిళలను అవమానించినందుకు ఇచ్చిన తీర్పు!