మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్.
హైదరాబాద్: శంషాబాద్ లో గౌడ సంఘం నాయకులతో మాజీ మంత్రి వి శ్రీనివాస్ గౌడ్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. గత BRS ప్రభుత్వంలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ విగ్రహాన్ని ట్యాంక్ బండ్ పై ఏర్పాటు చేయడానికి మెమో నంబర్ 3347/డి/2021, తేదీ. 30/11/2022 తో ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది.
ట్యాంక్ బండ్ పై సాగర్ పార్క్ వద్ద స్థల పరిశీలన చేసి, విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి మెమో నంబర్.3347/డి/2023, తేదీ. 18/08/2023న రూ 3కోట్లు నిధులు కేటాయించడం జరిగింది. ఎన్నికల కోడ్ రావడం వలన పనులను ప్రారంభించలేదు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు అవుతుంది, ఇప్పటివరకు అక్కడ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టలేదు. గత సంవత్సరమే విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామన్నారు, ఇప్పటివరకు చేయలేదు. కనీసం ఈ ఆగస్ట్ 18వ తేదీనైనా ట్యాంక్ బండ్ పై సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి సందర్భంగా, భూమి పూజ చేసి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి.
సర్దార్ సర్వాయి పాపన్న, గౌడ్ లకే కాదు బహుజనులకు రాజు. క్షత్రియులే రాజులు కావాలన్న ఆచారం ఉన్నప్పుడు, ఒక సామాన్యుడు కూడా రాజు కావచ్చు అని 33 కోటలను జయించి నిరూపించిన వీరుడు. లండన్ లోని కేంబ్రిడ్జి యూనివర్సిటీలో ఆయన చరిత్ర, విగ్రహంతో పాటు భద్రంగా ఉంది, ఆయనకు సర్దార్ అనే బిరుదును కూడా ఇవ్వడం జరిగింది. తెలంగాణ బిడ్డ, ఆసియా ఖండంలోనే మొట్టమొదటి రాజు అనే చరిత్ర ను, అందరికీ తెలపాల్సిన అవసరం ఉంది
ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు సురేష్ గౌడ్, నవీన్ గౌడ్, నీలం గౌడ్, భాస్కర్ గౌడ్, ఆనంద్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, చంద్ర శేఖర్ గౌడ్, వెంకటేష్ గౌడ్, సత్యనారాయణ గౌడ్ మరియు తదితరులు ఉన్నారు.