– బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపు
చిత్తూరు: ప్రతి బీజేపీ కార్యకర్త ప్రజానాయకుడుగా ఎదగాలి… అందుకు అనుగుణంగా ప్రణాళికలు రచించు కోవాలని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ పిలుపు ఇచ్చారు. చిత్తూరు జిల్లా సారథ్యం యాత్రలో భాగంగా పార్టీ కార్యకర్తల సమావేశంలో పాల్గొని, మాట్లాడారు. బీజేపీ కార్యకర్తలకు భయం జంకు అవసరం లేదు… ప్రజాక్షేత్రంలో బీజేపీ బలపడాలని అందుకు అనుగుణంగా గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపల్ కార్పొరేషన్, కౌన్సిల్ ఎన్నికలలో పోటీ చేసేందుకు సమాయత్తం కావాలని మాధవ్ కార్యకర్తలలో జోష్ నింపారు.
బీజేపీ కార్యాలయాలు ప్రజల సమస్యలు పరిష్కారం చేసే వేదికలు గా మార్చాలని సూచించారు. అదేవిధంగా ప్రతి సోమవారం కలెక్టరేట్ కార్యాలయంలో నిర్వహించే స్పందన కార్యక్రమాల్లో ప్రజల సమస్యల్ని పరిష్కరించడానికి మన వంతు కృషి చేయాలని మాధవ్ కోరారు. మండల, గ్రామ స్థాయిలో సమస్యలు తెలుసుకుని వాటిని కలెక్టర్ కార్యాలయంలోని స్పందన లో సమస్యలు పరిష్కారం చేసే విధంగా స్థానిక నాయకత్వం కృషి చేయాలన్నారు. రాష్ట్రంలో అధికారంలో భాగస్వామ్యం ఉన్న పార్టీ గా ప్రజాసమస్యల పరిష్కారం కోసం ప్రయత్నం చేస్తాను. నామినేటెడ్ పోస్టులతో పాటు సాగునీటి సంఘాల లో ప్రాతినిధ్యం వచ్చి న విషయాన్ని ఈ సందర్భంగా మాధవ్ గుర్తు చేశారు. ప్రసంగం తొలుత సర్ కట్టమంచి రామలింగారెడ్డి ని స్మరించుకుంటూ ఆయన కృషిని వివరించారు. కట్టమంచిరామలింగారెడ్ఢి ఆంధ్రా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ గా ఆనాడు చేసిన సేవలు మరువలేనివి అన్నారు. చిత్తూరు జిల్లాలో పాడి పరిశ్రమల అభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా మామిడి రైతులు కు భరోసా ఇచ్చేందుకు పార్టీ పరంగా కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్తానని హామీ ఇచ్చారు.
ఛాయ్ పే చర్చ లో మాధవ్…
మ్యాంగో బోర్డు ఏర్పాటు చేయాలి… మామిడికాయలకు ధరలు పెంచాలి అనే అంశం మాధవ్ వద్ద చర్చకు వచ్చింది. రైతులకు యూరియా సరఫరా చేయాలి. నేషనల్ హైవే చక్కగా ఉందని స్థానికులు బీజేపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రి అభివృద్ధి చేయాలని, పరిశ్రమలు ఏర్పాటు చేయాలని కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేయాలని, చిత్తూరు జిల్లా కేంద్రానికి మెడికల్ కాలేజ్ ఏర్పాటు చేయాలని, స్థానికులు కోరగా వెంటనే మాధవ్ స్పందిస్తూ కూటమి ప్రభుత్వం చిత్తూరు అభివృద్ధికి కట్టుబడి ఉందని తెలిపారు. బీజేపీ వైపు నుంచి తన వంతు కృషి చేస్తానని భరోసా ఇచ్చారు.