ఎక్కడ అటెండెన్స్ మిస్ అవుతుందో అని భయపడే విద్యార్థిలా!
ఆయన ఆన్ డ్యూటీ.
సింగపూర్ పర్యటనలో కాకరకాయ జ్యూస్, వెజిటబుల్ భోజనాలు వడ్డించిన హోటల్ సిబ్బంది సైతం ఆయనతో ఫోటోలు తీసుకున్నారు. సింగపూర్‌లో ఉన్న తెలుగు ప్రజలంతా వచ్చి ఆయనకు ఘనంగా వీడ్కోలు పలికారు.
ఎప్పుడు వచ్చారో, ఎన్ని గంటలు నిద్రపోయారో ఎవరికీ తెలీదు. నాలుగు రోజులపాటు ఆయన ఒళ్లు పులిసిపోయేలా తిరిగారు. లెక్కలేనన్ని మీటింగ్‌లు పెట్టారు కదా! కనీసం ఒక అరపూటైనా విశ్రాంతి తీసుకోవచ్చు కదా అనిపించింది. కానీ ఆయన ఆగలేదు.
అమరావతి – తన కలల రాజధానిపై ఆయనకు ఎంత తపనో! రాజధాని అమరావతి బ్యూటిఫికేషన్, గ్రీన్ -బ్లూ మాస్టర్ ప్లాన్‌పై వెంటనే సమీక్ష పెట్టారు. అమరావతిలో ట్రంక్ రోడ్లు, ఇతర అనుబంధ రోడ్లు, ఎల్పీఎస్ రోడ్లు, బఫర్ జోన్లలో ప్లాంటేషన్, బ్యూటిఫికేషన్, అవెన్యూ ప్లాంటేషన్‌పై చర్చించారు.
అంతర్జాతీయ ప్రమాణాలతో పార్కులు, పచ్చని ప్రాంతాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఔషధ మొక్కలను నాటాలని, అమరావతిలో జీవవైవిధ్యం (బయోడైవర్సిటీ) ఉండేలా కార్యాచరణ చేపట్టాలని సూచించారు.
గ్రీన్ బెల్ట్ ప్రాంతంలో మన దేశీయ వృక్షజాతులు ఉండేలా చూడాలని స్పష్టం చేశారు. నది ముఖద్వారం కూడా సుందరంగా కనిపించేలా ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని, సమీక్షకు హాజరైన పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి సురేష్ కుమార్, ఏడీసీ సీఎం లక్ష్మీ పార్ధసారధికి ఆదేశాలు జారీ చేశారు.
బయటి ప్రపంచంలో ఆయన అధ్యయనం చేసింది, తెలుసుకున్నది… మనకు తగ్గట్లుగా ఎలా అమలు చేయాలి, ప్రజలకు ఎలా అందించాలి అనే ఆయన తపన చూస్తుంటే, అటెండెన్స్‌తో పాటు పాఠం కూడా మిస్ అవ్వకూడదు అనే క్రమశిక్షణ గల విద్యార్థి గుర్తుకొచ్చారు. ఆ అంకితభావం, ఆ నిబద్ధత నిజంగా హృదయాలను కదిలిస్తాయి.