– బీసీలకు రిజర్వేషన్లపై మద్దతు ఇచ్చి ముస్లింల పేరు మీద అడ్డుకుంటున్నారు
– బీసీ రిజర్వేషన్లపై ధర్నా చేస్తున్న బిజెపి నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్ ఫైర్
హైదరాబాద్ : ప్రజా పాలన ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్ నుండి మొదలు కుల గణన చేసి న్యాయపరమైన చిక్కులు లేకుండా బీసీలకు రాజకీయ విద్య ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలు చేస్తూ శాసనసభ ద్వారా చట్టం చేసి గవర్నర్ కి పంపించి అక్కడినుండి రాష్ట్రపతికి పంపించడం వరకు మేము చిత్తశుద్ధితో పనిచేస్తున్నాం
రాష్ట్రపతి ఆమోదం పొందాల్సిన ఈ బిల్లు పై బిజెపి కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకునే ప్రయత్నం చేస్తున్నారు. శాసనసభ లో బీసీలకు రిజర్వేషన్లపై మద్దతు ఇచ్చి ముస్లింల పేరు మీద అడ్డుకుంటున్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తప్పులు ఉంటే సవరించి బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఆమోదింపజేయాలి. బీసీ లకు న్యాయం చేయాలి.
బలహీన వర్గాల వ్యతిరేకి రామచంద్రరావు చేసే ధర్నాలు మీరు పాల్గొని మీరు కూడా బలహీన వర్గాల వ్యతిరేకి గా మారుతున్నారు. బిజెపి నేతలు బీసీలు రిజర్వేషన్లు సాధించాలనుకుంటే ఈ ధర్నా ఢిల్లీలో చేయాలి ప్రధాని మోడీని ఒప్పించండి. ఈ ప్రభుత్వం 42 శాతం రిజర్వేషన్లు సాధించిన తర్వాతనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని భావిస్తుంది
తెలంగాణ ఉద్యమంలో జేఏసీ ఏర్పాటు చేసుకొని రాష్ట్రాన్ని సాధింకున్నామో ఇప్పుడు బీసీ రిజర్వేషన్లు 42 శాతం అమలు చేయడానికి బీసీ సంఘాలు మేధావులు కదలాలి. రేపు 4 తారీఖు అందరం ఢిల్లీ వెళ్దాం రండి మన రిజర్వేషన్లు సాధించుకుందాం.
బీజేపీ అధ్యక్షడు రామచంద్రరావు ధర్నా చేయాల్సింది హైదరాబాద్ లో కాదు ఢిల్లీ లో చేయాలి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ధర్నా చౌక్ లో కూర్చుంటున్నారు. మీరు ప్రధాన మంత్రి కి ఒక్క మాట చెప్తే తెలంగాణ లో బీసీ లకు 42 శాతం రిజర్వేషన్లు అమలు అవుతాయి. బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు పక్కా బీసీ ల వ్యతిరేకి.
కామారెడ్డి డిక్లరేషన్ నుండి కుల గణన , బీసీ లకు రాజకీయ విద్యా ఉద్యోగాల్లో 42 శాతం రిజర్వేషన్లు చట్టం చేసి గవర్నర్ ఆమోదం పొంది రాష్ట్రపతి పంపేవరకు మేము మా చిత్తశుద్ధి నిరూపించుకున్నాం. ముస్లింల పేరు చెప్పి రిజర్వేషన్లు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు.కడుపులో కత్తులు పెట్టుకొని అలుముకున్న విధంగా బీజేపీ నేతలు చూస్తున్నారు.
తెలంగాణ యావత్ బీసీ నేతలు,కుల సంఘాలు ఐక్యం కావాలి మన హక్కుల కోసం కోట్లడాలి సాధించుకోవాలి. బీజేపీ నేతలు మీ స్థాయిని ధర్నా చౌక్ దగ్గరకు తీసుకోకండి. మాతో కలిసి ఢిల్లీ రండి.కేంద్రంలో అధికారంలో ఉండి బీజేపీ నేతలు ధర్నా చేస్తే ప్రజలు నవ్వుకుంటున్నారు