– బెయిల్ మీద ఉంటూ సీఎం కుర్చీని కాపాడుకుంటున్నారు
– సిగ్గు, సిగ్గు విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తి తెలంగాణకి ముఖ్యమంత్రి
– కమిషన్ల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి రేవంత్..
– ఓటుకి నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు
– ఇప్పుడు రేవంత్ ప్లాన్‌లో కవిత నడుస్తున్నారు
– ఇది క్విడ్ ప్రో కో “నువ్వు నాకు, నేను నీకు” అన్న రాజకీయ ఒప్పందం
– రేవంత్..! కుట్రల రాజకీయాలకు రోజులు దగ్గర పడ్డాయి
– నీ పదవికాలం లెక్క పెట్టుకో…
– బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షుడు డాక్టర్ ప్రభాకర్ హెచ్చరిక
హైదరాబాద్: తెలంగాణలో కమీషన్ల పాలన నడుస్తోంది. ప్రజాస్వామ్యం అంటే – ప్రజల కోసం, ప్రజల చేత, ప్రజల ద్వారా పాలన. “By the people, of the people, for the people” అని నిర్వచిస్తారు. కానీ, మన రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం.. ప్రజల కోసం కాకుండా, కమిషన్ల కోసం, కమిషన్ల చేత, కమిషన్ల పాలనలా వ్యవహరిస్తోందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు డాక్టర్ ఎన్.వి.ఎస్.ఎస్. ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు ఆయన గురువారం విలేఖర్లతో మాట్లాడారు. రేషన్ కార్డుల్లో పేర్లు చేర్చాలంటే కూడా కమిషన్ కావాలి. ఇందిరమ్మ ఇల్లు రావాలంటే కమిషన్ తప్పనిసరి. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించాలంటే కూడా కమిషన్ చెల్లించాల్సిందే. కాంగ్రెస్ పాలన మొత్తం కమీషన్ల మయం అయిపోయిందన్నారు. ఇలాంటి విషయాలు రోజుకో ఉదాహరణగా సామాజిక మాధ్యమాల్లో, పత్రికల్లో, ప్రజా వేదికల్లో స్పష్టంగా కనిపిస్తున్నాయి.
మరోవైపు, అసలు ఈ ప్రభుత్వంలో ఉన్నది కమిషన్ల కోసమే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. సెక్రటేరియట్ దగ్గర బిల్లుల కోసం కాంట్రాక్టర్లు ఎలా బయటపడ్డారో మనం చూశాం. జీహెచ్ఎంసీ ఆవరణలో కూడా “కమిషన్ల కోసమే ఉన్నాం” అన్నట్టుగా వార్తలు వచ్చాయని పేర్కొన్నారు.
ప్రతి రోజూ అధికారులు ఏసీబీకి పట్టుబడుతున్నారు. కమిషన్లు తీసుకుంటూ, రెడ్ హ్యాండెడ్ గా అందులో చిక్కుకుంటున్నారు. ఈ సంఘటనలన్నీ పాలన ఎలా ఉందో స్పష్టంగా చెబుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరే.. “కమిషన్ లేనిదే పని జరగదు” అన్నట్టు ఉంది. పాలన అంటే ప్రజల కోసమని కాదు, కమీషన్ల కోసమే అని స్పష్టంగా కనిపిస్తోంది. ఈ పరిస్థితుల్లో.. జనంలో ఓడిపోయిన రేవంత్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎన్నికవ్వడం దురదృష్టకరం. బెయిల్ పై ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి అయ్యాడు… రేవంత్ …! ప్రధాని నరేంద్ర మోదీని విమర్శించే స్థాయి నీదికాదు.
బెయిల్ మీద ఉన్న ఒక వ్యక్తి, విచారణను ఎదుర్కొంటున్న వ్యక్తి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. ఇప్పుడు ఆయన కుర్చీని కాపాడుకోవడం కోసమే ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు. బ్రీఫ్‌కేసులు, సూట్‌కేసులు పంచుతూ ముఖ్యమంత్రి కుర్చీని కాపాడుకుంటూ, కమిషన్ల ముఖ్యమంత్రిగా పేరు తెచ్చుకున్న వ్యక్తి రేవంత్.. ప్రధాని నరేంద్ర మోదీపై విమర్శలు చేసే స్థాయి రేవంత్ ది కాదని హెచ్చరిస్తున్నాం.
ఓటుకి నోటు కేసులో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడి, ఇప్పటికీ బెయిల్ మీద ఉన్న వ్యక్తి రేవంత్ రెడ్డి. ఆయనకు బాసటగా ఉన్నవారు.. బెయిల్ మీద ఉన్న మరో వ్యక్తి రాహుల్ గాంధీ. సూట్‌కేసులు అందిస్తేనే బాసట లభించే విధంగా వీరి మధ్య సంబంధం ఉంది. ఇదే కమిషన్ల పాలనలోని నిజమైన చిత్రం.
అప్పుడు కవిత కోసం కేసీఆర్.. రేవంత్ ను కాపాడితే.. ఇప్పుడు రేవంత్ రెడ్డి.. కవిత కోసం కేసీఆర్ ను కాపాడుతున్నాడు. అప్పుడూ కవిత ప్లాన్ లో రేవంత్ రెడ్డి నడిస్తే.. ఇప్పుడు రేవంత్ ప్లాన్‌లో కవిత నడుస్తున్నారు. ఇది క్విడ్ ప్రో కో “నువ్వు నాకు, నేను నీకు” అన్న రాజకీయ ఒప్పందంలో భాగమే. రేవంత్..! కుట్రల రాజకీయాలకు రోజులు దగ్గర పడ్డాయి, నీ పదవికాలం లెక్క పెట్టుకో. ఐదేళ్ల సార్వత్రిక ఎన్నికల్లో ఇప్పటివరకు రెండు సంవత్సరాలు దాటిపోయాయి. పార్లమెంటు ఎన్నికలయ్యి కూడా సంవత్సరం దాటింది. నీ పదవికాలం కూడా 20 నెలలు దాటింది. రానున్న రోజుల్లో నిన్ను ఇంటికి పంపించడం ఖాయం