– ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి
విజయవాడ: ప్రజాస్వామ్యానికి పునాది ఓటు హక్కు. సమానత్వం ప్రస్ఫుటంగా కనిపించేది ఒక ఓటు విషయంలోనే.. ఒక పూట కూడా తిండి దొరకని పేదవాడికైనా, లక్షల కోట్లు ఉన్న ధనవంతుడికైనా ఓటు దగ్గర సమానమేనని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి అన్నారు. ఈ మేరకు ఆమె సోమవారం విలేఖర్లతో మాట్లాడారు. ఇంకా, ఆమె ఏమన్నారంటే… రాజ్యాంగం మనకిచ్చిన వజ్రాయుధం లాంటి పవిత్రమైన ఓటు బీజేపీ అధికార దాహానికి దుర్వినియోగం అవుతుంది.
దొంగ ఓట్ల చేరికతో వ్యవస్థ భ్రష్టుపట్టింది. దొడ్డిదారిలో బీజేపీ గెలుపు కోసం ఎన్నికల కమిషన్ నే కలుషితం చేశారు. ప్రజాస్వామ్యానికి కాపు కాయాల్సిన ఈసీ మోడీ కాపు కాస్తోంది. ఎన్నికల కమిషన్ తీరు చూస్తే మేడిపండు చందంగా ఉంది. స్వతంత్ర వ్యవస్థ కాస్త బీజేపీ చేతిలో కీలుబొమ్మగా మారింది. ఆర్ఎస్ఎస్ లాంటి అనుబంధ సంస్థల జాబితాలో ఈసీ కూడా భాగమైంది. ఇవ్వాళ దేశంలో ఎన్నికల కమిషన్ అంటే “ఎలక్షన్ చోర్ కమిషన్”.
మోడీ ఓట్ల దొంగ కాబట్టే ఈ మౌనం. రాహుల్ గాంధీ బయటపెట్టిన నిప్పు లాంటి నిజాలపై సమాధానం చెప్పే దమ్ములేక .. డిక్లరేషన్ అంటూ వెనకుండి నాటకాలు ఆడిస్తున్నారు. మోడీ కి జీ హుజూర్ అనకపోతే.. రాహుల్ గాంధీ సంధించిన 5 ప్రశ్నలపై ఈసీఐ వెంటనే సమాధానం చెప్పాలి. డిజిటల్ ఓటర్ జాబితా ఎందుకు ఇవ్వడం లేదు?
సీసీటీవీ ఆధారాలు ఎందుకు నాశనం చేశారు? నకిలీ ఓటర్ల జాబితా ఎందుకు తారుమారు అయింది?
ప్రతిపక్ష నేతలను ఎందుకు బెదిరిస్తున్నారు? బీజేపీకి ఎన్నికల సంఘం ఏజెంట్ గా మారిందా? ఈసీఐ స్వతంత్ర వ్యవస్థే అయితే, ప్రజాస్వామ్యం ఈసీకి ముఖ్యం అనుకుంటే, ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ లేవనెత్తిన సందేహాలకు బదులివ్వాలి. రాహుల్ గాంధీ ప్రారంభించిన ఓట్ చోర్ క్యాంపెయిన్ ను .. ఆంధ్రప్రదేశ్ లో సైతం కాంగ్రెస్ పార్టీ పక్షాన ప్రతి గడపకు చేరుస్తాం. ఓట్ల దొంగ మోడీ తీరును, బీజేపీ కోసం అధికార దుర్వినియోగం చేసిన ఎన్నికల కమిషన్ వైఖరిని ఎండగడతాం.
“I support Rahul Gandhi’s demand of digital voter rolls From the EC”.
Join us and support our demand – visit votechori.in/ecdemand
Or give a missed call on 9650003420
– This fight is to protect our democracy.