– పి జి ఆర్ ఎస్ లో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు
– ఆర్టికల్ 17, 21 ధిక్కరణ ఆరోపణలు
బాపట్ల: కాకినాడ కలెక్టర్ గా విధులు నిర్వహిస్తున్న ఐఏఎస్ అధికారి సగిలి షన్ మోహన్ పై క్రిమినల్ కేసు నమోదు చేసి సమగ్ర విచారణ చేయాలని సీనియర్ జర్నలిస్టు ఎన్. నాగార్జున రెడ్డి సోమవారం బాపట్ల జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ తుషార్ డూడి ఐపీఎస్ ను కలిసి ఆధారంతో ఫిర్యాదు చేశారు.
ఉమ్మడి ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ గా విధులు హించిన సమయంలో అవినీతికి పాల్పడి అధికార దుర్వినియోగం చేసి, భారత రాజ్యాంగ స్ఫూర్తిగా విరుద్ధంగా వ్యవహరించిన సగిలి షన్ మోహన్ ఆర్టికల్ 21 ఉల్లంఘించిన విషయమై పి జి ఆర్ ఎస్ ఫిర్యాదులు BPT2024071012, BPT20240704334 విషయమై విచారణ జరిపిన చీరాల రూరల్ సిఐ నిమ్మగడ్డ సత్యనారాయణ, జిల్లా పోలీస్ కార్యాలయానికి సమర్పించిన విచారణా నివేదికతోపాటు బాధితులు, ఫిర్యాదుదారుని వద్ద నమోదు చేసిన స్టేట్ మెంట్స్ సమర్పించినప్పటికీ, నివేదికలను తగు చర్యల నిమిత్తం ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లకుండా కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నారనీ ఫిర్యాదారుడు ఎస్పీకి ఫిర్యాదు చేశారు.
ఐఏఎస్ అధికారి సగిలి షన్ మోహన్ పై నమోదైన ఫిర్యాదుపై సమగ్రంగా విచారణ జరిపిన చీరాల రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ సమర్పించిన విచారణా నివేదిక ప్రకారం, “ఒక మత్స్యకార కుటుంబం సామాజిక బహిష్కరణ చేసిన విషయమై నమోదైన ఫిర్యాదు విచారణలో భాగంగా రామచంద్రాపురం గ్రామంలో నిర్వహించిన గ్రామ సభలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆమంచి కృష్ణమోహన్ ను అప్పటి జాయింట్ కలెక్టర్ సగిలి షన్ మోహన్ తన ప్రక్కనే కోర్చోబెట్టుకుని విచారణ చేశారు.
“మీరు మీరు కొట్టుకోండి, మీరు మీరు వెలివేసుకోండి, మీకట్టుబాటుని కాదని మేము ఎంటర్ కాము, మాకు రైట్ లేదు, ఆవిషయంలో మీకట్టుబాటుని కాదని మేము ఏమీ చేయలేము, ప్రభుత్వం కూడా చేసే పరిస్తితిలో లేదు, చేయదు కూడా” అంటూ గ్రామసభలో బహిరంగంగా ప్రకటన చేయడం ద్వారా భారత రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకంగా వ్యవహరించారని ఫిర్యాదుదారుడు ఎన్.నాగార్జున రెడ్డి ఆరోపించారు.
సగిలి షన్ మోహన్ తో సహా గ్రామసభలో పాల్గొన్న వివిధ శాఖలకు చెందిన ప్రభుత్వ అధికారులతో పాటు ఇప్పటికీ తప్పుడు నివేదికలతో గత ఆరు సంవత్సరములుగా ఉద్దేశ్యపూర్వకంగా కాలయాపన చేస్తూ, తప్పుడు నివేదికలు సమర్పించి చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడుతున్న వివిధ ప్రభుత్వ శాఖల అధికారులపై క్రిమినల్ కేసు నమోదు చేయడంతో పాటు, శాఖపరమైన చర్యలు చే పట్టాలని కోరారు.
భారత రాజ్యంగ వ్యవస్థ శక్తి సామర్ధ్యాలను ప్రదర్శించడం ద్వారా ప్రభుత్వ పనితీరును స్పష్టం చేసి ప్రజలలో ప్రభుత్వం పట్ల, వ్యవస్థల పట్ల అమితమైన విశ్వాసం, భద్రతాభావం కలిపించాలని జిల్లా ఎస్పీని కోరగా, ఈ వ్యవహారం పై సమగ్రంగా విచారణ చేపట్టడంతో పాటు, రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానని ఎస్పీ తెలిపినట్లు ఫిర్యాదుదరుడు ఎన్.నాగార్జున రెడ్డి మీడియాకు తెలిపారు.