(చాకిరేవు)
పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైలు, రోడ్లు, జల మార్గాల రవాణాలకు ఒక వ్యవస్థ.
ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షలో కీలక నిర్ణయాలు – లాజిస్టిక్స్ కార్పోరేషన్, మారిటైం పాలసీ, షిప్ బిల్డింగ్ యూనిట్లు
ఆంధ్రప్రదేశ్‌ను దేశ సరుకు రవాణా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రాష్ట్రంలోని పోర్టులు, ఎయిర్ పోర్టులు, రైలు, రోడ్లు, జల మార్గాల సమన్వయంతో సరుకు రవాణా వ్యవస్థను సమగ్రంగా అభివృద్ధి చేయాలని ఆదేశించారు.
లాజిస్టిక్స్ కార్పోరేషన్ – అభివృద్ధికి గ్రోత్ ఇంజిన్!
– ఏపీతో పాటు పొరుగు రాష్ట్రాల సరుకు రవాణా నిర్వహణకు ప్రత్యేక లాజిస్టిక్స్ కార్పోరేషన్ ఏర్పాటు
– పోర్టులు, ఎయిర్ పోర్టుల సమీపంలో శాటిలైట్ టౌన్ షిప్పుల అభివృద్ధి
– MSME పార్కుల వద్ద కూడా శాటిలైట్ టౌన్ షిప్పుల ప్రణాళిక
– కుప్పం, దగదర్తి ఎయిర్ పోర్టుల పనులు వేగవంతం
– నేషనల్ హైవే, రైలు కనెక్టివిటీతో అంతర్గత రవాణా మౌలిక సదుపాయాల బలోపేతం
మారిటైం పాలసీలో మార్పులు – పెట్టుబడులకు ఆహ్వానం!
– షిప్ బిల్డింగ్ యూనిట్లకు మార్గం సుగమం చేసే విధంగా మారిటైం పాలసీలో మార్పులు
– మచిలీపట్నం, మూలపేట, చినగంజాం ప్రాంతాల్లో షిప్ బిల్డింగ్ యూనిట్లకు ఆసక్తి
– స్థానిక మత్స్యకారుల హక్కులను కాపాడే విధంగా నిర్మాణ ప్రణాళిక
– క్రూయిజ్ టెర్మినల్స్, కంటైనర్ పోర్టుల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
– గత ప్రభుత్వ నిర్వాకం వల్ల తమిళనాడుకు వెళ్లిన కంటైనర్ పోర్టు – ఇకపై అలాంటి తప్పిదాలు జరగవు!
దేశ సరుకు రవాణా మ్యాప్‌లో ఏపీని కేంద్ర బిందువుగా మార్చే ఆలోచనలు!
– ఉత్తర-దక్షిణాది రాష్ట్రాలకు కనెక్టివిటీకి ఏపీనే కేంద్రం
– తక్కువ వ్యయంతో, వేగవంతమైన సరుకు రవాణా మార్గాల అభివృద్ధి
– బ్లూ ప్రింట్ సిద్ధం – ఎక్కడ, ఎలా అభివృద్ధి చేయాలో స్పష్టత
– కేంద్ర నిధుల వినియోగంపై స్పష్టమైన దిశానిర్దేశం