– పట్టుకెళ్లే సిబ్బందికి వ్యక్తులు కానీ, సంస్థలు కానీ అడ్డు తగిలి వ్యతిరేకించినా వారిపై చట్టపరమైన కేసు
– స్టెర్లైజ్ చేసి తిరిగి వాటిని వీధుల్లో , కాలనీల్లో , జనావాసాల్లో వదలకూడదు
– సుప్రీం కోర్టు తీర్పు
ఢిల్లీ : గత కొంత కాలంగా దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో , ముఖ్యంగా ఢిల్లీలో వీధికుక్కల దాడిలో అనేకమందికి తీవ్ర గాయాలపాలై, కొంత మంది చిన్నారులు, పెద్దలు ప్రాణాలు కోల్పోయిన అనేక సంఘటనలు దృష్ట్యా .. భారతదేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీం కోర్టు ఈ కేసులు అత్యంత దయనీయమైన ఒక ప్రధాన సమస్యగా పరిగణించి సుమోటోగా స్వీకరించింది. ఈ కేసుకు సంబంధించి పలు మార్లు జరిగిన వాదోప వాదనల అనంతరం నేడు, ప్రజా ప్రయోజనాల దృష్ట్యా కీలకమైన తీర్పును వెలువరించింది.
డిల్లీలో జరిగిన అనేక వీధికుక్కల దాడి ఘటనల నేపథ్యంలో ప్రతి రోజూ దాదాపు 2000 వేలకుపైగా కుక్కకాటు కేసులు కేవలం డిల్లీ లోనే నమోదు అవ్వటం తో సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కీలక మైన తీర్పు ను విడుదల చేశారు.
జనా వాసాల్లో , కాలనీల్లో బహిరంగ ప్రదేశాల్లో గుంపులు గుంపులుగా వీధికుక్కలు ఎక్కడ పడితే అక్కడ , చిన్నపిల్ల పై , పాదచారుల పై దాడి చేసి ప్రాణాల కోల్పోయేలా జరుగుతున్నందున, తక్షణమే వీధి కుక్కలను పట్టుకొని వాటికి స్టెర్లైజ్ చేసి వాటికోసం ప్రత్యేక షెల్టర్లు ఏర్పాటు చేసి అక్కడే ఉంచాలి ,తప్ప తిరిగి వాటిని వీధుల్లో , కాలనీల్లో , జనా వాసాల్లో ఎట్టి పరిస్థితుల్లో వదలకూడదని, ఆరునుండి ఎనిమిది వారాల్లోపు వాటి సంరక్షణ కై తగిన సిబ్బంది, నిరంతరం నిఘా కెమెరాలు ఉన్న ఆశ్రయాల్లో ఏర్పాటు చేయాలని ఆదేశించింది.
వీధి కుక్కలను పట్టుకెళ్లే సిబ్బందికి ఎవరైనా వ్యక్తులు కానీ, సంస్థలు కానీ అడ్డు తగిలి,వ్యతిరేకించినా వారిపై చట్టపరమైన కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని ఇది ప్రజా ప్రయోజనం దృష్టిలో ఉంచుకొని జారీ చేసిన తీర్పుగా ప్రకటించింది.